గోల్ఫ్
కెనడాకి,యు,ఎస్ కి రెండు సార్లు తీవ్ర శీతల పవనాలు వీచె
టప్పుడు,మంచుకురుసి ఘనీభవించి,గడ్డ కట్టికొండలుగా నిలిచెటప్పుడు
వచ్చాను.ఇంతవరకు ఎవరికి చెప్పలా-మీకో రహస్యం చెపుతున్నా.
వింటర్ లో వస్తేనే మా అబ్బాయి శని,ఆదివారాలు ఇంట్లో వుంటాడు.
సమ్మర్ అయితె తుపాకి గుండుకు అందడు.అదేమిటంటారా?మావాడుగొల్ఫ్ ఆడతాదు.
వింటర్లో ఆ ఆట ఆడలేరుట.అలవాటు పోతుందని ఆకర్ర.ఆబాలు లేకపోయినా
ఆడుతున్నట్లు విన్యాసాలు చెస్తూవుంటాడు.గొటీ బిళ్ళకి దానికీ పెద్ద తేడా
కనిపించలేదు నాకు. కానీ ఇది చాలా ఖరీదైన ఆటట.గొల్ఫ్ కోర్సు పట్టి
దాని ప్రవేశరుసుము డాలర్లతో ఆకాశానికి మెట్లుకడుతుందిట.ఆడె కర్రని క్లబ్
అంటారు.ఇవి ఎన్నిసైజులో,ఎన్నిరకాలో!అవీన్నీ పెట్టెందుకు ఓ పెద్ద సంచి.తలకొక
టోపీ హంగుచాలానె కావాలి.ఏదైనా వూరు నాలుగు రోజులు హాలిడెకి
మా కోడలు వెళ్దామంటే కాదనడు.కానీ టికెట్టుకంటె ముందు గొల్ఫ్ కొర్సు ఎక్కడ
వుందోఅని విచారించి మరీ వెళ్తాడు. ఇంతగా కట్టేసిన ఆగొల్ఫ్ కొర్సు
ఎలావుందో చూద్దామని అనుకొనెదాన్ని,ఆ చలిలో బియ్యంబస్తా మోసినట్లు
వూలుదుస్తులు,బూట్లు మొయ్యలేక విరమించాను.
ఈమాటు సమ్మర్లో వచ్చి మోడులా వున్న చెట్లకి
[మా ఇంటి దగ్గర]వచ్చిన మొదటి చిగురుకూడా చూసాను,కదలెనీళ్ళని చూసాను,
పూలనిచూసాను,నడిచె మనుష్యుల్ని చూసాను. ఇంతకీ ఎందుకు చెపుతున్నానంటె
మొన్న అలా వెడుతూంటె"మీనియెచర్ గొల్ఫ్"అనె బొర్డు,తళతళలాడె కార్లు.బిలబిలా
జనం కనిపించారు.మాచిన్నవాణ్ణి అడిగాను"ఇక్కడ గొల్ఫ్ ఆడతారేమిటిరా?అని
"అవునమ్మా!ప్రాక్టీసుకోసం ఆడతారు.చూస్తావా?అన్నాడు.
ఆ మర్నాడు సాయంత్రం వెళ్ళాము.ఈ కోర్సు 1962 లో ప్రారంభించారుట.
పొద్దున 10నుంచి రాత్రి 10దాకా తెరిచె వుంటుందిట."ఎర్లీ బర్డ్ రవుండ్" అంటె ఆరు
ఘంటలకి ముందు వెడితె ఆరు డాలర్లు టికెట్టు,ఆరు తరవాత వెడితె ఆరున్నర
డాలర్లు టికెట్టు. ఈ ఆట పధ్ధెనిమిది భగాలు. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క హొలు
వుంటుంది.ఒకటి నుంచి మొదలుపెట్టి 18 హొల్స్లోనూఆడాలి.టికెట్టు కొంటె ఒక స్టిక్ దానిని క్లబ్
అంటారు,ఒకబాల్ అదీ ఇస్తారు.మన ఆట స్కొరు వ్రాయడానికి కార్దు,పెన్సిలు ఇస్తారు.
ఒక్కొక్కటి దాటి ముందు దాంట్లోకి వెడితె బాల్ గురిచూసి హొలె లో పడెలా
కొట్టడానికి గురి,ఏకాగ్రత,నిలకడ వుండాలి."వస్తె కూసువిద్య,రాకపోతే బ్రహ్మవుద్య"
అంటారు. ఏదైనా ఆటగానీ,పని కానీ పైపైన చూస్తె ఆ!ఏముందిలే అనిపిస్తుంది.
