Pages

Friday, September 5, 2008

పోదరింట్లోరైలు -2

పొదరింట్లో రైలు 2
2ఘంటలకి అక్కడికి చేరుకొన్నాము.2.30కి రైలుబయలుదేరుతుంది. బోట్ టికెట్స్ అయిపోయాయి.ఏంచేస్తాం ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అనుకొని టికెట్స్ కొనుక్కొన్నాం.రైలులోకి ఎక్కగానే కిటికీ తలుపులు ఘట్టిగా వున్నాయో లేదో చూసుకొన్నా,లేకపోతే వేళ్ళు,చేతులు విరుగుతాయి. కిటికీ లు ఘట్టిగా వున్నాయి.రైలు లోపల కప్పు ఎత్తుగావుండి,రైలుపెట్టె విశాలంగా అనిపించింది.రెండు రెండు సీట్లు అటు ఇటు వుంటాయి. ఒకరి వెనక వెనక ఒకరు కూర్చున్నట్లు,కాకి కావాలంటే వాటిని ఎదురుబదురుగా తిప్పుకోవచ్చు.వీళ్ళు ఏవో తమాషాగా సౌకర్యాలు చేస్తుంటారు.రైలుకి ఆరు పెట్టెలు.వీధి గుమ్మమ్నుంచి పెరటి గుమ్మందాకాకనిపించినట్లు వరసగా దారి కనిపిస్తోంది,ఒకదాన్నుంచి మరొకదానికి దారివుంది.తెల్లటి షర్ట్ నేవీబ్లూపాంట్ నేవీబ్లూటై, నేవీబ్లూటోపీ పెట్టుకొనిధరించి గార్డ్ లు ఇద్దరు ముగ్గురుంటారు. వాళ్ళు విశెషాలు అనౌన్సె చేస్తూ వుంటారు.మైకె పట్టుకు రైల్ లో తిరుగుతూ వుంటారు.రైలు దారికి రెండువేపులా చెట్లు కొండలు.చెట్లు ఎలావున్నాయంటే కొమ్మలచేతులు కలుపుకు నిలబడ్డాయా అన్నట్లున్నాయి.చల్లటినీడ. పొదరింట్లొనుంచి రైల్ వెడుతున్నట్లుగావుంది.ఇక గాలి సంగతి చెప్పక్కర్లా. ఇండియాలో డెహరాడూన్,అరకులోయ ల లోంచి వెడుతుంటే ఇలాగేవుంటుంది.గాలి పీల్చి బతకొచ్చు.ఎంతమంది ఎంజినీర్లు ఎన్ని ఏ/సి పెట్టినా ఇలాటిగాలి రాడు.నిజంగా పవనుడె వచ్చాడా అనిపించింది. కన్నతల్లి స్పర్శలావుంది.గాలిపీల్చుకొంటూ చివరిదాకా వెళ్ళాము. రైలు వెనక్కి తిరగలేదు. ఇంజను వెనక్కి నడిచింది. బోట్ రైడ్ కి వెళ్ళేవాళ్ళందరిని ఒకపెట్టేలోకి వెళ్ళమన్నారు. తిరిగి వచ్చేటప్పుడు రేవుదగ్గర వాళ్ళు దిగారు. బోట్ ఎక్కివచ్చినవాళ్ళూ రైలు ఎక్కారు. నది ఒడ్డంతా స్టీంబోట్లతో నిండివుంది.ధనవంతులు సొంతంగా బోట్స్ కొనుక్కొని శెలవురోజుల్లో అది కారుకు తగిలించుకొని తెచ్చుకు నదీ విహారాలు చేస్తారు,కొందరు అద్దెకు తెచ్చుకొంటారు,కొందరు బోట్స్ అక్కడే పెట్టుకొంటారు.పసిగుడ్డునికూడాతీసుకొచ్చారు
