Pages

Wednesday, May 28, 2008

కృష్ణారావు పంతులుగారు

కృష్ణారావుగారి సంభాషణలో హాస్యము,వేదాంతము,దెశభక్తిఎన్నో
నిండివుండేవని నాన్నగారు చెపుతూ వుండెవారు. ఒకసారి హిందీటేచెర్ మోగంటి
మాణిక్యాంబగారితో
కలసి కృష్ణాపత్రిక ఆఫీసుకు వెళ్ళాను. ఆయన మాటలు చెపుతూ "జీవితం
ఒక ప్రయాణం,అటూఇటూ రెండు ఎత్తైన పర్వతాలు, మధ్య వేగంగా ప్రవహించె నది.
ఆనదిలో ప్రయాణం చెస్తున్నాము.ఎప్పుడు ఆపడవ ఏకొండకు తగులుతుందో,ఎప్పుడు
వేగానికి తట్టుకోలేక విరిగిపోతుందో,మునిగిపోతుందో తెలియదు."అనిచెప్పారు
అప్పుడునాకేమీ అర్ధం కాలేదుకానీ తరవాత బ్రతుకులు నశ్వరాలో ఆయన
ఎంత సులభంగా తెలియ చెప్పారూని అనుకొంటూవుంటాను.
ఒకతను వచ్చి కృష్ణారావుగారికి దణ్ణంపెట్టి"ఏదైనా
ఖాళీవుంటె ఇప్పించండి" అని అడిగాడత. కృష్ణారావుగారు తక్కువ మాట్లాడ
తారుకదా! పైగా లేదని చెప్పాలి,అది ఆయనకి ఇష్టంలేక తలమీదనించి
తలపాగా తీసి చెతితో నెత్తి మీద చెయ్యివేసుకొని"ఇదుగో ఇక్కడ"అని
చూపించారట.
ఒకరొజు ఆఫీసు అయిపోయాక ముట్నూరివారు,ఇంటికి
వెడుతూంటె మానాన్నగారు,మరోఇద్దరు
ఆయనవెనకాలే నడిచి వెల్తున్నారటకానీ ఎవరూ సంభాషణ మొదలు
పెట్టలేదు,ఆయన వెనుతిరిగి చూడలేదుట.ఇంటిదగ్గరికి వెళ్ళాక ఆయన
గొడుగు ముడిచివెనక్కి చూసేసరికి వీరు ముగ్గురూ వున్నారట.అప్పుడు"ముగ్గురె
వచ్చారెం? ఇంక్!అన్నారుట. ఇంక అక్కద ఒక్క నిముషం నిలవ కుండా ముగ్గురూ
వెనుతిరిగారట.ఆయన వెనక చేతులు ముడుచుకొని వలా ఎవరూ రావడం
ఆయనకి ఇష్టం వుండేదికాదు.
ఎవరెనా చనిపోయారని,ఆవార్త పత్రికలో వేయాలని

తెలిసినప్పుడు కృష్ణారావుగారునాన్నగారిని చూసి,సంతాపం మీరు ప్రకటిస్తారా!నెనా!


అనేవారట. నాన్నగారు ఎలా అయినాసరె!అనెవారుట. బ్లాకు వున్నవాదే పోఅయాడా?అనేవారుట.
బ్లాకు లేని వాళ్ళు పోతే ఎలా?చెప్ప పెట్టకుండా?అనెవారుట.వారు వ్రాసే సంపాదకీయం
పత్రికకి మకుటాయమానంగా వుండేది.చాలామంది నాన్నగారు వ్రాసే "వడగళ్ళూ'
కృష్ణారావుగారే వ్రాస్తున్నారని అనుకొనేవారట.ఒకాయన ఆఫీసుకు వచ్చి ఆవారం "వడగళ్ళు"
గురించి పొగిడి""ఎంతబాగా వ్రాస్తున్నారండీ!మీరుకాక ఇంతబాగా మరెవరు వ్రాయగలరు?అని
మెచ్చుకొని వెళ్ళారట.అంతవరకు కృష్ణారావుగారు మౌనంగా విని వాళ్ళు వెళ్ళాక ,నాన్నగారితో
ఇందాక ఒకాయన వచ్చి "వడగళ్ళు"నెనె వ్రాసాననుకొని తెగ పొగిడాడు. పొనీలే పొగడనీ
నెను కాదని ఎందుకు చెప్పాలి?అని వినీఅనందించాను.అన్నరత.

No comments: