వినాయకుణ్ణి చన్కనెత్తుకుని .........
మాకోడలు బితుకు బితుకు మంటూ ఎళ్ళుండి చాలా ఇంపార్టెంట్ మీటింగు వుంది అత్తయ్యగారూ రేపంతా ప్రిపరేషను చేసుకోవాలి.అన్నది.మావాడు టైం లేదమ్మా!అన్నాడు.ఇలాటి కూతేఏదో కూస్తాడనినాకు ముందునుంచీ అనుమానంగానేవుంది. టైం లేకపోతే తెల్లవారుఝామున లేస్తేసరి అన్నా . లేవలేనమ్మా!ఆఫీసుకు ఎన్నింటికి వెడతావు?నిద్ర లేవడాన్ని బట్టి.ఈమధ్య మావాడు డిపార్ట్ మెంట్ మారాడు,కొత్తదానికి వెళ్ళే లోపున వూరికే కూర్చోవడమెందుకని ఒగొర్రెతోక ఉద్యోగం లో చేరాడు.ఆ బాస్ ఒక్క రోజుకూడా శెలవు పెట్టడానికి వీల్లేదు అన్నాడట.ఇంకోస్నేహితుడికి ఇల్లు ఖాళీ చేసేందుకు హెల్ప్ చేస్తానన్నాడట.నేనేమీఈ మాట్లాడలేదు,మాకోసం మాతరఫునకూడా నువ్వే పూజ చెయ్యమ్మా! సాయంత్రం వచ్చి ప్రసాదం తింటామూని నాముఖం అటూఇటూ తిప్పి వెళ్ళిపోయాడు.హరివెంట సిరి నెమ్మదిగా వెళ్ళింది. కొన్ని అలవాట్లు మానలేము. కనీసం తగ్గించీయినా చేయాలని తాపత్రయం.ఇలాటి పరిస్థితి కల్పిస్తే వినాయకా మరి నీపూజ సంక్షిప్తంగానే చేస్తాను అని బెదిరించా.వుండ్రాళ్ళూ చేయాలి.బియ్యపురవ్వ దొరకదు.విసిరే టైం లేదు.ఇడ్లి రవ్వతో చేద్దాములే అని నీళ్ళుకాస్త తక్కువ ఎసరుపెట్టి దాన్ని బతిమాలి వుండ్రాళ్ళు చేసా. పుగం,పానకం,వడపప్పు, చలిమిడి,పళ్ళు కొబ్బరికాయ.వంట పని అయిపోతే స్థిమితంగా పూజ చెయ్యొచ్చు.ఇల్లంతా వెతికి తొమ్మిది వినాయకుళ్ళని ఒకచోట చేర్చాను.ఒక క్రోటను ఆకు అర్ధవృత్తాకాతంగా వినాయకుడి నెత్తిన పెట్టా.ఇంకో రెండూఅకులు తమలపాకులు అని భావించి బియ్యమ్మీద పెట్టి పసుపువినాయకుణ్ణి కూర్చోబెట్టా.అప్పుడు గుర్తు వచ్చింది.వినాయక వ్రతకథాకల్పము.ఏదీ?ఇంట్లో లేదు.ఇందియాలో ఒక్కొక్కరి ఇంట్లో అయిదారు వుంటాయి. పత్రికలలో సందర్భానుసారంగా వ్రతాలన్ని మంత్రాలు,అష్టోత్తరాలతో ప్రకటిస్తున్నారు.ఒక్కటి పట్టుకురాకూఊడదూ? ఆరునెలలో వచ్చేపండగలకోసం ఏమిపట్టుకెళ్ళాలో తెలుగు కాలెండరు దగ్గర పెట్టుకొని పెట్టెసద్దుకోవాలి.ఏదో కేశవా!నారాయణా1 అని నైవేద్యంపెట్టి హారతియ్యడం తొందరగా ఆనైవేద్యం తినేయడం తెలుసుకాని, వ్రతం ఎలా చేయడం పుస్తకం లేకుండా? చుట్టు పక్కల ఎక్కడా ఒక్క తెలుగు ముక్కు,మొహం లేవు.ఏమిచెయ్యాలి? కథ చదివితేనేగాని లాభం లేదు.ఇక కంప్యూట్రే దిక్కు.లాప్టొప్ ఓపెన్ చేసా.ఎక్కడైనా వ్రత కథ దొర్య్క్య్తుందేమోనని అంధ్ర భూమిలో దొరికింది. పట్టుపంచ కట్టుకొని విభూతి రేఖలు నుదుట ధరించి చేతిలో పుస్తకం పుచ్చుకొని బ్రాహ్మణోత్తముడు వచ్చినట్ళే అనిపించింది.కాని లాప్టప్ వయర్ పూజా మండపం దాకా రాలా! ఏమిచేయాలి.పిల్లలుంటే నేను ఇక్కడ నుంచి చదువితే వాళ్ళు అక్కడకూర్చుని పూజ చేసేవారు. లాప్ టొప్ లో ఒక మంత్రం చదివి మళ్ళి దేముడిదగ్గరికి వెళ్ళీ పూజ చేయాలంటే ఎంత ఒలంపిక్ క్రీడలు,పరుగులు చూసినా నకాళ్ళు ఒప్పుకోలా!మాకోడలు లాప్టొప్ వయర్లెస్ అదిచూద్దాం అని ఒపెన్ చేస్తేఅందులో సైటు వచ్చింది. ఇంకో సమస్య లాప్టొప్ కింద పెట్టినా పక్క పెట్టినా స్పష్టంగా కనిపించడం లేదు.అందుకని లాప్టొప్ ని ఎత్తుకొని చదవడం మొదలేట్టా. ఆలాప్టొప్ బాడీ అతి నునుపుగా వుంది మాటి మాటికి జారిపోతూంది.ఆబరువు వినాయకుణ్ణి ఎత్తుకొని పూజ చేస్తున్నట్లనిపించింది. పత్రికి పూలకి అన్నిటికి అక్షింతలు సమర్పించి వ్రత కథ వేసిన ఆంధ్ర భూమివారిని వారి బంధు మిత్రులని బాగా చూడమని వినాయకుని ప్రార్ధించి డిటెక్టీవ్ కథలాటి శమంతకోపాఖ్యానం చదివి
అక్షింతలు వేసుకొన్నా. వినాయకుడికి నావుండ్రాళ్ళు పూజా నచ్చాయో లేదో?
5 comments:
:)
:)) ఇడ్లీరవ్వతో ఉండ్రాళ్ళు, లాప్టాప్ ఎత్తుకుని పూజ!! వినాయకుడికి వెరైటీగా జీవితాంతం గుర్తుండిపోయేటట్లు పూజ చేసారన్నమాట..
ఇలాంటి అనుభవాలు కావలన్నా ఇక్కడ దొరకవు కదండి,
మీరు అమెరికాలో ఉండి కూడా అన్ని తిప్పలు పడి పూజ కానిచ్చారు. నయం.
వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మీ వినాయకుడికి హైటేక్ పూజ అన్నమాట..
:) ma aththa garu piki cheppa leru. Kani ee article chadivaka avida lopala emanukunaro telisipoyindi.
Nenu US vellina kothallo(ippatiki) naku puja chala doubts.. bharatha khande srissaila eesanya padese ani chuduvutunte.. are manam india lo lemu kada ala devudiki abaddam cheppochaa ani..
okasari tamalapaku badulu maple tree aakulu vaadaanu.
inka ugadi pachadilo.. vepaku badulu kakarakaya..
August lo nomulaki naa tippalu chudali.
ee sari amma vachinappudu Puja karyakramam baaga nerchukovali anipistundi kaani kalisaaka.. aa vishayame marchipotaanu
Post a Comment