అమెరికా ఎప్పుడు వెళ్ళాలి?
కాబిన్ బాగేజి, హాండ్ బాగ్
రెండు చేతుల్తోపట్టుకొని
ఎస్కలేటర్ మీద సునాయాసంగా
ఎక్కగలిగేటప్పుడూ...........
స్వెటర్,కోటు,గ్లౌస్ ధరించి
సాక్స్,బూట్స్,క్షణంలో వేసుకొని
వేగంగా రెండు నిముషాలలో
బయలు దేర గలిగేటప్పుడు ......
పొద్దున నుంచి నిశి రాత్రిదాకా
ముద్దులు,కౌగిలింతలు,హత్యలు
కాల్చ డాలు ,నడి సముద్రాలలో
కుస్తీ పట్లు ఆంగ్ల టీ.వీలోచూడ
గలిగేటప్పుడు.............
పిజ్జని ప్రియురాలిగా,బేగల్ ని భాయీగా
పాస్తాని పిన్నమ్మగా,నూడిల్స్ని మేనల్లుడిల్ గా
టిమ్హార్టన్ కాఫీనిప్రాణప్రదంగా
ప్రేమించ గలిగేటప్పుడు............
ఇరుకో విశాలమో నువ్వుండవలసిన
ఇల్లులాటి జైలులోమాక్సిమం ఘంటలు
ఒంటరిగా,యాక్టివ్గాద్దాలకిటికీలోంచి
చూడగలిగేటప్పుడు.................
ఆనమ్మకం వుంటేనే వెళ్ళు
ముసలివాళ్ళకి మాత్రం
టీ. జ్ఞానప్రసూన
2 comments:
:))
అమెరికాలో మంచి విషయాలు కూడా బోలెడున్నాయండీ.
Post a Comment