కత్తికోతపై సుత్తి దెబ్బ
కత్తికోతపై సుత్తి దెబ్బ పడ్డట్టుగా, మా వదిన గారు పోయిన పది రోజులకే మా చిన్న మేన మామ చని పోయారు. కొన్నాళ్ళు గా అనారోగ్యం తో బాధపడుతున్నారు. ఒకవిధంగా చుస్తే ఆయన బాధల నుండి విముక్తి చెందారు. వున్నవాళ్ళకి ఆక్రోశం, ఆవేదన. ఇలాంటప్పుడు సముద్రాలకివల వుంది వున్నపలాన వెళ్ళలేక ఇరుక్కుపోతే మనసెంత గిల గిల లాడుటుందో అనుభవైక వేద్యం అయ్యింది ఈ సారి. మనం వెళ్ళాక పొతే ఏమి ఆగవు. మనం వెళ్లి చేసేది ఏది లేదు అనుకున్నా మనసు వినకుండా స్తంభానికి కట్టేసినవాడు గిమ్జుకున్నట్టు గింజుకుంది. ఇలాటి స్థితిలో బంధువుల మధ్య అనుభవించిన దుఃఖానికి దురాంగా కుర్చుని అనుభవించిన దుఃఖానికి ఎంత తేడా వుంటుందో తెలిసి వచ్చింది. చివరి క్షణాలలో దగ్గర వుండి నలుగురితో కలసి కాస్సేపు ఏడిస్తే, వాళ్ళతో కలిపి ఆ పది రోజులు గడిపితే ఆ దుఃఖం పంచుకున్నట్టు అవుతుంది. తల్లి తరివాత తల్లి అంతటిది పిన్న తల్లి అంటారు. మేనమామకి కూడా ఒక గౌరవ స్థానం వుంటుంది మనసులో. వాళ్ళు కూడా అక్క పిల్లల మంచి చెడ్డలు చూసుకుంటూవుంటారు. మేన మామ పోతే నాకే ఇలా అనిపిస్తే, మాతృ దేశంలో తల్లో తండ్రో చనిపోతే ఇక్కడున్నవాళ్ళ పరిస్థితి ఎంత భయంకరమో ఊహకందనిది. డబ్బు చేతిలో వుండాలి, టిక్కట్లు దొరకాలి, అంతదాకా అక్కడ సంబాళించే ఆత్మీయులుండాలి. చివరి చూపు లభ్యం అవ్వాలి. ఇక్కడున్న మా బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒకరికందిన సమాచారం మరొకరు చెప్పుకుని, ఓదార్చుకున్నాము. ఇంటికి ఫోన్లో మాట్లాడి శాంతిద్దామంటే, గొంతు పూడుకుపోయి మనం, అవతల వాళ్ళు ఏడుస్తూ ఏదో చెప్తున్నారు, ఒక్క మాట తెలీలేదు. మా పిన్నతల్లి తన పెద్ద కూతురుని తమ్ముడుకిచ్చి పెళ్ళిచేసింది. ఆవిడిప్పుడు 80 ఏళ్ళ పండుటాకు. ఇటు తమ్ముడు, అటు అల్లూడు, రెండువిధాలా ఆమెకి గుండె కోత. ఆడ పిల్లలు ఒకటే ఏడుపు. ఎంత ఏడ్చినా ఏడుపాగటంలేదు అక్కాయ్యా, పొంగి పొంగి వస్తూనేవుంది అంది. తల్లి తండ్రి చనిపోతే, గుండెలోచి ఒక ముక్క కోసి అవతల పారేసినట్లనిపుస్తుంది. నిజానికి మనిషికి, మనిషి మనసుకి ఒంటరి తనం అప్పుడే మొదలవుతుంది. ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, భార్యకి భాధ్యతలేవి లేకుండా వెళ్ళిపోయాడు మామయ్య. అయినా భార్యకెంత దుఃఖం!ఇన్ట్లోనిన్చీ జీవితంలోంచి ఆవ్యక్తి తప్పుకోన్నాక మాననిగాయం,పూడ్చాలేనిగోయ్యి
సంసార వృక్షం పెకలించినట్లయిపోతుంది,తిరగేసినట్లవుతుంది,చిఇకట్లో నడిచినట్లున్తుంది,సక్తిఅంతా పాదాలలోకి వస్తుంది,మనమేలేనట్లు మనకేనీ లేనట్లు అనిపిస్తుంది.అందుకేఅంటారు,"ఒక మంగలసుఉత్రం
కదిలితే వెయ్యి సూత్రాలు కడులుతాయని .ఇదంతా బ్లాగ్లో ఎందుకువ్రాస్తున్నానంటే అదొక స్వాంతన .వ్రాయడానికి సంకోచించాను కానీ "ఈబ్లొగ్ ఎంత ఉపయోగ పడుతున్నదోనీబ్లొగే నీకు తోడునీడా
నేపాఠకులేనేకుతోబుట్టువులు "అనుకోని వ్రాసా.
No comments:
Post a Comment