వెన్నదొంగ 5
చెంచు కర్రొక చేత చిన్నిమురళొకచేత
నవ్వుతూ వచ్చేటి నాచిన్ని కృష్ణ
పాడవోయిపాట వేడుకొంటున్నా
నీమురళి గానమే నాబ్రతుకు తెరువోయి
పాడవోయి పాట వేడుకొంటున్నా
అమ్మ నికోసమై అటుచూసి,
ఇటుచూసి కన్నా కన్నా యంటూ
కలవరిస్తోందోయి
అమ్మకోముద్దిచ్చి ఆడుకోవోయి
[రచనకళాప్రపూర్ణ శ్రీ రావూరు సత్యనారాయణరావు ]
రానేరాడా యదునందను డి
దారినిపోడా వ్రజసుందరుడు
దారికాచినా తొందర పడినా
మందగమన తా మనసు విప్పకే
అందజాలునా భువనమోహనుని
పొందజాలునా శ్యామ సుందరుని
కొమ్మల నీడల గోపసుందరులు
రంగురంగులా కొంగులుపరచి
రమ్మని పిలచినా రాని మాధవుడు
కాలిబాటలో కదలి వచ్చునా [రా]
[రచనకళాప్రపూర్ణ శ్రీ రావూరు సత్యనారాయణరావు ]
యుక్తం కిం? తవ శర్వరీశముఖ
మద్వేణీ సమాకర్షణల్!
బాలే వీత్యాం త్వత్ కుచమండలల్
మమకథల్ ఘృన్నాతి సేతోజవాన్
వ్యత్యస్తం క్రియతే తవ
జహి జహి స్వామిన్ వచస్సాధుతే
ఆధోయః కురుతే త్వయేవ భవతాత్
దండస్య యోగ్యం ఖలూ
మలయా నిలమిదే చల్లగ వీచెన్
మధువన మదే భమా భమా
మధురా నగరిలో చల్లలమ్మ బోదు
దారి విడుమూ కృష్ణా కృష్ణా ఆఅ
నీపై మోహము ఓపలేనెసఖి
నిమ్మతరువు కాడ నిలువవె భామా
మాపటివేళకు తప్పక వచ్చెద
పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా
పట్టకురా కొంగూ గట్టిగాను కృష్ణా
అత్త చూచితే నన్నూ ఆరడి చేయును
ఆగడ మేలరా అందగాడ కృష్ణా
సాకులు చూపి చల్లగ జారగా
సమ్మతింపనే భామా..నే సమ్మతింపనే
కొసరినాతో సరసములాడకు
రాచమార్గమిది సరసములాడకు
రాచమార్గమని బెదరింతువు నను
నీ చతురతలిక చాలునే భామా
వ్రజ వనితలు నన్నూ చేరవత్తురికా
విడు విడు నా చేయి కృష్ణా కృష్ణా..
భక్తి కి వసమౌదున్
అనురక్తి కి వసమౌదున్
ఈ భక్తి రక్తులోకటే
సకల చరాచర సహితడునగు నే
సర్వ సాక్షినై సంచరింతునే
భక్తి కి వసమౌదున్
అనురక్తి కి వసమౌదున్
ఈ భక్తి రక్తులోకటే
***********************
డాన్స్ నేర్చుకొన్నవారు ఈపాట ఎప్పుడో ఒకప్పుడు తప్పక
పాడివుంటారు.ఒకరు కృష్ణుడుగాను,మరొకరు గోల్లభామగాను
నర్తిశ్తూ కృష్ణుని డబాయింపును,గొల్లభామ అమాయకత్వాన్ని
ప్రదర్శించి సరసుల హృదయాలను కొల్లగొడతారు.
**********************
నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరి సర్ఫిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వలమాన ధనంబు దోచెనో
మల్లియలార మీపొదలమాటున లేడు గదమ్మ చెప్పరే!
No comments:
Post a Comment