Sunday, June 1, 2008
గుణ సుందరి కథ
గుణసుందరి కథ సినిమా వచ్చింది,పింగళీ నాగెంద్ర రావుగారు
సంభాషణలు,పాటలు వ్రాసారు.అని చెప్పారు నాన్నగారు.నాగెంద్ర
రావుగారు బందరులొ వుండెవారు. మద్రాసువెళ్ళి విజయా కంపెనీలొ
చెరారు.ఆసినిమా అందరికి నచ్చెది.హాస్యము,సంగీతము,సాహిత్యము
కరుణరసం అన్నీ వుండేవి. శివరావు హాస్యం నవ్వులు చిందించెది.
నాకు ఆశ్రీరంజని అంటె తెగ జాలిగా వుండెది.తండ్రి తనని
కుంటివాడికి ఇచ్చి పెళ్ళి చెస్తానన్నపుడు,తండ్రి అక్కలని
రాజమహలులొ వుంచుకొని గుణసుందరిని వెరె ఇంటికి
కాపురానికి పంపినపుడు,తొందరపడి నిజం చెప్పగానె భర్త
ఎలుగుబంటిగా మారినప్పుడుగుణసుందరిని చూస్తె మనసు కరిగిపొయెది.
"ఉపకార గుణాలయ వై వున్నావు కదె మాతా!అపరాధములన్ని మరచి
ఆదరించవె!"అనెపాట కళ్ళనీళ్ళు తెప్పించెది.
ఆరొజుల్లొ సౌండ్ ప్రూప్ఫ్ సినిమాలకి వుండెదికాదు.సినిమాహాలుకి
కొంచెందూరంలొ నుంచుని సంభాషణలు,పాటలు విని సంత్రుప్ర్తి
చెందెవారు.రెండొ ఆట సినిమా సమయానికి బయట అంతా సద్దు
మణిగిపొయెది.మాఇంటి వరండాలొ పడుకొంటె ఆపాటలన్నీ వినపడెవి.
సినిమా ముందె చూడడం వలన ఆ పాట వినగానె ఆఘట్టం కళ్ళకి
కట్టినట్లయి ఏడుస్తూ వుండెదాన్ని."శ్రీతులసి ప్రియ తులసి"పాట ప్రతి
ఇంట్లోనూ వినపడెది.
ఈ మనసెందుకొ ఇంత మెత్తన?
ప్రపంచాన్ని చూసి పోతుంది బిత్తర!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment