Pages

Sunday, August 3, 2008

అమృతబిందువు

అరణ్యంలో కాలి బాటలా

ఎడారిలో చెలమలా

నీరవ నిశిరాత్రి చీకటిలో

దివ్య కరదీపికలా

చెంపలపై కారే కన్నీటిని

అదృశ్యంగా తుడిచే హస్తంలా

చూసిన ప్రతిసారి కళ్ళల్లో

నవ్వయి వెలిగే మనసులా

తెగిన ఆశల మాలల్ని నమ్మకంగా

దాచుకొనే అందాల భరిణలా

ఏది జరిగినా,ఏదివిన్నా,ఏదితిన్నా

ఏదికన్నా చెప్పప్లనే ప్రేరణలా

నీమనసుని నీనవ్వుని తాజాగా

నిలపాలని కోరే ఆశలా

నిన్ను వదలి స్వర్గమైనా వెలా

తెలా పోతుందన్న ప్రేమలా

జీవితమంతా జల్లించినా

ఒక్క సఖి మిగిలినా చాలు

విషాద,విభ్రమ,విహ్వల,విరహంలో

అమృతపు చుక్కయి ఆదుకొంటుంది

అదిలేకపోతే గుండె ఆగిపోయే

స్నేహమే నాఊపిరి

నాకు దొరికింది స్నేహం

నాకు దొరికింది స్నేహం

స్నేహమా!చిరుగాలిలా చేరి

ప్రతి ఎదని సేదతీర్చు

మత్సరం లేని మనసు

మరక లేని స్నేహం

జన్మ జన్మల పుణ్యాల

చిరుమల్లెల సొగసు

{ పలకరించి,చిరునవ్వులు చిలకరించి,చెలిమితో నన్నలరించే

నాఫ్రెండ్స్ కి ఫ్రెండ్షిప్ డే కానుక.}

1 comment:

నిషిగంధ said...

ప్రసూన గారూ, చాలా బావుందండీ!
అలాగే మీ బ్లాగ్ కొత్త రూపం కూడా..