Pages

Friday, October 17, 2008

జ్ఞాపకాలు

అది బండి....అది బండి.... ప్లూరల్ ..... ప్లూరల్

స్వర్గీయ మాధవ పెద్ది సుందర రామ శాస్త్రిగారుకొంత కాలం ఆంగ్లవనితకు తెలుగు భాష బొధించారట.ఈయనగారికి ఎక్కువగా ఇంగ్లీషులో చెప్పడం చేతకాదు.పొడిముక్కలతో చెప్పాలి.అసలు ఆ ఆంగ్ల వనితకు శాస్త్రిగారిని చూడగానే ఎన్నో ప్రశ్నలు బయలుదేరేవట.ఈయన గారు మర్యాద కోసమొక పాత కోటు ధరించి వెడుతూ వుండేవారట.ముంజేతి దగ్గర అంచు చిరిగి దారాలు వ్రేలాడుతూవుండే వుండేవట.ఆమెపాఠం వింటూ మధ్యలో "వెయిట్,వెయిట్ "అంటూలోపలికి వెళ్ళి కత్తెర తెచ్చి వాటిని కత్తిరిస్తూ వుండేదట.ఈసపర్యలేమిటి?-రెండుముక్కలు చెప్పి అవతలకు పోదామంటే పోనిచ్చేటట్టూ లేదూని శాస్త్రిగారు లోలోపల విసుక్కొనేవారట.బయటికి మాత్రం"థాంక్స్,థంక్స్"అంటూ వుండేవారట. ఆమె అంతా కత్తిరించి "గుడ్,గుడ్," అనేదట.

అప్పుదు మళ్ళీ పాఠం ప్రారంభం. ఒకటి రెండు వాక్యాలు చెప్పగానే ఆవిద మనస్సు మారేది. శాస్త్రిగారికి పత్నీ వియోగం ఏర్పడిందనేమాట జ్ఞాపకం వచ్చి ఆవిద విచార ముద్రలో పడేది. "సార్! మీ దేశంలో మీకుమీ ఈడు వాళ్ళూ దొరకరా?"అని వచ్చీరాని తెలుగులోకాసిని ఇంగ్లీషు ముక్కలు గుచ్చి అదిగిందట. శాస్త్రిగారా ప్రశ్నకు ఆశ్చర్య పోయి"దేనికి"అని ప్రశ్నించారట."పెళ్ళికి,పెళ్ళీకి"అందిట్ ఆవిడ ఎంతోసంబరం ప్రకటిస్తూ. నా పెళ్ళి మాట చెప్పి ఈవిడ ఇంత సంబర పడుతోందేమిటి?అనికొని "దొరకరమ్మా! దొరకరు."అన్నారట."మాదేశంలో ఏఈడుకి ఆఈడు! బోలెడుమంది..వెతకక్కర లేదు.వాళ్ళే వెతుక్కొంటూ వస్తారు"అని ముప్పాతిక ఇంగ్లీషు లోనె చెప్పిందిట.శాస్త్రిగారికి సంభాషణలో గల సందర్భం తెలిసింది కనక ఆవిడ పడే ఆవేదన అర్ధమైందిట.గనక ఇంగ్లీషు కొంత అర్ధమై "మీరు అదృష్ట వంతులు,ఈవిషయంలో మీదేశం చాలాగొప్పది."అన్నారట. ఆమె "మీకు జూలియట్ తెలుసా?"అందిట.జూలియట్ తెలియదమ్మా ఏదో పెసరట్టు,మినపట్టు-ఇవేతెలుసు చిన్నప్పటినుంచీ"అన్నారట.ఆవిడపకపక నవ్విందట.అసలా మాట అర్ధమై కాదు.శాస్త్రిగారికిజూలియట్ సంగతి కూడా తెలియదా? అని.

ఇంతలో ఆ దొరసాని బంగళాముందునుంచిరోడ్డుమీదుగానాలుగు బళ్ళూ పోతున్నాయిట. ఆ బ్రిటీష్ తలోదరి వాటిని చూసి"అదిబండి..అదిబండి"అంటూందిట.శాస్త్రిగారు"నిజమే! కానీ బహువచనం చెప్పాలి.అన్నీ కలిపి చెప్పండి.అన్నారట. ఆమెగారు మళ్ళీ అదిబండి..అదిబండీ...కలుపుతా..కలుపుతా"అన్నదట.కలపమ్మా!త్వరగా కలుపు"అన్నారట గురువుగారు. ''ప్లూరల్..ప్లూరల్"అని ఆమెమళ్ళీ" అది బండి" అంటోందట.ఈలోగా బళ్ళు వెళ్ళీపోయాయి.ఇంకా వేలుపెట్టి చూపుతూ "అది బండీ"అంటూనే వుందట ఆబహువచనాన్వేషిణీ. శాస్త్రిగారికి ప్రాణం విసిగి"సరే!ఈపూటకు వెళ్ళి వస్తా" అన్నారట. ఆమె"ప్లూరల్..ప్లూరల్....కొంచెం సేపు"అందట. ఫరవాలేదమ్మా రేపుకలప వచ్చు."గుడ్ బైఅని లేచి వచ్చేసారట.

రావూరు

2 comments:

కొత్త పాళీ said...

హ హ హ. ప్లూరల్ రేపు కలుపుదాం

kiraN said...

మర్నాటికైనా కలిపిందో లేదో..


- కిరణ్
ఐతే OK