మనసు మెరిస్తే
మొన్నశనివారం చిన్నవాడి దగ్గర కొచ్చేసరికి రాత్రి ఎనిమిదయింది.విమానంల్ నిముషంలొ చేరిపోవచ్చు అంటారుగాని,అటు,ఇటు టైంబాగానే పడుతుంది.రెండు గంటల ప్రయాణమైతే దాన్ని ఆరుగంటలకింద లెక్కవేసుకోవచ్చు.లోపలికిరాగానే గ్లాసుల్లొ మొక్కల్ని చూసుకొన్నాను,పసుపురంగు ఆకుపచ్చ కలగా పులగంల కనిపించాయి. పొద్దున లేచాక పేపరు,చాయ్,మైల్ చూసుకొన్నాక వాటిదగ్గర చేరాను.అమ్మా!మొక్కల్ని బతికించానుకదే?అన్నాడు మావాడు.అవును అన్నాను.వళ్ళు వెళ్ళాక ఒక ప్లాస్టిక్ స్పూను, కత్తెర టిష్యూ పెపర్స్ తీసుకొని కూర్చుని పరిశీలించా. మొక్కలు బాగానే వున్నాయి,కొన్ని ఆకులు ఎండిపోయాయి,సోంపు తీగలు వసివాడాయి,చిన్నగుత్తులు ఎండిపోయాయి.ఒకగ్లాసులోమొక్క మరొకగ్లాసుమీదకి వాలిపోయింది.ఒక నీలంపూలతీగ,సోంపుతీగ ముట్టుకొంటే విరుగుతాయేమో అన్నట్లున్నాయి.నెమ్మదిగా వాటిని విడదీసాను. ఎండిన ఆకుల్ని కత్తెరతో కత్తిరిచాను,చేమ ఆకులు కాస్త నిలబడ్డాయి.వాటిమీదకి సోంపు తీగల్ని వేసి నిలబెట్టాను. సోంపు తీగలో వడిలిన గుత్తుల్ని నెమ్మదిగా కత్తిరించా.స్పూనుతో గ్లాసులోని మట్టి నెమ్మదిగా పైకి కిందకి చేసి కాసినికాసిని నీళ్ళుపోసా.తెల్లవారేసరికి మొక్కలన్ని తాజాగా వున్నాయి.గ్లాసులుతీసి ట్రేలు శుభ్రం చేసా. చిన్న నీలం పూలు కోమలంగా వున్నాయి.మావాడు చూసి మొక్కలన్ని కళకళలాడుతున్నాయే! ఏమిచేసావమ్మా!అన్నాడు. ఏమీ చేయలేదురా!ఎండిన ఆకులు తీగలు కత్తిరించాను.ట్రేలు శుభ్రం చేసా!అంతే.పనికిరాని వాటిని తొలగించకపోతే పరిసరాల అందాన్ని చెడగొడతాయి.అవి తొలగిస్తే మొక్కలు చిన్నగావున్నా,బలహీనంగావున్నా చూడటానికి హాయిగా వుంటాయి.మన మనసు అంతే!చెడుభావాల్ని తోలగించుకొని, శుభ్రంగా వుంచుకోంటే "మనసేఅందాల బృందావనం "అయిమెరుస్తుంది,దేవకన్యలువచ్చి స్నేహము,దయ,కరుణ,సేవాభావం, అనేపూలు పూయిస్తారు అన్నా. ఇవాల్టిపాఠం అయిందిగా!అని టి.వి ఎదురుగా చతికిల బడ్డాడు మా సుభద్రాచారి.
1 comment:
Guru pooja (upaadhyaula dinotsam naadu Guruvu gaarini gurtu chesi tarimpachesaaru ...
Chaala santosham
MOuli
Post a Comment