కనువిప్పు
జగన్-
నితిన్ నీకు ఫోన్ చేసాడురా!అని అమ్మ చెప్పగానే "ఏమని చేసాడు?"అనీకూడా నాకు అడగ బుధ్ధికాలేదు.నేను మౌనంగా వుండే సరికి అమ్మ
మళ్ళీరెట్టించింది."ఏమన్నాడు?" అనికూడా అడగ వేమిరా?అంది.ఊ !చెప్పు అన్నాను.ఎల్లుండి నితిన్ మనవూరు వస్తున్నాడు.అంది అమ్మ.రానీ!అన్నాను."మనింటికేరమ్మాన్నాను.""ఎందుకన్నావమ్మా!ఏమిటో చెపుతావు.అన్నాను.ఏమీ!వాడు నీస్నేహితుడేకదా!నితిన్ ఏమన్నాడో తెలుసా?"మీరు చెప్పాలా ఆంటీ!ఆవూరు వచ్చి జగన్ దగ్గరకు తప్ప ఎక్కడికి వెళతాను?రాంగానే వాణ్ణి చూడకుండా వుండగలనా?అన్నాడు.ఉహూ! అన్నాను నేను.అంత పట్టుదల పనికి రాదురా!అని అమ్మ ఫొను పెట్టేసింది.నిజానికి స్తషనుకు వెళ్ళి నేను నితిన్ ని రిసీవ్ చేసుకోవాలి.కానీ నేనలా చేయదల్చుకోలేదు.ఆఫీసు వంక పెట్టి వాడొచ్చే టైంకి ఇంట్లో లేకుండా ఆఫీసుకు వెళ్ళిపోతాను. వాడే గొప్పవాడు,వాడే బిజీగా వుంటాడూనుకొంటుంటే నేనేం తక్కువ వాణ్ణా!కాళ్ళు బారజాచుకొని ఊరికే కూర్చున్నానా!అసలు కాంప్ వేసుకొని వేరేవూరు పోతే హాయిగా వుంటుంది.
నితిన్-
ఎన్నాళ్ళకో జగన్ ని చూస్తున్నాను.నాలుగు నెలలయి పోయింది.వెధవ!వాడు చిన్నప్పటినుంచీ ఇంతే!ప్రతి దానికి బుస్సుమని లేస్తూ వుంటాడు.ఒకసారి పొరపాటయితే దాన్నే సాగదీస్తూ వుంటాడు.ఈమాటు ఇంటికి వెడ్తున్నాగా!ఎదురుకుండా నిల్చుంటే ఏమంటాడేమిటి?ఈపాటీకి జరిగింది మర్చిపోయి వుండవచ్చు.ఆంటి తో వాడితో కలిసి కబుర్లు చెప్పుకొంటుంటే టైం ఇట్టే గడిచిపోతుంది.తెల్లవారేసరికి అక్కడుంటాను,ఉండేది ఒక్కరోజు,రోజంతా వాళ్ళతోనేగడుపుతా.
సరళ-
అరే!జగన్ ఏడి? అయిదున్నరకే వెళ్ళిపోయాడే?నితిన్ కోసం వెళ్ళాడులా వుంది.ఎంతైనా స్నేహితుడుకదా!వెళ్ళకుండా ఎలా వుంటాడు?నాకుతెలుసు నాబిడ్డ మనసు నవనీతం.పెన్ మర్చిపోయినట్లున్నాడుహడావుడిలో!ఇక్కడేదో స్లిప్ రాసి పెట్టాడే!అమ్మా!అర్జెంట్ గా రమ్మని ఆఫీసునుంచి ఫోను వచ్చింది.వెడుతున్నా!
