దిద్దుకోవడం
తిరిగి దిద్దుకొనే అవుసరం లేకుండా పని చేయగలగడం గొప్పే!
అంటానునేను.అలాచేయాలని అనుకొంటాము కానీ కొన్ని కారణాలవల్ల
మానవ సహజమైన బలహీనతలవల్ల అలా చేయలేక పోతాము. అప్పుడు
వెనక్కి వెళ్ళి దిద్దుకోవాలంటే సమయము,శక్తి ధారపొయ్యాలి.దిద్దుకోవడం
అంటే మళ్ళీ అంతపనీ చేసినట్లే!.ఏపని చేసినా మనసా,వాచా,కర్మణా
చేయమన్నారు.ఆఫీసులో ఉద్యొగమయినా ,ఇంట్లో వంట చేసినా,
ఏదైనా ప్రణాళిక తయారుచేసినా ఇవ్న్నీ పనులే!.పని చేయాలంటే బలీయమైన
సంకల్పము రావాలి. మొదటి అడుగువేసే ఉస్తాహం పొంగాలి,పరిపూర్ణంగా,విశుధ్ధంగా
పూర్తి చేయాలనే పట్టుదల వుండాలి.ఇన్ని పెట్టుకొని ఏకాగ్రత తోచేయాలి.ఈ ఏకాగ్రతే
మనిషిని ఋషిగా చేస్తుంది. ఇదిలేకపోతే మెదడులో వచ్చే భావాలకి,శరీరం చేసే
పనికి పొంతన వుండదు. పని అస్తవ్యస్తం అవుతుంది,సగంలో ఆగిపోతుంది,లేక
పూర్తిగా మూల పడి పోతుంది.
పని చేయడం మొక్కుబడిగా కాకుండా,ఎప్పుదు చేసి అవతల పారేద్దామా
అనే తొందరపాటుతో కాకుండా, తందైన ఒక రీతిని అందులో ప్రతిఫలింప చేసి గుర్తింపు
పొందగలిగేలావుండాలి.ఒక పని ప్రారంభిస్తే చుట్టూ వున్న పరిసరాలలో ఏమి జరుగుతున్నా
పట్టించుకోకుండా చేస్తారుకొందరు.ఆపని పూర్తయేదాకా తిష్ట వేసుకొని కదలరు.ఆ
స్థిరత్వము రావాలంటే కష్టమే! కాష్మీరు లోని ప్రజలు శిల్ప కళలో ప్రసిధ్ధులు.
ఒకచిన్న బల్ల తయారు చేసినా,ఒకపెద్ద పెట్టె తయారుచేసినా పూర్తిగా లతలతోనింపి
వారిహస్తకళా నైపుణ్యానికి అద్దంపడతారు.చేతికుట్టు కుడితే దారం ముడి ఎక్కడ వేసారో,
సూది బట్టపై ఎక్కడగుచ్చారో మనం కనిపేట్టలేము.అతి సున్నిత మైన సిల్కు వస్త్రాలపై
కుడతారు.అవిచూచి అవాక్కయిపోతాము.ఒకవికలాంగుడు కాలితో,ఒక వికలాంగుడునోటితో,ఒకవికలాంగుడు
వేళ్ళులేనిమొండిచేతితో చిత్రాలు గీయడం చూస్తూవుంటాము.ఎలాచేయగలిగారు? వారిలోని సంకల్ప
సిధ్ధి, శక్తినంతా ఏకోన్ముఖం చేసి కార్య సిధ్ధిని చేకూరుస్తుంది.ఉపకరణాలు,సౌకర్యాలు
పక్కకి పెట్టి ఏకాగ్రత ఒక్కటే అండగా నిలుస్తుంది."అవసరం అక్క,ఏకాగ్రత చెల్లి".అవుసరంకూడా
పనికి విలువని పెంచుతుంది.
ఆ అమ్మాయికి కళ్ళు,ముక్కు దిద్దినట్లున్నాయి.అంటే ఎక్కడా లోటుకనిపించడం లేదు అని. ఇల్లూ,వాకిలీ దిద్దినట్లున్నాయి.బొట్టు సరిగా దిద్దుకో!అంటే తుడిపెయ్యమనికాదు,వున్నదానిలో లోపంవుంది,దాన్ని సరిచేసుకోఅని.
అక్షరాలు గవ్వల్లా దిద్దినట్లున్నాయి.పనులన్నీ చక్కదిద్దుకొన్నాక వూరువెళ్ళడం ఆలోచిస్తా.
No comments:
Post a Comment