Pages

Wednesday, June 4, 2008

అక్షరాలు దిద్దడం అనేది విద్యార్ధులు మొదట
చేసేపని.పంతులుగారు,అక్షరాల్ని పలక మీదో,ఇసుకలోనో
వ్రాసి కుర్రవాడిని అలా దిద్దుతూ కూర్చోమనేవారు.
పలక మీద ఒక వరసతో వ్రాసి ఇచ్చిన అక్షరం
వాడు రోజంతా దిద్దుతూ కూర్చుంటే ఆ అక్షరం తీగల
చుట్టలా ఇంతలావుగా అయేది.దిద్దగా దిద్దగా ఆ ఆకారం
మనసులో పడి అక్షరం గుర్తుండిపోతుంది.దిద్దిన కొద్దీ అక్ష
రాలు గుండ్రంగా వస్తాయి. చిన్నపుడే అలా నేర్చుకొంటే
ఆవ్రాత జీవితాంతము అలానేవుంటుంది. దీనికి శ్రీకారం
చుట్టడానికే అక్షర అభ్యాసం అని పేరు పెట్టారు.అల్లరి
చేయకపోతే కూర్చుని నాలుగు అక్షరాలు దిద్దుకోరాదూ?
అని పిల్లల్ని కోప్పడుతూవుంటారు."తిలకము దిద్దరుగా"
"కాటుక దిద్దిన కళ్ళు"దిద్దినట్లు పని చేయకపోతే తప్పులు
మళ్ళీ మళ్ళీ దిద్దుకోవాల్సివస్తుంది.
ఎవరికైనా పని చెపుతే వెనక్కి తిరిగి
చూడ నవసరం లేకుండా వుండాలి.చేసిన పని ఒకటి
రెండుసార్లు చూసుకోవడం మంచిదేకదా?మంచిదే. చేసేటప్పుడే
దిద్దుకోనవసరం లేకుండా చేద్దాము అనుకొని మొదలుపెడితే
పొరపాటు జరిగితేదిద్దుకోవడంతప్పదు.షిరిడీ సాయి "శ్రధ్ధా,
సాబురి"అనిబొధించాడు,శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో
"నీ ఎదురుకుండా ఏదైన పని వుంటే అది నీకోసమే!నువ్వు చేయవలసిందే!
దానిని వాయిదా వెయ్యడం కానీ,చెయ్యకుండా మానడం కానీ చేస్తే
నాకిష్టంలేదు.అదిచేస్తే లాభమా?నష్టమా? అనేప్రశ్న నీకనవసరం.
నువ్వు ఆపనిని ఆనందంగా, శ్రధ్ధగా,పూర్తిగా చెయ్యి.నీక్షేమం
చూసే బాధ్యత నాది."అని ప్రబోధించాడు.పని త్రికరణ శుధ్ధిగా
చేస్తే పొరపాటు దిద్దుకోవచ్చు.
రేడీయో లో మాట్లాడెవారూ,టి.వి.లొ మాట్లాడెవారూ ఎంత
జాగ్రత్త వహిస్తారు. పెపర్లు దిద్దేటప్పుడు,పద్దులు వ్రాసేటప్పుడు,
చెక్కులు సంతకాలు చేసేటప్పుడు సరిగా పని చేయకపోతే ఎంతకష్టం.
తుడుపు లేకుండా 40,50ఏజీలు వ్రాసే వారున్నారు.ముఫ్ఫయి కాగితాలు చింపి
ఒక వినతి పత్రం వ్రాసేవాళ్ళున్నారు. తప్పు చేసినట్లు తెలిసికొని,దిద్దుకొనే
సామర్ధ్యం కలిగివుండటం అదృష్టమే!

No comments: