ఇతనాతొ కర్నా స్వామీ జబ్ ప్రాణ్ తన్ సే నికలే!
ఇతనాతొ కర్నా స్వామీ జబ్ ప్రాణ్ తన్ సే నికలే
గోవింద నాం లేకే తబ్ ప్రాణ్ తన్ సే నికలే
శ్రీ గంగాజీకా తట్ హో, యమునా కా వంసీవట్ హో
మేరా సావరా నికట్ హో జబ్ ప్రాణ్ తన్ సే నికలే
పీతాంబరీ కసీ హో, ఛవి మన్ మే యే బసీ హో
హోటోం పే కుచ్ హసీ హో, జబ్ ప్రాణ్ తన్ సే నికలే
జబ్ కంఠ ప్రాణ్ ఆ యే, కోయి రోగ్ నా సతాయే
యమ దరశ నా దిఖాయే జబ్ ప్రాణ్ తన్ సే నికలే
ఉస్ వక్త జల్దీ ఆనా, నహీ శ్యాం భూల్ జానా
రాధే కో సాత్ లానా, జబ్ ప్రాణ్ తన్ సే నికలే
ఏక్ భక్త కీ హై అర్జీ, ఖుద్గర్జ కీ హై గర్జీ
ఆగే తుమ్హారీ మర్జీ, జబ్ ప్రాణ్ తన్ సే నికలే
************************
ఈ పాట ఎవరు వ్రాసారో తెలియదు కాని నాకు చాలా ఇష్టమైన పాట.
అనుప్ జలొత పాడారు. పైన వెన్న దొంగ 4 మీద క్లిక్ చేస్తే, ఈ పాట యు ట్యూబ్ లో వినచ్చు.
దీని అర్ధం ఏమిటంటే:భక్తుడు కృష్ణునికి వినతిపత్రం ఒకటి ఇస్తున్నాడు.
హే!భగవాన్!నాకు ఈపని మాత్రం చేసిపెట్టు.
అదిఏమిటంటే నాప్రాణంపోయేటప్పుడు గోవిండా అంటూ నామం చేస్తూ పోవాలయ్యా!అలానువ్వే చెయ్యాలి.
నువ్వేనా స్వామివి,ప్రాణాధారానివికదా,
చివరి క్షణాలలో నువ్వుదగ్గర వుండాలి,
శ్రీగంగ ఒడ్డున, వంశీవనంలో, నువ్వునా దగ్గరే వుండాలి
ఈపని కాస్త చేసిపేట్టు నాప్రాణం పోయేటప్పుడు
అపుడునువ్వు పచ్చని పట్టుపీతాంబరం
నడుముకు బిగించి కట్టుకొని వుండాలి,
నిన్నుచూసి ఆకాంతిని నామనస్సులొనింపుకొని
నా పెదవులపైచిరు నవ్వు చిందాలి
ఈపనికస్త చేసిపెట్టు
ప్రాణం పోయేందుకు ఏదో ఒక కారణం కావాలి,
ప్రాణం గొంతుకలోకి వచ్చ్చినపుడు యముడు దర్శనం ఇవ్వకుండా,
రోగం నన్ను పీడించకుండా,సహాయం చెయ్యి ఈపనికస్త చేసిపెట్టు
నాప్రాణం పోయేటప్పుడు శ్యామా!
నువ్వు మాత్రం ఆలస్యం చేయకుండా రావాలి.
కృష్ణా!నువ్వు ఆలస్యం చేస్తే నేను భరించలేను.
అన్నట్లు మర్ఛి పోయాను,
రాధాదేవినితీసుకురావడం మర్చిపోకు,ఆమెతో పాటురా!
ఒక బీద భక్టుడు పెట్టుకొన్న విన్నపమిది.
దీన్ని అంగీకరిస్తే నీకెమి కష్టం లేదులే!
అయినా నీఇష్టం! నాకోరిక విన్నవించాను,
నీఇష్టం కృష్ణా! మన్నిస్తావో!తిరస్కరిస్తావో!
ఒకభక్తుడు భగవంతుణ్ణీ కోరుకొనేది ఇంతకంటే ఏముంటుంది?
ధన ధాన్యాల్ని,బంధువులని,ప్రియమైన వారిని విడిచి
వెళ్ళలేక ప్రాణి గింజుకొనేటప్పుడు, స్వామి దర్శనం కలిగితే మాయలన్ని పటాపంచలయి శాంతికలుగుతుంది.
No comments:
Post a Comment