దసరా
చెవి పోగు రత్నాలు చెక్కిట మెరియగా
చిలిపిగా నీ భర్త చిటికవేయు
కంకణనిక్వణ రతులతో శృతి కల్పి
పాడగా నవ్వు నీ భర్త నెలమి
బంగరు టంచుల పయ్యెద వూగిన
పాలాక్షు మనసు ఉయ్యాలలూగు
చరణమంజీర రవళి సాగిన వేళ
శంఖమ్ము నెత్తును శంకరుండు
ఆది దంపతులమ్మ మిరార్ద్ర వ్రుత్తి
సరస శృంగార భావనల్ సంతరించి
మేలమాడెడు వేళల మిమ్ము దలచి
ప్రస్తుతిన్తుము దాంపత్య బలము కొరకు
రావూరు .
No comments:
Post a Comment