Pages

Thursday, October 9, 2008

దసరా

దసరా
ధర సింహాసనమై నభంబు గొడుగై
తద్దేవతల్ భ్రుత్యులై
పరమామ్నాయము లెల్ల వంది గణమై
భ్రమ్మాండ మాగారమై
సిరి భార్యామణియై ,విరించి కొడుకై
శ్రీ గంగ సత్పుత్రియై
వరుసన్ నీగణ రాజసంబు నిజమై
వర్ధిల్లు నారాయణా !
***************************
అలవోక నడకల అందాల పరవళ్ళు
చిత్రిమ్పనేర్చిన శిల్పిఎవడు
అమరభావనలోని అందాల సొగసులు
కావ్యమల్లగాబోలు కవిఎవండు
ముసిముసి నవ్వుల కొసరెడు పాటల
ఆలపించునమర గాయకుండు
అభయ హస్తము లోని ఆనంద ముద్రల
ప్రస్తుతిమ్పగా జాలు భక్తుడెవడు
నామరూపమ్ము కనుగొని నిండుమనసు
పండి వోరుగగాసుశ్లోక ఫణితి గూర్చి
స్తోత్ర మొనరింప జా లు యశోధనుండు
భువిని చరితార్దు డౌనమ్మదివిజమాత






No comments: