నిర్వచనాలు
సభాసదులు :ఏమిటో చూద్దామనే జిజ్ఞాసకు ఫలితం
అనుభావిస్తున్నవాళ్ళు.
ఔషధం :విడిభాగాలు దొరక్కపోవడంచేత ఉన్నదానినే
మరమ్మతు చేసుకొనేందుకు సాధనం .
ఇరుగుపొరుగు:నిన్నుగురించి నీకన్నా బాగా తెలిసినవాళ్ళు.
బంధువులు:నిన్ను ఎప్పుడూ సుఖంగా వుండ నీయని జనం.
పుకారు:ధ్వని వేగంతో ప్రయాణం చేసే సమాచారం.
అల్లుడు:పెళ్లి అయ్యేవరకు తనకాన్ని లోపాలున్నాయనితెలియలేని వాజమ్మ.
యౌవనం :చప్పరించడానికి ప్రయత్నం చేయకుండా గుటుక్కున మింగేసేమదుర పదార్ధం.
జీవితం :ప్రైవేటువిద్యార్ధిగా పాల్గొనడానికి వీలులేని పాఠ శాల.
రిహార్సల్ :దర్శకుడే ప్రముఖ పాత్ర వహించే ప్రదర్శనం.
కన్సెషన్ :నువ్వుచేయ్యకూడని,చేసినా చెప్పుకోలేనిపనులగురించిన
చిన్న కల్పనా కథ.
1 comment:
హ హ హ భలే నిర్వచనాలండీ బాగా చెప్పారు.
Post a Comment