Pages

Thursday, July 17, 2008

ఏమిచేయ్యాల

ఏమి చెయ్యాల
నిన్న పాలు తేలేదేం పున్నమ్మా?
ఏంపాలో!ఏంటో నమ్మా!
నిన్నంత ఆడనే పడుంటి
ఆడంటే ఎక్కడా?
గదెమల్ల తెల్ల కారడు
కోసం స్కూల్లల్లొ పిలిసిండ్రు
పోరళ్ళు నాను,ఇంటాయన
అందరాడనే పడుంటిమాయె
అయితే రోజంతానా?
కాదా మరి పాతకారడు మర్చిపోతి
మల్లెల్లి ఎత్తకపోతి
లైనుపాయె,దూరమాయె
తిండానికి గంట పాయె
తలుపుపెట్టి పెద్దమనిసి
లోనికేమొ వదలడాయె
పొని పుటోలన్న తీయకపాయె
నుంచునికాళ్ళుగుంజుకపాయె
ఎలాక్చాన్లు వత్తెనేమో లోనికెల్లు
లొనికెల్లు అంటరు
కారడు కొసం పొతె
బయట బయట పొమ్మంటరు

No comments: