అసలు అర్ధం ఇది
శ్రీషిర్డీ సాయి బాబాకి అప్పుడప్పుడూ చాలా కోపం వచ్చేదిట.
ఆ తీవ్ర మైన కోపానికి దగ్గరున్న వారు తట్టుకోలేకపోయేవారట.
కోపకారణమేమిటొ ఎవరికి తెలియదు.తీర్చడానికి ఎలా ప్రయత్లించగలరు?
అలా చూస్తూ నుంచుంటే ఎప్పటికో తగ్గేదిట.ఆకోపంలో ఆయన తిట్టేవారట.
అవి తిట్లుకావు, దీవెనలు, వాటి అంతరార్ధం గ్రహించండి.
మాట అర్ధం
తు కుత్తా హై అంటె కుక్కలా నమ్మకం,విశ్వాసం,తృప్తి కలిగి వుండు.
తు గధా హై అంటే ప్రతిఫలాపేకష లేకుండా సేవచెయ్యి.
తు జల్జా అంటే నీలోని దుర్గుణాలనేఏ కాలిపోనీ.
తు మర్ జా అంటే నీలో వున్న అహంకారం చచ్చిపోవాలి.
తు సత్య నాశ్ హొజా అంటే సమస్త దుర్గుణాలు పోయి పరిశుధ్ధుడ వైన
భక్తుడవవుదువుగాక
శ్రీసాయిబాబా నామార్గం,నాగమ్యం నుంచి.
No comments:
Post a Comment