కానుక
ఎవరేనా మనింటికి వస్తున్నా, మనల్ని ఏఫంక్షను కైనా పిలిచినా
ముందు మూడు ప్రశ్నలు తలెత్తుతాయి. ఎప్పుడు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఏమి తీసుకు వెళ్ళాలి?
వీటికి జవాబులు వెతుక్కొంటుండగానే ఆ రోజు వచ్చేస్తుంది. మనం వెళ్ళేవాళ్ళ స్టేటస్ బట్టి,
మన తాహతుబట్టీ కానుక తీసుకొవాలనుకొంటాము. ఇవ్వబోయే వాళ్ళ మనస్తత్వం బట్టీ
కూడా కానుకలు ఎంపిక చేయాల్సి వుంటుంది. కానుక అంటే దాన్ని కానుక గానే చూడాలి.
దాని ధరను బట్టీ దాని ఆకారాన్ని బట్టీ ఇచ్చిన వాళ్ళ మనసును అంచనా వేయకూడదు.
కొందరికి అన్నీ వుంటాయి, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే అలోచించి,చించీ బుర్ర అరిగిపోతుంది.
డబ్బులే ఇస్తే పోలా! అనె నిర్ణయానికి గబుక్కున జారిపోతాము.
బ్రహ్మ దేవుడు సృష్టి చేసేటప్పుడు 64 కళలు దగ్గిర పెట్టుకొని లవంగాలు,ఏలకులు
లాగా ఒకొక్కరి బుర్రలో ఒక కళని పడేస్తాడూలావుంది. అందుకె కాస్త స్థూలంగా పరీక్షిస్తే
ప్రతివారిలోనూ ఏదో ఒక కళ కనిపిస్తుంది.అలాగే కొందరికి షాపుల్లో వస్తువులు చవకగా వచ్చేవైన,
ఖరీదైన వయినా చటుక్కున ఏరే కళ వుంటుంది. విస్త్రీ పెట్టె కొందామా? విసనకర్రకొందామా? అనే అయోమయ నివృత్తి
{వికిపెడియా వారికి ధన్యవాదాలతో] అయేసరికి పుణ్యకాలం దాటిపోతుంది.
మా మామయ్యకి ఇలాటిపరిస్థితుల్లో ఇన్ స్టాంట్ వైరాగ్యం వచ్చేస్తుంది.
కొడుకులకైనా సరే,కంపెనీ మానేజరు కైనా సరే ,కలియుగ దైవం వెకన్న బాబుకైనా సరే -ఆ ఏదిస్తే ఏమిటీ
ఎంతోకొంత కవరులో పెట్టి ఇస్తేపోలా!అంటాడు,"ఆకొంత" ఇచ్చేటప్పుడుమాత్రం కవరుపైన విజిటింగ్ కార్డ్
పెట్టి దాని మీదొక రిబ్బను చుట్టి, పైనఒక ప్లాస్టిక్ పువ్వు పెట్టి "ఆపువ్వున్న కవరు జాగ్రత్త చేయండి."
అని చుట్టాలందరికి చెప్పి వస్తాడు. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు తన ధనాగారంలోని ఆభరణాలన్నీ
వ్రేపల్లె వాసులకి పంచి పెట్టాడట. మన మనస్సులోని ఆనందాన్ని వ్యక్త పరిచే ఒక సాధనం కానుక.
పది ఏళ్ళ క్రితం నాస్నేహితురాలు ఒక ఫొటో ఫ్రేము ఇచ్చింది. తెల్లటి ప్లాస్టిక్ ఫ్రేం. కింద పడితే పగలదు
ఒకమూల చిన్న పూలగుత్తిపైంట్ చేసివుంది. అందులో ఒకసారి నాచిన్నప్పటి ఫొటొ పెడతా. ఒకసారి మా మనవడిది,
ఒకసారి డెవుడిది, ఒకసారి ఏదో చిత్రం అలా మారుస్తూ వుంటా. కొత్త బొమ్మ పెట్టినపుడల్లా మా స్నేహానికి ఒక చిగురు వేసినట్లు అనిపిస్తుందినాకు. మా మేనల్లుడికి అనారోగ్య కారణంగా కాలుకి ఆపరేషను అయి నడక ఇబ్బంది పెడుతోంది.
