ప్రశ్నలు
నిత్య జీవితంలొ ఎన్నో రకాల ప్రశ్నలు వేయడం, ఎదుటివాళ్ళ నుంచి వినడం జరుగుతూంటుంది. కొన్ని నవ్వు పుట్టిస్తాయి,కొన్ని ఆశ్చర్యం లో ముంచుతాయి,కొన్ని విసుగు తెప్పిస్తాయి.విదేశాలలో వున్న స్నేహితులతో గానీ,బంధువులతో గానీ మాట్లాడేట్ప్పుడు సర్వ సాధారణంగా అందరి నోటా ఒకేప్రశ్న ముందువస్తుంది."ఇప్పుడు అక్కడ టైము ఎంత అయింది?అని.వాళ్ళు ఇంత అని చెప్పి మళ్ళీ మనల్ని "అక్కడ టైము ఎంతయిందేమిటి?"అని ప్రశ్న వేస్తారు.వీళ్ళు ఊ ఆ అని గడియారం చూసి అయిదున్నర!అంటారు.అప్పుడు వాళ్ళు "అయ్యో!నిద్ర లేపానా? అంటారు."నిద్ర లేపితే ఏమయింది? మాట్లాడాలనిపించింది,మాట్లాడుతున్నారు.లేచిన వాళ్ళ నిద్ర ఎలానూ పోతుంది.దానికి విచార ప్రకటనలు, సానుభూతులు చెప్తూ కూర్చుంటే ఇందంతా టైం వేష్ట్. బిల్లు పెరిగిపోతుంది.
కొందరు ఫోను చేసి-స్నోపడుతోందా? అన్నం తిన్నారా? ఇవాల ఏమివండారు ?అనిప్రశ్నలు. స్నో పడిందని చెపుతే,నిన్నా?ఇవాళా?ఇలా అసలు విషయం పోయి ఈ ప్రశ్నల తోనె కాలక్షేపం చేఅస్తారు.
ఇంటర్వ్యూలలో వింటూంటాము,మీ పేరేమిటండీ?మీరు సొరకాయ కూర తింటారా?కూరలో ఉప్పు తక్కువయిన దనుకోండి అలానే తింటారా? లేక ఉప్పు కలుపు కొంటారా?మీరింత సేపూ ఒక వేలు బుగ్గకు ఆనించి కూర్చున్నారు అలా కూర్చోవడంవల్ల మీకు సమాఢానాలు తొందరగా తడతాయా? ఇప్పటి వరకు స్నేహితులతో కలసి ఎన్ని సినిమాలు చూసారు? కుటుంబ సభ్యులతో కలసి ఎన్ని సినిమాలు చూసారు?మీ ఆవిడతో కలసి ఎన్ని సినిమాల కెళ్ళారు?ఇలా సాగుతాయి.
కొందరి ప్రశ్నలు వింటూంటే అమ్రుతాంజనం ప్రకటన గుర్తుకొస్తుందినాకు.అందులో అతనికి తలనొప్పి వచ్చి బుర్ర ఒకపక్క కొండ శిఖరంలా లేచిపోతుంది.తెలిసినావిడ ఒకామె వచ్చి"రెడీమేడ్ డ్రెస్సుల షాపు పెడ్తున్నాను,"మీరు వచ్చి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టాలి,వీడియో తీస్తాము,న్యూస్ పేపర్లో మీఫొటో కూడా వేయిస్తాము అంది.ఈజన్మకింత భాగ్యం మళ్ళీదొరకునా?అనివెళ్ళాను. పేపరులో ఫొటో పదిందో లేదో చూళ్ళేదుకాని ఒక నెల రొజుల దాకా నాప్రాణాలు పీచుపీచు మంటున్నాయి" ఆవిడ ఏదో ఒకరోజు వచ్చి " ఏమి చేతులుతల్లి? ఒక్క బేరం రాలేదు,ఉన్న బట్టలన్ని మూటకట్టుకొని ఊరూరా తిరిగ అమ్ముకొందాం అనుకొంటున్నాం !అని అక్షింతలు వేస్తుందేమోనని.ఆర్నెల్లు పోయాక ఆషాపు యజమాని సరాసరి మాఇంటికి వచ్చింది."ఇక తిట్లు తప్పవు అనుకొని-షాపు ఎలావుందండీ? అన్న. ఏదో మీఆశీర్వాదంవల్ల బాగానేవుందండీ!అంది."ఎందుకు వుండదూ?మంచి సెంటరులో పెట్టారు,డ్రెస్సులు చక్కగా అమ్ర్చారు,అసలు గోదలకి పూల పూల అంచుల డిజైన్ వెయ్యడంటొ షాపుకి యెథినిక్ లుక్ వచ్చింది."అని వెళ్ళి కాఫీ తెచ్చా.ఆవిడ నెమ్మదిగా మీమీద చాలా ఆశతో వచ్చాను, అంది.నామీదనా?ఆశతోనా?ఇంతవరకు అలాటి పిచ్చిపనికి ఎవరూ సాహసించ లేదు అనుకొని"చెప్పండి" అన్న."ఏమీ లేదు,బొంబాయి వెళ్ళి సరుకు తెచ్చుకోవాలి,పండగ లొస్తున్నాయికదా!ఒక్క పాతికవేలు సర్దితే సరుకు అమ్మగానే బాకీ తీర్చేస్తా,అంది.నా నోట మాటరాలా.పాతిక వేలు అప్పా?ఏఆధారాలమీద నన్నిలా అడగ గలిగిందా?అనుకొని"నేనంత ఇయ్యలేనండీ!అన్న.మీకు మా షాపంటే ఎంతో అభిమానం,పోనీ పడి ఇయ్యండి అంది.అభిమానానికేమి!చాలావుంది,కానీడబ్బేలేదు.అన్నా.ఆవిడ మా ఇంటి గోడలన్నీ పరిశీలనగా చూసి-మరి ఇంటికి సున్నలు ఎలా వేయించారండీ?అంది.నాకు షాకు తన్నట్లయింది,"చూడమ్మా!మాఇంటికి సున్నాలు వేయించుకోడానికి డబ్బుందికానీ,నీకు ఇవ్వడానికి లేదమ్మా!అన్నాను.ఆవిడ సణుక్కొంటూ వెళ్ళిపోయింది.
మనం ప్రశ్న వేసేటప్పుడు మనప్రశ్న కుశల ప్రస్నో,ఉత్సాహం తో అడిగే ప్రశ్నో, ఉబుసుపోకకు అడిగేప్రశ్నో,మనప్రశ్న బాణంలా వారికి బాఢపెట్టే ప్రశ్నో ఆలోచించివేస్తే బాగుంటుంది.ఒక దంపతుల ఇంటికి తెలిసినావిడ ఫొనె చేసింది."నగేష్ వున్నాడా?"అని. అతని భార్య" లేరండీ!ఊరెళ్ళారు>అంది. వెంటనే ఈవిడ" అయితే ఒక్కాదానివే వున్నావా?"అంది.వాళ్ళకి పెళ్ళీయి ఏడాది అయింది.వాళ్ళిద్దరు వుంటారు ఇంట్లో.అందులో ఒకరు ఊరెడితే ఇంకొళ్ళు ఒక్కరేకదావుంటారు?
"ఏమిటోయ్! మీఅబ్బాయి అమెరికా వెడుతున్నాడా?"అని ఒకతను స్నేహితునికి ఫోన్ చేసాడు.ఇవతలాయన ఖంగారుపడి "మావాడా!లేదే!ఏమి?ఎందుకలా అడుగుతున్నారు?"అన్నాడు. స్నేహితుడు"ఆ!మొన్న ఎయిర్ ఇండియా ఆఫీసుదగ్గర బైట నుంచున్నాడులే!ఏమన్నా టిక్కెట్టు కొండానికి వెళ్ళాడేమో అనుకొన్నా!" ఏరోజు? గురువారమా? అదే గురువారమే! అవాళ పనిమీద అమీర్ పేట పంపించా,ఆటో అటూ ఇటూ తిప్పాడట అక్కడ ఆగిపోయింది,దిగి పావుగంట నిలబడితేగానీ మరో ఆటో దొరకలేదట.అన్నాడు.భలే మనుషులే!నిజాం భవనం ఎదుట నిలబడితే నిజాం భవనం కొనేశం అనుకొంటారునీళ్ళు,అనుకోడమేకాదు అందరితో చెపుతారుకూడా!ఇలాటి వాళ్ళు ఊహల ఉయ్యాలాలో ఊగుతూవుంటారెఫ్ఫుడూ.
తమాషా ఏమిటంటే ఎదుటి వాళ్ళని ఇన్ని తబ్సీళ్ళు అడిగి తల తినేసేవాళ్ళు సొంత విషయాలు ఎంత గోప్యంగా వుంచుకొంటారో?మొన్న ఒకరింటికి వెళ్ళాను,నన్ను చూడగానే ఆవిడ రెండు తుళ్ళు, రెండు దుప్పట్లు తెచ్చి గదిలో వస్తువుల మీద కప్పి వచ్చి నన్ను కూర్చోమంది.ఎందుకంటె ఈమధ్య వాళ్ళబ్బాయి అమెరికా నుంచి డబ్బు పంపిస్తే కుట్టు మిషను,టి.వి. మైక్రోవేవ్ వగైరా వగైరా కొనుక్కొందిటేక్కడ చూసిపోతామో అని దుప్పట్లు కప్పింది. సంతోషం కూడా పంచుకోలేరు.
3 comments:
భలే చెప్పారు! ఇక్కడో ఫ్రెండుందిసరిగ్గా ఇలానే.. ఫోను చేసిందంటే గంటన్నర వదలదు ఆరాలడుగుతూ. ఏం కూర అనడుగుతుంది,వంకాయ అన్నామనుకోండీ - వంకాయ ఎలా వండుతావూ, పులుసా, ఇగురా, టొమాటొ వే్శావా, ఉల్లిపాయ వేశావా, వంకాయ నిలువుగా తరిగావా, అడ్డంగా కోశావా, ఉల్లిపాయ చీలికలు కోశావా, సన్న ముక్కలు తరిగావా. అల్లం వేస్తావా పచ్చిమిరప నూరుతావా,నువ్వుపొడి చల్లుతావా, మూత పెట్టి వండుతావా,పెట్టవా , తిరగమోతలో ఏమేం వేస్తావూ.. ఇంకా నా శార్ధం అన్నీ అడిగి ఈలోపు నాకు చిర్రెత్తి ఏదో అనగానే నిష్టూరాలు.. హమ్మో,ఫోనెత్తాలంటే ఠారు నాకు. తిన్నదంతా అరిగి మళ్ళీ ఇంకో కూరొండుకోవాలి ఆ సంభాషణ పూర్తయ్యేటప్పటికి :)
బగా చెప్పారు. ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు ఎక్కువగా ఆడవాళ్లకే వస్తుంటాయనుకుంటా:)
@తెరెసా "తిన్నదంతా అరిగి మళ్ళీ ఇంకో కూరొండుకోవాలి ఆ సంభాషణ పూర్తయ్యేటప్పటికి :), అక్కడకూడా ఇలాంటివి తప్పవన్నమాట.
మా కజిను ఒకావిడ ఫోను చేస్తే చాలు మా పిల్లలు ఇక అమ్మ ఓ గంట బిజీ అని నవ్వేస్తుంటారు. ఆ గంటా పోచుకోలు కబుర్లు తప్ప అసలు విషయాలు ఏమీ ఉండవు. ఒక్కోసారి అవతల వాళ్ళు అసంధర్భంగా ఏదో ఒకటి మాట్లాడుతుంటే మనం కూడా మొహమాటానికో ఇంకోమాటానికో అదే ఒరవడిలో మాట్లాడేస్తుంటాము. మితంగా మాట్లాడేవాళ్ళతో మితంగానే మాట్లాడతాం.
బాగుందండి ప్రసూన గారు,! చదువుతుంటే హాయిగా ఉంది!
తెరెసా, ఇలాంటి వెధవ సంతలు ఫోన్ చేసినపుడే ఫోను పీకి అవతల పారేయాలనిపిస్తుంది. వాళ్లకి పని లేకపోతే వూళ్ళోవాళ్లందరికీ పని లేదనుకుంటారు అనుకుంటారు కాబోలు!
వరూధిని గారు, నేనూ ఇదివరలో మొహమాటం తో భరించే దాన్ని. ఇప్పుడు అలాంటి ఫోనులు వస్తే 'అరె, ఇప్పుడే అలా బజారెళ్దామని బయలు దేరాను. నువ్వు పెట్టెయ్, నేనే తర్వాత చేస్తా ' అని తప్పించుకుంటున్నా, ఏ టైములూ చేసినా సరే!
Post a Comment