రంగంలోకి దిగితె గాని అంతుపట్టదు. హొలెకి మూరెడు దూరంలో వున్న బాల్ ని హొలె
లో వెయ్యడానికి మూడు సార్లు కొట్టాల్సి వస్తుంది.ముగ్గురు కలసి ఒక జట్టుగా ఆడ్తారు.
మెము ఆరుగురు వెళ్ళాముకనక రెండు జట్లుగా ఆడాము.మనవెనక జట్టువారు వాళ్ళు
ఆడడానికి ఎదురు చూస్తూ వుంటారు.ఒకటి చాలా కష్టమైన జాగా వుంది,అక్కడ
ఆరు సార్లె చాన్సు. 19 వ హొలె లొకి ఒక్క దెబ్బతోనె బాల్ వెయ్యాలి. అలా వెస్తె
అలారం మోగుతుంది.
వాళ్ళు గెలిచినట్లు లెఖ్ఖ. వాళ్ళకి వాళ్ళ టికెట్టు డబ్బు
వాపసు ఇస్తారు.అప్పుడె మనం రెండో సారి ఆడితె టికెట్టు 3 దాలర్లకె ఇస్తారు.
పిల్లలతో వెడితె కన్సెషను,సీనియర్స్ కి కన్సెషను.గిఫ్ట్ సర్టిఫికెట్స్ ఇస్తారు.ఫస్టైడ్,
సెక్యూరిటీవున్నాయి.ఆట ఆడెటప్పుడు ఎలా నుంచోవాలో నెర్చుకోవడానికె టైము పడుతుంది.
చిన్న చిన్న పిల్లల దగ్గర్నుంచి80ఏళ్ళవాళ్ళదాకా ఆడుతున్నారు.అడెజాగాలు ఆకుపచ్చని
పచ్చికబయలా!అనిపించెటట్లుగా తివాసీ పరిచారు.ఈఆట ఆరునెలలె ఆడతారుకనుక
తక్కిన ఆరు నెలలు ఇది పాడవకుండా కాపాడు కోవాలి వాళ్ళు.ఇలాటివి పెద్ద పెద్ద
మాల్స్ లో కూడావుంటాయట.అంతెకాదు,ఇంట్లో హాలులో ఆడుకోడానికి ఈతివాసీల
లాటివి హొల్స్ తో సహా తయారుచెసి అమ్ముతారట.ఎలాగైనా ఇక్కడివాళ్ళకి ఆటలంటె ప్రాణం.
నిజంగానె ఈగొల్ఫ్ లాటి ఆటలో మనుష్యులు తెలియ కుండా బోలెడు మైళ్ళు నడుస్తారు.
పచ్చదనం చూస్తె మెదడుకి, కళ్ళకి మంచిది.పెద్ద కొర్సులలో ఆడెవాళ్ళకి
విపరీతమయిన వ్యాయామం. దీనిపక్కనె మరొ కొర్సు వుంది.దానికి ఫెన్సింగ్ల కట్టారు. అక్కడ
ఆడె వాళ్ళకి ఒక బకెట్ తో బాల్స్ ఇస్తారు. ఒకొక్కటి కొర్సు లోకి కొట్టి ప్రాక్టీసు
చెసుకోవడమె.గెలుపు ఓటమి ఏమీలేవు.
ఇక ఇక్కడ ఆకర్షన ఏమిటంటె పక్కనె అయిస్క్రీం షాప్.
ఎన్నిరకాలో!రొజుకొక రకం చొప్పున నెలదాకా తినొచ్చు.కాసెపు ఆదుకొని అయిస్క్రీం
తిని ఇంటికి వచ్చాము.కష్టమో నిష్టూరమో ఏదైనా ఒ న మా ల దగ్గరనుంచీ
తెలుసుకొంటెనె బాగుంటుంది.
1 comment:
గోల్ఫ్ ని గోటీ బిళ్ళతో పోల్చారూ? నేను నవ్వలేక చచ్చిపోతున్నాను. ;-)
గోటీ బిళ్ళ ఆటలో బిళ్ళని కొట్టాక వెనక్కి దూరం కర్రతో కొల్చుకోవాలి. గోల్ఫ్ లో అలాంటిదేమీ లేదు.
మీరు మళ్ళీ సారి ఇండియా నుంచి వచ్చేసరికి గోటిబిళ్ళ ఆటకి కంప్యూటర్ కనక్షన్ చేసేసి ఆ కొలిచే దూరం ఆటోమేటిగ్గా, కరక్ట్ గా కొలవడం కుదురుతుందేమో, ఎవరు చెప్పగలరు ;-)
Post a Comment