పొదరింట్లోరైలు
కెనెక్టికట్ వచ్చిన మర్నాడే మా అబ్బాయి"స్ట్రీ ట్రైన్ రైడ్ కి వెళ్దాంపద,అన్నాడు.జపాన్లో థండెర్ బొల్ట్లాటిదా అన్నాను,అదితల్చుకొంటే ఇప్పటికి భయమేస్తుంది.థండెర్ బొల్ట్ ఎక్కితే గభాలునపైకివెళ్ళి,దభీమనికిందికి పడుతుంది.అలాకాదులే!రైలులో కూర్చుని నెమ్మదిగా వెళ్ళడమే.లంచ్ ముగించుకొని ఒంటిగంటకల్లా బయలుదేరాము.మా అబ్బాయి స్నేహితుడు మీరువెళ్ళాక కొత్తకారుకొనుక్కొన్నా దాంట్లో వెడదాము అనికారుతెచ్చాడు.42కి.మిదూరం,ఘంటప్రయాణం.ఇక్కడ ఏచోటుకి వెళ్ళాలన్నా మాప్ చూసుకొని బయలుదేరతారు.అన్ని మాప్లు కంప్యుటర్ లో దొరుకుతాయి.84వరూట్,తరువాత190రూట్, ఆపై54వ రూట్,73వేక్జిట్ అనిడైరెక్షన్లు వుంటాయి,పెద్ద బోర్డులు వుంటాయి.డైరెక్షన్ ప్రకారం వెడితేహాయిగా చేరతాం. కబుర్లలో ఒక ఎక్జిట్ మర్చిపోతేఅక్కడినుంచి వూరు వెళ్ళినంతదూరం వెడితేగాని వెనక్కిరాలేము.ఇప్పుడు జి.పి.ఎస్ అనేయంత్రం వచ్చింది.అదికారులో కనెక్ట్ చేసుకొన్ని ఫలానా చోటుకి తీసుకేళ్ళు అంటే అదే మనకి లెఫ్ట్,రైటు చెపుతూ తీసుకుపోతుంది.ఎక్కడైనా ముందుకుపోతే ఇక్కడినుంచి ఒక మైలు వెడితేఅక్కడ లెఫ్ట్లో పార్క్ దగ్గర టర్న్ తీసుకోవచ్చు అనిసలహా చెపుతుంది.దీని సహాయంతో కొత్తవూరుకి అర్ధరాత్రి వెళ్ళినా బెంగలేదు.ఆకాశంలో శాటిలైటునుంచి ఆదేశాలందుకొని మనకు చెపుతుంది. టెక్నాలజీ ఎంతపెరిగిపోయిందో?
సెప్టెంబర్ వచ్చింది.చల్లదనం తొంగిచూస్తోంది.మేమురివర్ రోడ్ ఈస్ట్ హాడేం కి వెళ్ళాలి.అక్కడవుందిఎసెక్స్ స్టీంట్రైన్ రివర్ బోట్ రైడ్.ట్రాఫిక్ తక్కువే!కొంచెం దూరం పోయాక రెండువైపులా చెట్లు కొండలు.పొడుగ్గా చెట్ల వరుస దగ్గరగా పెయింట్ చేసి చిత్రకారుడు ఆకుపచ్చ,పసుపుపచ్చ ఒక డైరెక్షనులో పెయింట్ చేస్తేఎలావుంటుంది?అనుకొనికాస్త కాస్తారంగుకొమ్మలకి వేస్తేఎలావుంటుందో అలావున్నాయుచెట్ల రంగులు.స్ప్రింగ్ ఇక్కడ మామూలు సమయానికే వచ్చింది.కాని ఫాల్ తొందరగా ప్రారంభమయినట్లున్నది.కొన్నిచెట్లకి పైకొమ్మలన్నిటికి ఆకులు రాలిపోయాయి.కొన్ని పైన కిందా బాగానే వుండి మధ్యలో పసుపురంగులోకొచ్చాయి.అటూ ఇటూ ఆకుపచ్చని చెట్లమధ్య ఒకేఒక చేట్టు రంగులు మార్చుకొని అందకత్తెలా నిలబడింది.చెట్లకి పాకిన తీగలు పచ్చబడి తోరణాలలా వున్నాయి.ఒకచెట్టంతా ఆకుపచ్చగా వుంది,మధ్యలొ బంతిలా కొన్ని ఆకులు ఎర్రగా అస్తమిస్తున్న సూర్యుడిలా, పెద్ద ఎర్రబొట్టులా వున్నాయి.అందంగా కత్తిరించిన గుండ్రని బుష్లు రంగుమారికాఫీకలర్లొకొన్నీఅకుపచ్చకొన్ని వుండి గొబ్బెళ్ళలావున్నాయి.కొన్నిచెట్లుకొమ్మలకొసలు ఎరుపుగామారిచెట్టంతా ఎర్రపూలు పూసినట్లున్నాయి.కొన్ని చెట్లు పాక్షికంగా ఎండిపోయాయి.ఫాల్ రెండు నెలలు వుంటుంది.స్ప్రింగ వచ్చినపుడు ముందుగా చెట్టంతా పూలు విరగపూసి,20 రోజుల్లో ఆపూలురాలిపోయి చెట్టంతా ఆకులువచ్చి అవన్ని రాలడం మొదలయ్యాయి.ప్రకృతిలోని మార్పులు కళ్ళెదుట కనిపిస్తాయి.నవంబర్ వస్తే సీతలపవనాలకి,మంచు ధాటికి తట్టుకోలేకాకులన్నీరాల్చిమోడులైఒంటికాలిమీదనిలబడితపస్సు చేసేమునులలాగావసంత కాలం కోసం ఎదురు చూస్తాయి పాపం . .......saSeSham
No comments:
Post a Comment