జిల్లెట్ కాజిల్ అక్కడికి కనిపిస్తూ వుంటుంది. అది వేరేరూట్ రైలు చిన్నచిన్న వంతెనలు దాటుతూపోతుంది.చెట్ల నీడలు అలుముకుపోయి అక్కడ అగాధమైన లోయలు కనిపిస్తాయి.చంటోడ్చి కష్టపడి వారమంతా పనిచేసి శెలవురాగానేచంద్రవంకలో నిద్రపోతారు వీళ్ళు.ప్రతిక్ష్ణాన్ని,నేలపై ప్రతి అంగుళాన్ని ఉపయోగించుకోవడం వీళ్ళకి బాగా తెలుసు.ఒకచెట్టుపెడతారా దానిమొదట్లో పూలమొక్కలుపెడతారు,అవి మొదట్లొగుత్తులుగుత్తులుగా పూలుపూస్తాయి.ఒకలతని పెడతారు,అది చెట్టుకు అల్లుకొని కప్పేస్తుంది.వసంత కాలం నేలమీదవీలయినంత మేర పూలమొక్కలుపెట్టి పూయించి భూమిని పూజిస్తారు.ఎంతోఖర్చుపెడతారు.ఒకచొట చేటంత పొద్దుతిరుగుడుపువ్వు చూసాను,బిళ్ళగన్నేరు చెట్టులాపెరిగి అరచెయ్యంతపూలు పూసింది. బంతిపూలు ఎక్కడపడితేఅక్కడ పలకరిస్తున్నాయి.రైలూఅగింది.చల్లగాలికి వీడ్కోలుచెప్పి కిందికిదిగాము.ఆకలి హూంకరించింది.ఒకరైలుపెట్టెకి ఇన్ ఔట్ అనివ్రాసితలుపులుపెట్టారు,లోపల కివెళ్తేకాఫీ,టీ జూస్లు మంచ్లు,బిస్కెట్స్ వున్నాయి.యోగర్ట్తిని గిఫ్ట్ షాపుకి వెళ్ళీ దర్శించితే అక్కడ స్పూన్స్,రైలింజెన్లు ఫొటోఫ్రేంలు,కీచైన్లు,పెన్సిల్స్,మగ్లు,స్టీం రైల్ ట్రేడ్ మార్క్ లతో అమ్మారు. అక్కడ డిన్నరు రైల్ వుందిట. దానిలో 4ఘంటలు ప్రయాణం.టికెట్ 70 డాలర్లుఒకరికి.ఏ,మైల్ లో బుక్ చేసుకురావచ్చు బర్త్ డే పార్టీలు,గ్రూప్ టూర్లు ,స్కూల్ టూర్లు,రైనీడే కూపన్లుఎన్నొవున్నాయి. రైలులో వెళ్ళడానికి ఇంతదూరం వెళ్ళడమేమిటి? అనుకొంటాము కానీ ప్రతి దాంట్లోనూ ఎదో విశేషం దాగి వుంటూంది. ఆచల్లగాలి నేస్తాన్ని మర్చిపోలేము.

2 comments:

Rani said...

mee posts baavunnaayi, ivaale paathavi anni chaduvuthunnaanu.
you are one of my favourites from today :)

చింతా రామ కృష్ణా రావు. said...

శ్రే జ్ఞాన ప్రసూనాంబా ! సార్థక నామధేయవమ్మా. మీకు నా వందనములు.
నా "ఆంధ్రామృతం " లోని పద్యాలు చదివి, స్పందించి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసి ఉత్సాహ పరచుచున్నందుకు మీకు నా ధన్యవాదాలు.
చ:-సురుచిర భావసంపదను సూక్తులయట్లు వచించుచున్న మీ
"సురుచి" ని గంటినమ్మ! మధు సూదను రాణివొ? బ్రహ్మ రాణివో !
బరువగుభావసంపదను పద్యములందు వచింప, మెచ్చుచున్ ,
ధర నను బంధువంటివిగ.! ధన్యుడ. జ్ఞాన ప్రసూన తల్లిరో !
నిరంతరం మీ ప్రోత్సాహమే ఆంధ్రామృతానికి అమృతత్వం సిద్ధింప చేస్తుంది. నమస్తే.
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.