సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా ఆడపిల్ల జీవితం రెండుభాగాలు ,
ఒకటి పుట్టిల్లు ,రెండు అత్తిల్లు .పెళ్లి , అత్తవారిల్లు అనగానే ఆడపిల్లలకి 'అ ""ఆ " లంటే ["అ " అత్తగారు ""ఆ ""ఆడబడుచు "] భయం మనసులో పీకుతూ వుంటుంది . మాకు ముగ్గురు ఆడపడుచులు .మధ్య ఆమె పేరు సేషమ్మగారు . మా అత్తవారింటి ఇలవేలుపు నాగేంద్రుడు . అందుకని అందరికి ఆయన పేరు కలుపుతారు . నాపెళ్ళి అయేసరికి శేష వదినగారు బి .కాం ,బి .ఎల్ పాసయ్యారు .
సమాన మైన ఎత్తు ,పొడుగు ,చాయగల శరీరం ,ఖంగుమనే గొంతు ,అన్నిటికి మించి ఆమె కళ్లు చూసిన వాళ్ళని మిన్గేస్తాయెమో అన్నంత పవర్ఫుల్ గా వుండేవి . ఆమె మనస్సులోని భావాలు
నోటి మాట ద్వారా బహిర్గతంయ్యేముండు ఆమె కళ్ళద్వారా తెలిసిపోయేవి . ఆమె నాకంటే పదేళ్ళు పెద్ద .బందుత్వంలో నూ పెద్దే ! కానీ మేము ఇద్దరమూ స్నేహంగా వుండేవాళ్ళము .మా మూడో ఆడపడుచుకూడా అప్పటికి యుక్త వయస్కురాలే ! వీరిద్దరికీ పెళ్లి చేయకుండా మా ఆయనకీ ఎందుకు ముందర పెళ్లి చేసారా ?అని నేను ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ప్రస్నించుకోన్నాను ,కానీ అది జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది .వీళ్ళిద్దరూ అవివాహితులుగానే పోయారు .
చిన్నమే పెద్దామే ముండుపోయారు ,మొన్ననే శేష వదినగారు గతించారు .ఎన్ని పుస్తకాలు చదివినా ,ఏమతం ఆచరించిన ,ఎధర్మాలు బోధించిన ,ఎనిర్నయాలు తీసుకొన్నా సొంతాని కొచ్చేసరికి అవన్నీ పక్కకు తప్పుకొని దు :ఖమే మిగులుతుంది . చావు పుట్టుకలు సహజమని తెలుసు ,
మనస్సు నిగ్రహించుకోవడం కొందరికే సాధ్యం .చివరి క్షణాల లో దగ్గరవుండి చూడకపోతే ఆలోటు తీరనిదే అవుతుంది . ఆసమయంలో నలుగురితో ఆ విషాదం పంచుకొంటే మనసు చల్లబడుతుంది .విదేశాలలో వుండి వెళ్ళలేని చేతకానితనం మరీ బాధగా వుంటుంది .
వదినగారు కుట్లు ,అల్లికలు బాగా చేసేవారు .కళాత్మకం గా వుండేవి .పాట పాడేవారు ,ఆమె తరుచుగా "దేవదేవధవలాచల మందిర ,గంగాధరా హర నమో నమో " అనేపాట పాడేవారు .నాజూకుగా తినేవారు , పని అలాగే నాజూకుగా చేసేవారు . మాపెద్ద మరదికి ఎం .ఎస్సి లో రికమెందేడ్ డిగ్రీ వచ్చి చాలా డీలా పడిపోయాడు .అప్పుడు మా మామ గారు ఈమెను తోడిచ్చి ఇద్దరినీ లా చదివించారు .మనకు తెలియకుండానే ఏవో త్యాగాలు జరిగిపోతుంటాయి ,అవి అవతల వాళ్లకు లాభించడం మాట ఏమోగానీ మనజీవితం పక్క దారి పడుతుంది . లా అయాక అబ్బాయికడా అని అతనిని ఎన్రోలు చేయించారు .కొన్నాళ్ళు వూరికే వున్నారామే .ఆసమయంలో హైదరాబాదు లో పేరెన్నికగల హైస్కూలులో ప్రధానోపాధ్యాయినిగా ఉద్యోగం ఇస్తానన్నారు .మా మామ గారు ఆడపిల్లని అంతదూరం పంపానని వేల్లనియ్యలేదు .ఆతరవాత ఆమెకు వచ్చిన ఉద్యోగం పగలు రాత్రి పల్లెటూళ్ళకి కాంపులు తిరిగేది . శరత్ బాబు అంటాడు ఒకచోట "కొన్ని పనులు ఎందుకు కాలేదు అంటే దానికి జవాబు లేదు , అవి అవలేదు అంటే !"అని .సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు సరదాగా గడిపే వాళ్లము .ఇద్దరికీ కుట్లు ,అల్లికలు ఇష్టం .ఆమెతో మాట్లాడుతున్నపుదల్లా ఆమెకు పెల్లికాలేడనే బాధ లోపల మెలి తిరిగేది .రెండు దిగ్రీలుంది ,రూపసి అయిన పిల్లకి కూడా రెండో పెళ్లి వాడయినా సరే పది వేలు ఇరవై వేలూ కట్నం అడిగేవారు . ఆమెకి కోపం వచ్చేది ."ఇన్ని రూపాయలు పోసి వాడిని కట్టుకొంతెవాదేలాటి వాడవుతాడో ?ఇప్పుడేమి తక్కువయింది ?హాయిగా వుద్యోగం చేసుకొని ఇంట సంపాయిన్చుకొంతున్నాము కాదమ్మా !అనేవారు .ఆమాటలలో ఎంత నిర్లిప్తత వుందో అర్ధం చేసుకొనేవారికి తెలుస్తూంది .తమ చుట్టూవున్న వారు పెళ్ళికి ఆలస్యం చేస్తున్నారని ,శ్రద్ధ చూపడం లేదని తెలిసినా అయినింటి ఆడపిల్లలు అలా మర్యాదగానే మాట్లాడతారు .
తన ప్రేమని తమ కుటుంబానికి ,అక్క పిల్లలకి ,సమాజానికి అందించడం అలవర్చుకొన్నారు . మా వారు ఫై .హెచ్ ^డి .చేయ దానికి వెళ్ళినప్పుడు "హలో !డార్లింగ్ !నేనున్నాగానీకు హాఫ్ హస్బండ్ ^ని !నీకేమికావాలన్నా నాతొ చెప్పు ."అని ధైర్యం చెప్పేవారు .మరదల్లము వారి తమ్ముళ్ళని ఏదైనా అంటే మాటల తూణీరాలు రెడీగా పెట్టుకు మాపై విసురుతూ వుండేవారు .మల్లి మాకు మల్లెపువ్వులు కొనిపెట్టి , మన ఇంటి కోడల్లమ్మా !అని గారవించేవారు .
మంచం దిగి పని చెయ్యలేనిఅనారోగ్యం తో వున్నా మేము వెడితే కూరలు ,పళ్ళు ,పాలు ఎక్కువ తెప్పించి ,స్వీట్లు ,హాటులు తెప్పించి బాగా తినిపించేవారు . ఎవరికైనా ఉత్తరాలు వ్రాసి పెట్టడం ,కోర్టుకు సంబంధించిన విషయాలలో సలహాలివ్వడం , పిల్లలకి పాఠాలు చెప్పడం ఇష్టం . ఒక అమ్మాయి సవతితల్లి ,తండ్రి బాధ పెద్తూంటే ఆ అమ్మాయిని తెచ్చి మా ఇంట్లో నాలుగురోజులు దాచి తరువాత అనాధాశ్రమంలో చేర్పించి పెళ్లిచీసారామీ .ఇతరుల సుఖంలో తనసుఖం చూసుకొన్నారు .ఒంటరి జీవితాన్ని ప్రేమించారు .తన లోట్లకి ఇతరులని భాధ్యులు చేసి నిలబెట్టి ప్రస్నాలదగలేదు .
ఇష్టమైన పనులు చేస్తాముగానీ ,చేయవలసినపనుల్లో ఇష్టం కల్పించుకోలేము .అలా చేయాలంటే క్రమశిక్షణ ,త్యాగము ,ప్రేమా చాలా అవుసరం .ఎవరెవరి పట్ల వారి వారి బాధ్యతలు నిర్వహించదమనేది సంసారం నడిపే వారికీ ముఖ్య కర్తవ్యమ్ .స్వ సుఖ్స్ము ,స్వేచ్చ ,స్వార్ధము ,కర్తవ్యాల పై బండరాల్లలా పడిపోతాయి .కర్తవ్యాలు అడుగునుంచి కీచు మంతున్నా -ఈకోరికల కోలాహలంలోఅవి చేవిదాకా రావు . ఆత్మా ఎమూలనుంచో "ఈపని నువ్వు చేస్తే బాగుంటుంది ,చెయ్యాలి అన్తూనేవుంటుంది .దాని నోరుమూసిగొను సంచీలో మూటకట్టి మానవుడు తన అవసరాల వెనుక పరుగెత్తు తూ వుంటాడు .ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఇక ఏరుతువులోనూ చిగార్చని మోడులలా అంతమయి పోతుంటాయి నా కన్నీరు వాళ్ళపై పన్నీరు జల్లు కావాలి .
2 comments:
hmmm.. touching!! ante raayagalanu.. ippaTiki!!
అంత మంచి ఆడపడుచు దొరకడం మీ అదృష్టం, ఇంత మంచి obituary రాయటం మీ ఔదార్యం!
శేషమ్మ గారిది దొడ్డ మనసు,గొప్ప వ్యక్తిత్వం!
Post a Comment