కాంపు కికూడా వెళ్ళాల్సి వస్తుందేమో!జగన్ ఆరుంపావుకల్లా నితిన్ ట్రైన్ వస్తుంది.నేనన్నా స్టెషనుకు వెళ్దామంటే కారులేదు,టైములేదు.నితిన్ వస్తుంటే వీడూ కాంప్ కి వెళ్ళడ మేమిటీ?నితిన్ కి అవమానంగా వుండదు?ఫోను చేసి మాట్లాడుదామంటే పాఠాలు చెపుతానని ఫోనుఎత్తడు.ఎలా వీడికి చెప్పడం?ఒకటే ఉపాయం,ఈ మైల్ రాస్తాను,మీటింగ్ లో వున్నా చదువుకొంటాడు.అనుకొని ఇలా రాసాను-
జగన్
నేము లేచేసరికి నువ్వు వెళ్ళిపోయావు,స్టెషనుకు వెళ్ళావేమో అనుకొన్నా<కానీ స్లిప్ చూసాక తెలిసింది,ఆఫీసుకు వెళ్ళావని,త్వరగా పని ముగించుకొని వచ్చెయ్యి.కాంప్ కి వెడితే నితింబాధ పడ్తాడు,వెళ్ళొద్దు.అయినా అతను చేసిన తప్పేమిటి,నువ్వలా మొహం చాటేయ్యడానికి?ఒకవేల చేసాడే అనుకో,మర్చిపోవాలి.స్నేహితుల మధ్య అడ్డుగోడలు పెంచుకో కూడదు నాన్నా!నిజంగా తప్పులు,నిర్లక్ష్యాలు స్నేహితుల మధ్యేస్వేచ్చగా చేస్తాము.ఎందుకంటే వాళ్ళకి మనగురించి తెలుసు.అర్ధం చేసుకొంటారనేభరోసాతో వుంటాము.చిన్న చిన్న తప్పులకే పూర్వపు స్నేహమంతా తుడిచి పెట్టుకుపోతుందా?నిన్ను కలుసుకొందామని ఆనందంగా వచ్చేవాడిని-మన ఇంటికొచ్చినపుడు అవమానం చేయకూడదు.నువ్వు కాంప్కి వెళ్ళొద్దు,త్వరగా పని ముగించుకొనిరా>
అమ్మ
అని మైల్ పంపించి ఊపిరి పీల్చుకొన్నాను.ఇప్పుడిక స్థిమితంగా వుంది.జగన్ నా మైల్ చూఇ వూరు వెళ్ళకుండా వచ్చేస్తాడు. వాడు వచ్చేదాకా నేను నితిన్ తో కబుర్లు చెపుతుంటా.జగన్ వచ్చాక అందరం కలసి బయటికి వెళ్ళవచ్చు.మటర్,ఉల్లిపాయలు వేసి ఆలూ తో తరీ కూర చేస్తే పూరి తో నితిన్ కి చాలా ఇష్టం.నితిన్ వచ్చేసరికి ఎంత లేదన్నా 40 నిముషాలు పడుతుంది.ఈలోపున పూరి,కూరా తయారుచేస్తా.జగన్ నా మైల్ చదువుకొని వుండాలి.శాంతం గా వస్తాడు. చాలా రోజులకి వాళ్ళిద్దరిజోకులు వింటా.
నితిన్-
నితిన్ దగ్గరికి వెల్తున్నానంటే ఎదో ఆనందంగా వుంది.వాడి నొక్కు నొక్కుల క్రాఫ్ ,వంకర నవ్వు మర్చిపోలేము.ఇల్లు బాగానేపెట్టాడు.హోదాకి తగినట్టుగానే దర్జాగా వుంది.ఆంటి ప్రేమగా ఆహ్వానించింది."ఏడీ!బడుధ్ధాయి?ఇంకా నిద్ర లేవలేదా?అన్నా.అర్జెంట్ పని అని ఫోను వస్తే ఆఫీసుకు వెళ్ళాడు.నువ్వు స్నానం చేసి వచ్చేసరికి వాడూ వచ్చేస్తాడు.అన్నది ఆంటి. "అర్జెంట్ పనా?లేకపోతే నాకు మొహం చాటే స్తున్నాడో!స్నానం చేసివచ్చేసరికి టెబిల్ మీద పూరి,కూరా ఘుమఘుమ లాడుతున్నాయ్."ఆంటీ! చాలా ఆకలివేస్తూంది.ఈ కూర వాసనతో ఆకలి ఇంకా ఎక్కువయింది,అన్న.
ఇద్దరం టిఫిన్ తినేశాము.ఆంటి ఏదో ప్రశ్నలు వేస్తూనేవుంది నేను పరధ్యాన్నం గా ఏవో జవాబులు చెపుతూనేవున్నా.
