ప్రశ్నలు2
ప్రశ్నలు వేసి బుర్ర తిండానికి ఆడా మగా బేధం లేదు.
మా ఇంటికి ఒకాయన వచ్చేవారు.వస్తూనే హౌ ఈజ్ యువర్ హెల్త్ అండ్
వెల్త్?అనేవారు, ఏదో ఇలానే అని పిల్లలు బాగున్నారా? మీఆవిడ
ఆఫీసుకు వెళ్తున్నారా? అని అడిగితే జవాబు చెప్పి మళ్ళీ మొదటికి
వచ్చి"హౌఈజ్ యువర్ హెల్త్ అండ్ వెల్త్? అనేవారు.ఘంటన్నర కూర్చుంటే
పదిసార్లన్నా అదేప్రశ్న వేసేవారు. ఆయన ఉద్దేశ్యం మంచిది. మన శ్రేయోభిలాషి
అడక్కుండా వుంటే బాగుండేదనిపించేది,కనీసం తక్కువ సార్లయినా
అడిగితే బాగుండుననిపించేది.
మా మేనల్లుడికి బొత్తిగా మాట్లాడటం అలవాటు లేదు.
ఆదివారాలు వచ్చేవాడు.సాయంత్రం వేళ వరండాలో కూర్చుంటే చెట్ల
వంక చూసి,ఇదివేప చెట్టా? అనేవాడు ఆంధ్ర లో పుట్టి వేప చెట్టు తెలియదా?
అవును,అంటే ఇది ఎందుకు పనికి వస్తుందండీ?అనేవాడు.ఆరోగ్యకరమైన
గాలి ఇస్తుంది. వైద్యానికి పనికి వస్తుంది.అని చెపుతే,ఆయుర్వేదానికి
హోమియోపతికి తేడా ఏమిటండీ?అదొక రకమైన వైద్యం,ఇదొకరకమైన వైద్యం
అంటే ఇక రెండిటి చరిత్ర మొదలెట్టాల్సి వచ్చేది.
మాచుట్టాలాయనకి కనిపించిన ప్రతివారి వయస్సు
తెలుసుకోవడం సరదా! ఎవరన్నా కనపడగానే" మీఅమ్మాయికి ఎన్నేళ్ళు?అనేవారు.
చెపుతే ,మీఅమ్మాయి పుట్టేసరికి నీకెన్ని ఏళ్ళు?అదీ చెప్పాక,నీకు మీఆయనకి ఎంత తేడా?
అదీ చెప్పాక కొంచెము సేపు మాట్లాడేవారుకాదు.అప్పుడు
ఆయన ఇవన్నీ మనసులో కూడుకొని మొత్తానికి ముగ్గురి వయసు తెలుసుకొనేవారు.ప్రశలుvEyaDam ,జ్ఞాన సముపార్జనకి
చిహ్నం. కానీ ఈ ప్రశ్నలు తట్టుకోవడం సహనానికి పరీక్ష.
2 comments:
అచ్చంగా మా అమ్మ అనేటట్టే ఉంది ఈ ప్రశ్నల టపా..అయితే ఒక్క పేరులోనే కాదు, ఆలోచనలు, మాటలు కూడా ఒకటే అన్న మాట..:)
నమస్కారాలతో
అబ్బాయి
వంశీ
madam how u got this type of template... can u give that sorce code for me
Post a Comment