Thursday, August 28, 2008
వెన్నదొంగ 6
నీపెరే మధురం
క్రిష్ణా !నీపేరెన్తో మధురమురా
గోవిందా ! నీ పేరెంతో మధురమురా
గోపాలా నీ పేరెంతో మధురమురా
నందనందనా !నీ పేరెంతో మధురమురా
గోవర్ధన గిరిధారీ !నీ పేరెంతో మధురమురా
నీ పేరంటే నాకెంతో ప్రాణమురా
నీ నామామ్రుతమెంత మధురమో
చెప్పలేనురా క్రిష్ణా
అదేమిచిత్రమో ఎంతజుర్రినా
తీరదేమిరా క్రిష్ణా !తనివి
తీరదేమిరాక్రిష్ణా !తనివి
ఒమాయావి నీనామములో
ఈహాయిని ఎరగాజూపి
ఈహాయిని ఎరగాజూపి
నామము చేసే అమాయకులతో
గారడీలు చేస్తావా !
నాడు ఒంటరిని ,నేడు ఒంటరిని
రేపు ఒంటరిని క్రిష్ణా !నా
కెవరూ లేరిక క్రిష్ణా !నీ
నామమే ఎల్లవేళలా
వీడని జంటర క్రిష్ణా !నను
వీడని జంటవి క్రష్ణా !
ఈ పాట ఎవరు వ్రాసారో తెలియదు ,బాగుంది నలుగురు
చదివి ఆనందిస్తారని ఆశ .కవికి నమస్సులు .
జ్ఞాన ప్రసూన
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
వినాయక చవితి శుభాకాంక్షలు.
Post a Comment