సినిమాప్రీవ్యూ
కృష్ణాపత్రికలో ఏదైనా అచ్చు పడితే చాలా గొప్పగా
చెప్పుకొనే వారు.అది శిలాశాసనం కిందే అనుకొనేవారు.రాజకీయాల్లో
గానీ మరె రంగం లో నైనా అభిప్రాయం చెప్పాల్సివస్తే "చూద్దాం,
ముట్నూరి వారేమంటారో" అని పత్రిక కోసం చూసేవారు.పత్రిక అంటె
అంత, గౌరవం, అంత గురి.శుక్రవారం లక్ష్మీప్రదమని అందరూ విశ్వ
సిస్తారు.బందరులో సినిమాలు శుక్రవారమునాడు విడుదల చేసేవారు.
కృష్ణాపత్రిక శుక్రవారమె వచ్చేది.ఆవేళ విడుదలయిన సినిమాకి
ఆరోజు పత్రికలో రివ్యూ రాలి. అదిచూసి ప్రజలు సినిమాకి వెళ్ళే
వాళ్ళు.అందుకని హాలు యజమానులు గురువారం నాడే పత్రికకి ప్రత్యేకముగ
ప్రీవ్యూవేసి చూపించేవారు. కృష్ణారావుగారు కూడా కొన్ని సినిమాలు
చూసేవారు.రివ్యూలు నాన్నగారు వ్రాసేవారు.
గురువారం పొద్దున మాఇంటికి గుర్రపు బండి వచ్చేది.
గుర్రపు బండి వచ్చిందంటే నాన్నగారు సినిమాకు వెళ్తున్నట్లు నాకు
అర్ధమయిపోయేది. "నాన్నగారూ!గుర్రపుబండి వచ్చింది"అనిచెప్పి[అప్పుడు
అన్నిట్కి వార్తా హరురాలినినేనే!]మొఖం కాసిని నీళ్ళుపెట్టి కడుక్కొని,
గౌను మార్చేసుకొని వెళ్ళి గుర్రపు బండీలో కూర్చునేదాన్ని.బండీవాణ్ణీ
అడిగేదాన్ని"ఏహాలుకివెడతాము,ఏసినిమా!అని.[ఏసినిమా అయినా మనకేమీ
లెఖ్ఖ లేదు,మనకి కావలసిందల్లా గుర్రపు బండిలో వెళ్ళడం,అక్కడ
వారిచ్చే శీతల పానీయం తాగదం,అటునుంచి ఆఫీసుకు వెళ్ళి రావడము.
మానాన్నగారు తయారయి వచ్చి చూస్తే నేను బండీలో సిధ్ధం.ఏమీ
అనేవారుకాదు,కనీఒకొకసారి విసుక్కొనేవారు,ఇప్పుడెందుకమ్మా!ఈసారి
తీసుకెడతాలే అని.ఆ కోపములో వున్న తీవ్రతని పట్టి నడుచుకొనేదాన్ని.
వెళితే మాత్రం మహదానందంగా వుండేది.
మామూలు సినిమాలకి ట్రయల్పార్టీ అని ఏవేవో చూ
పించేవారు.ఇలా వెళ్ళినపుడు,సినిమా మొదలు పెట్టేసేవారు కాఫీ కప్పుతో.
ఆసినిమాచూడాలంతే నాకు చాలా అసహనంగా వుండేది.ఇంటెర్వల్ రావలి.
ఎందుకు? అప్పుడేగా మరి శీత్ల పానీయాలు,కిల్లీ ఇస్తారు,అందుకు.శుభ సమయం
వచ్చేది.లైట్లు వేసేవారు.పానీయాలు వచ్చేవి.ఆత్రమేగానీ పూర్తిగా
సీసా తాగలేకపోయేదాన్ని. ఇంతలోఅ మానాన్నగారు తను కాస్త చప్పరించి
ఆసీసాకూడా నాచేతిలో పెట్టి సిగరెట్టు కాల్చుకోఅడానికి బయటికి వెళ్ళేవారు.
ఒక చేతులో లడ్డూఅంట కిళ్ళీ,ఎలా పట్టుకోనూ?నెను సగం తాగిన సీసా తో
కిళ్ళీపట్టుకొని,పూర్తిగావున్న సీసా కుడిచేతితో జాగ్రత్తగా పట్టుకు కూర్చునేదాన్ని.
అప్పుడు నాన్నగారు నా ఎడమ చెతులో వున్న సగం సీసా తీసుకొని మధ్యంధ్య
చప్పరిస్తూ సినిమా చూసేవారు.ఈ నిండు సీసా మనకి ఖాయం.ఇంటికెళ్ళే
లోఅపల తాగెయ్యవచ్చు అనుకొనేదాన్ని.
సినిమా అయాక అందరూ ఇళ్ళకి తలో వేపూ వెళ్ళేవారు,
నెనూ నాన్న గారితో పాటు ఆఫెసుకు వెళ్ళేదాన్ని.నన్నగారు అప్పుడువెళ్ళి సినిమా
రివ్యూ వ్రాసి చొంపోజెకి ఇచ్చిన తరువాత మేమిద్దరం నడుచుకొంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం.
నాన్నగారు ఆఫీసులో వ్రాసుకొంతున్నంత సేపూనెను పూలుకోఅసుకొంటూనో,ప్రింటింగ్ ప్రెస్స్
దగ్గరో కాలక్షేపం చేసెదాన్ని.మరునాడు ఆసినిమా రివ్యూ కంపోజె చేసింది ఇంటికి
తీసుకువ స్తె అదేదో నెను వ్రాసినట్లె ఆనంద పడిపోయేదాన్ని."దహెజ్'సినిమాకి మా
నాన్నగారు"కన్నెల కన్న అయ్యల కన్నీటి సముద్రం 'దహెజ్'అని రివ్యూ వ్రాసారు నాలుగయిదు
వారాలు. నాకో జబ్బు వుండేది,ఏకాస్త కష్టం ఎవరికికలిగినా,చూసినా కడుపు ఉబ్బేలా
ఏడ్చేదాన్ని.ఆ దహెజ్సినిమాచూసి,ఆ రివ్యూలు చదివి ఎన్ని కుండల నీళ్ళుకార్చానో?
"మల్లీశ్వరి"సినిమా వచ్చినపుడూ'మలీశ్వరి ఒక మహా కావ్యం, అందులో విహరించె
పాలపిట్ట భానుమతి.అనివ్రాసారు.
సినిమాలు చూడనివాల్ళు,పట్టించుకోని వాళ్ళు కూడా ఈ కృష్ణాపత్రిక రివ్యూ చూసి
తప్పక సినిమాకి వెళ్ళేవారు.
3 comments:
మామ్మ గారు
మీరు ఇక్కడ పేట్టిన మీ ఫోటో చూసి మిమ్మల్ని గౌనులో ఊహించుకోవడానికి నానా అవస్థా పడుతున్నాను. కాస్త మీ చిన్నప్పటి ఫోటో ఉంటే ఇక్కడ పెట్టి పుణ్యం కట్టుకోండి.
బండి సున్నా
గారూ,మీపేరేమిటొ తెలియదు.ఫొటొ వెయ్యమన్నారు.భలెవారే!
ఆ రోజుల్లో ఫొటోలు ఎక్కడున్నాయండీ?
జ్ఞాన
బండి సున్నా
గారూ,మీపేరేమిటొ తెలియదు.ఫొటొ వెయ్యమన్నారు.భలెవారే!
ఆ రోజుల్లో ఫొటోలు ఎక్కడున్నాయండీ?
జ్ఞాన
Post a Comment