భగవంతుడు కొందరికి చాలా మనోబలం ఇస్టాడు వాళ్ళ జీవితాలకి అదే ఊతగా నిలబడుతుంది. ఈమధ్యనే వాడి మానస పుత్రికకి పెళ్ళి అయింది. సంసారం ఎలావుందో చూడాలని అనుకొంటుండగ్నె అఫీసు పనికూడావచ్చి భార్యా భర్తా
వచ్చారు.ఇంకా జెట్ లాగ్ తగ్గలేదు.విశ్రాంతి తీసుకొంటున్నారు. మధ్యాన్నం 12 ఘంటల వేళ ఎవరో డొర్ నాక్
చేసారుట.తలుపు తీస్తే ఒకాయన పెద్ద బొక్ష్ అక్కడ పెట్టి నుంచున్నాడు. చేతిలో ఏదో ఒక యెల్క్ట్రానిక్ ఉపకరణం,
సంతకం పెట్టు అన్నట్లు పెంతో యాక్షను చేసాడట. అమ్మాయి,అల్లుడు ఇద్దరూ లేరు, వీరికి తీసుకోవాలా వద్దా? అని
సంశయం వచ్చి ఒకరి మొఖాలొకరు చూసుకొంటుండగా అల్లుడు ఫొన్ చేసి "కొరియర్ వస్తుంది, మీరు సంతకం చేసి తీసుకోండీ అన్నాడట. సంతకం చేసి ఇంట్లొ పెట్టి "ఏదో కొంటూనే వుంటారేఈకాలం పిల్లలకి జీతాలు బాగా అందడంతొ
ఖర్చు పెట్టేస్తారు,మారోజుల్లొ ఎలావుండేది? బనీను కొనాలంటె మూడునెలలు ఆలోచించేవాణ్ణి.అన్నాడట. అమాటలకి భార్యనవ్వి "వూరుకొండి,ఎవరేనా వింటే నవ్విపోతారు,ఆ అబ్బాయిదగ్గర అలా మాట్లాడకండి."అని హెచ్చరిక చేసింది.
మర్నాడు సయిట్ సీయింగ్ కి వెళ్దామని తయారవుతూంటె అల్లుడు క్రితం రోజువచ్చిన బొక్ష్ వూడదీయడం ప్రారంభించడు.
అమ్మాయిని పిలిచి "ఇదేమిటె! మీఆయన ఇప్పుడు పెట్టాదిది? అన్నాదట,నవ్వి వూరుకొంది.ఇక తనే వెళ్ళి తైమవుతుందేమో!రేపుచూడొచ్చుగా అన్నడటమేనల్లుడు.రేపా! అలాఎలా? అని అదివిప్పి బయటికి తీసి" మీకోసం ఇది అన్నాడట. చూస్తే అది "వీల్చెయిరు". మా మేనల్లుడికి నోట మాట రాలేదుట. దానిచుట్టూ మూడు సార్ళు తిరిగి అల్లుణ్ణి వటేసుకొని
చిన్నవాడివయినా పెద్ద మనసుతో చేసావయ్యా!బాధ పడుతున్న వాణ్ణి నాకు నేను కొనుక్కొడానికి సాహసించలేకుండావున్నాను< నువ్వు చటుక్కున తెచ్చావే?అనిపొంగిపోయాడు.మీకాడ వున్నన్నాళ్ళూ వాడుకొని వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి.ఎక్కడికివెళ్ళాలన్నా ఉపయోగపడుతుంది.అన్నాడట.కారు డిక్కీలో వేసి మావూరుతెచాడు.నిగనిగ లాడుతూ,మంచి చెYఇరు,చక్కటిసీటు,అదిచూస్తే నాకూ ముచ్చతేసింది. అసలతనికి వీల్చెయిరు ఇవ్వలని అనిపించడం,ఇవ్వడం గొప్పగా అనిపించింది.రోజూ నిత్య జీవితంలో బాగా ఉపయోగపడేవి,మనస్సుకు నచ్చేవి కానుక లివ్వాలంటే ఆకళా, రాజమహేంద్రవరమంత విశాల హృదయం వుండాలోయ్ వుండాలి.
No comments:
Post a Comment