Pages

Friday, October 3, 2008

దసరా

దసరా
కాంచన కంకణ కమ్రనిక్వణములు
వింటిని తల్లిరో వేడ్కమీర
పద్మనేత్రంబుల పరచినవెలుగులు
కంటిని లే తల్లి కాంక్ష మీర
అంచ గమనమ్ముల అందాల పరవళ్ళు
పరికించి నాను లే భ్రమలు తీర
పసిడి వీణల వంటి పలుకులు వింటినే
బంగారుతల్లి నాబ్రతుకు పండ
స్వప్న సౌదామిని కాంతి సంతరించి
జిలుగు వెన్నెల వెలుగులు కలయబోసి
దర్శనంబిచ్చి నావులే తల్లి నీవు
ధన్య మయ్యెను బ్రతుకు వదాన్య మూర్తి !
రావూరు

No comments: