గ్లాసుల్లో మొలకలు కులాసాగా వున్నాయి.చేమకూర
మొక్కలు నాలుగు గ్లాసుల్లోవి నాలుగైదు ఆకులు వేసాయి.
తక్కిన నాలుగు గ్లాసుల్లోవి నిదానంగా ఎదుగుతున్నాయి.ఎందుకంటె
స్థలాభావం వల్ల వాటిలోనే మెంతులు జల్లానుకదా? మెంతులు
బాగా వచ్చాయి.మారాకులువేసి,నాలుగు అంగుళాలు ఎదిగాయి.
ఇక వాతిని కోసెయ్యాలి.బధగా వుంది.అలా అని కళ్ళెదుట
వాడి ఎండిపోతె చూడలేముకదా? బజారు కూరలు కొండానికి
వెడితె ఆకుకూరలు అంటె మహచులకనచెస్తాము,ఆకట్టలని
అటూఇటూ కెలికి ఓ రెండెకట్టలు కొంటాము.సొంతంగా గింజలు
వేసి పెంచితె ఒక్కొక్క ఆకు ఒక రూపాయిలాగా అనిపిస్తుంది.
వున్నమెంతికూర అంతా కోస్తె ఒక కట్ట అవుతుందేమో. దానితో
ఏమిచెయాలి? అని ప్రశ్న.ఆకు కూరలన్నీ చాలావున్నత్లనిపించినా
సెగ తగలగానె తగ్గిపోయి కాస్తంత అవుతాయి.శనివారం
మామేనల్లుడు వస్తున్నాడు,వాడి అల్లుడుకూదా,వళ్ళకి స్పెషలు.
వున్నకూరతో ఆతా కలిపి ఒకటే పరతా చేసి అందరం
తలోముక్కా తిందామని నిర్ణయించాను.కానీ కొయ్యాలంటె ఎంత
బాధగా వుందో? బుధ్ధుడు చెప్పిన పరమ సత్యం గుర్తువచ్చింది.
అన్ని దు;ఖాలకి కోరికలే కారణం అన్నాడు.'"మెంతికూరని
పెంచనేలా?దానిని తుంచనేలా?కన్నీరు కార్చనేలా?
ఈజీవిత మింతెనని ఏడ్వనేలా?అని కరుణశ్రీగారి పద్యం
పోలిక అద్యాన్ని పాడుకోవాల్సిందే!
మెంతికూరతో వంటలు
మనమ్నిత్యం వంటలలో వేసే తిరగమోత లోనే మన
ఆరోగ్య సూత్రాలన్నీ దాగి వున్నాయి.ఒకొక్కదినుసుకు ఒక్కొక్క
విశిష్టత వుంది.మెంతిగింజలో మంచి సువాసన వుంటుంది,
అదికాక మధుమెహం వున్నవాళ్ళకి ఇదిఒక్ అవరం.మెంతిపొడితింటె
మధుమెహాన్ని నియంత్రిస్తుంది.లెని వారికి రాకుండా నిరోధిస్తుంది.
మెంతికూర పప్పు-
మెంతికూర పప్పు కందిపప్పుతోనూ,పెసరపప్పుతోనూచెస్తారు.
కందిపప్పు కొంచెంగట్టిగా వందుకొంటె బాగుంతుంది.ఇక ఒక
అయిదునిముషాలలో మెత్తబడుతుంది అనుకొన్నపుడు పప్పు దిచివేస్తె
తినేటప్పుడు పంటికి బడ్డ తగులుతూవుంటె బాగుంటుంది.మెంతికూర
శుభ్రంగా కడిగి, తరిగిపెట్టుకోవాలి. స్తవ్వుమీద బాణలి పెట్టి
రెండుచెంచాల నూనెవేసి అవాలువెసి,చిటపత మన్నాక శనగపప్పు,
మినప పప్పు,మిరపకాయలు,ఇంగువ,పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు,
అల్లంసన్నగాతరిగిన ముక్కలూతినగలిగేవాళ్ళు,కొనగలిగే వాళ్ళు
జీడిపప్పుకూడా వేసుకోవచ్చు.పోపువేగాక అందులో తరిగిన
మెంతికూరవేసి,మగ్గాక కందిపప్పు వేసి,పసుపు,ఉప్పుకావాలనుకొంటె
ఎర్రకారంవేసి కలియ బెట్టాలి.అయిదు నిముషాలు వుంచి దించి
వేయవచ్చు.దీనికి అనుపానంగా చల్ల మిరపకాయలు.చిన్న వదియాలు,
అప్పడాలు ఆవకాయ నంచుకుతింటేబాగుంటుందీన్నముతో.
మెంతికూర పెసరపప్పుతో-
ఇది తొట్టేతో తినడానికి బాగుంటుంది.ఈపప్పు పల్చగా గరిటె
జారుగా వండుకోవాలి.ఒకేసారి పప్పు,మెంతికూర పసుపు కొంచెం
కారం వేసి కుక్కరులో పెట్టి,వుడికాకా దించి పోపు కందిపప్పులో
వేసినత్లే వేసుకు తినవచ్చు.పోపుకారం వేయకుండా మసాళా
వేసుకోవచ్చు.
మెంతికూర పచ్చ్డి.
పచ్చడిలేందే ముచ్చ్టేలేదు,అన్నట్లు,సరియైన పాళ్ళల్లో అనీపడితె
పచ్చ గడ్డితో పచ్చడి చేసినా తినొచ్చు అనేది మామేనత్త.
మెంతికూర కడిగి తరిగి పెత్తుకోవాలి.ఆవాలు,మినపపప్పు,కాసిని నువ్వులు.
ఎండుమిరపకాయలు.ఇంగువవేసిపోపువేగించీందులో రండు పచ్చిమిరపకాయలువేసి
మెంతికూరకూదావేసి మగ్గాక,దించి చల్లారాక చినపందు,పసుపు,ఉప్పు
మిక్షీలో తిప్పడ్మే.మంచి రుచిగా వుంటుంది.
మెంతికూర పకోడీలు-
శెనగ పిండిలో చారెదు బియ్యపు పిండివేసి,ఉప్పుకారం,జాలకర్ర చిటికెదు
పసుపువేసి పిండికలుపుకొని మెంతికూర పచ్చిదే వేసుకోవచ్చు,లెకపోతే
ఒకసారి నూనెలో మగ్గబెట్టికలుపుకొని పకోడీలువేయడమె.పచ్చిమిర్చి
ముక్కలువేసుకోవాలి.వేడిగా తింటెనే పదార్ధమ్రుచి.చల్లరితే
సగం రుచి చచ్చిపోతుంది.
మెంతి పరతా-
పైన చెప్పిన విధంగానే మెంతికూర సిధ్ధ చెసుకోవాలి.నూనెలో
వేగించినాఫ్స్రవాలా,వేగించకపోయినా ఫ్స్రవాలా.ఆతాలోఉప్పుతోపాటుకలిపి
పెనంపై కాస్త నూనెరాసి కాల్చవచ్చు.నూనెలో వేగించుకోవచ్చు.దీనికి
ఉల్లిపాయ పెరుగు లో కలిపికొత్తిమీర,పచ్చిమిర్చిముక్కలు వేసి పెరుగు
పచ్చ్దిచెసుకు తింటే బాగుంటుంది.
మెంతికూర కూర
ఇదీ రొట్టెలలోకే బాగుబ్టుంది.అన్నంలో కూడ కలుపుకు తినవచ్చు.ముందుగా
చారెడు పెసర పప్పుకదిగి వద్గిట్టి వుంచుకోవాలి.పెసరపప్పుకు
తగినంత సమానంగా మెంతికూరవుండాలి.మమూలుగా ఇంగువతో సహా
పోపువేసి అల్లం,పచ్చిమిర్చి ముక్కలువేసి పెసరపప్పు మెంతికూరావేసి
మూతపెట్టి అయిదు నిముషాలయాక నెళ్ళుఇగిరాక దింపాలి.
No comments:
Post a Comment