సరళ-
కారు చప్పుడయింది,హమ్మయ్య జగన్ వచ్చేశాడు.కాంప్ కి వెళ్ళలేదన్నమాట!పోనీలే నా మాట విన్నాడు. నాకు తెలుసు నా మాటంటే వాడికి గురి.జగన్ లోపలికి వస్తూనే-"ఏరా?నితిన్!ఆవేళ నేను వస్తున్నానని తెలిసి నువ్వు ఎయిర్ పోర్ట్ కి రాలేదేరా?స్నేహితుణ్ణి రిసీవ్ చేసుకోడానికి తీరిక లేనంత బిజీనా?నీ బిజీ నాకు తెలుసులేరా!నా దగ్గర పోజు పెడ్దామని చూస్తావు. అన్నాడు. టపా టపా.నితిన్ నవ్వుతూ నిజంగా కుదర లేదురా!
అన్నాడు.కుదరక్ పోతే ఫోన్ చెయ్యొచ్చుగా!"వద్దామనే బయలు దేరానురా!దారిలో దిగి నీకు ఇష్టమని పాప్ కార్న్ కొని బయలుదేరా!మాబాస్ ఫొన్ _నిన్న పంపిన కాగితాలు వెనక్కి వచ్చాయి,నువ్వే స్వయంగా వెళ్ళి ఆపనిపూర్తి చేయాలి అని.చచ్చినట్లు ఆదరాబాదరా పరుగెత్తికాగితాలు తీసుకొని నీకు ఫోన్ చేస్తె నువ్వు తియ్యనేలేదు.నీకెలా చెప్పను? అర్ధం చేసుకొంటావులే!అని వూరుకొన్నా.మూడు రోజులు అక్కడవుండి నన్ను చూదకుండా వచ్చేసావు. ఎక్కడున్నావో తెలియదు,ఫోన్ ఎత్తవు అన్నాడు నితిన్.చాల్లే!ఫోరా! అన్నాడుజగన్.నేను బిత్తర పోయాను,ఇదేమిటి?చిలకకి చెప్పినట్లు చెపితే వీడు నితిన్ రాగానే ఇలా టపాకాయలు పేలుస్తున్నాడు.నా మైల్ చదువుకో లేదు కాబోలు అందుకే ఇలా హాట్ హాట్ గా మాట్లాడుతున్నాడు.మళ్ళీ మళ్ళీ ట్రై చేసిఫోన్ లో నన్నా చెప్పానుకాదు.రాత్రయినా కూర్చో బెట్టి మాట్లాడితే బాగుండేదేమో!టిట్ ఫర్ టాట్ అన్నట్లు ప్రవర్తిస్తే ఎలా? స్నేహ మైనా,బంధుత్వ మైనా పసిపిల్లని సాకినట్లు నాజూకుగా సాకితేనే నిలుస్తుంది.నితిన్ ఏమనుకొంటున్నాడో?అనుకొంటుండగా సుషమ వచ్చింది. సుషమ వీళ్ళీద్దరికి క్లాస్ మేటు.అందరిని కలిపి హోటలుకు తీసుకువెళ్ళి,అటునుంచి సినిమాకి లాక్కుపోయి నితిన్ ని స్టషనులో దింపి మమ్మల్ని ఇంట్లో దింపింది.సుషమ వచ్చాక నితిన్ తో జగన్ డైరెక్ట్ గా మాట్లాడక పోయినా సంభాషణలో పాలు పంచుకొన్నాడు. అందుకు సుషమే కారణం.నేను మైల్ ఇంకొంచెం ముందుగా పంపితే చదుకొని కాస్త సంబాళించుకొని వచ్చేవాడే!తప్పునాదే!అనుకొని-అనాలోచితంగా" నేను నీకు మైల్ పంపాను చూసుకొన్నావురా?అన్నాను.జగన్ మంచినీళ్ళు తాగుతూ ఆఆ హాఆ! అన్నాడు.నేను శబ్దం లేకుండా నోరుతెరుచుకొని అలా వుండిపోయాను.చదివాకనేఇలా!
స్నేహము పొగడపువ్వులాటిది.కోపము,నిర్లక్ష్యము,వ్యంగము, మొండితనము స్నేహ సౌరభాన్ని అంతం చేస్తాయి,లేకపోతే పొగడపువ్వులా చిరకాలం సువాసన వెదజల్లు తూనేవుంటుంది.
1 comment:
సురుచి గారు,
బాగుందండి మీ టపా.కాని రెండు సార్లు పేస్ట్ చేసారు అదే విషయాన్ని సరి చేసుకోగలరు.నెనర్లు.
http://srushti-myownworld.blogspot.com
Post a Comment