Pages

Thursday, October 2, 2008

దసరా

దసరా
నిను ధ్యానించుట జీవితమ్ము కెలమిన్
నిండారు భోగంబగున్
నినుపూజించుట మాదు ఆత్మ కెలమిన్
నిక్కంపు తేజంబగున్
నిను సేవించుట మానసంబు కెలమిన్
నిస్తంద్ర రాగంబగున్
తనువున్ ,ఆత్మకు, మానసంబుకిదే
తాత్పర్యంబు కాత్యాయినీ !

No comments: