Pages

Thursday, October 16, 2008

బ్లాగు ప్రయాణంలో నేను - జ్ఞానప్రసూన





బ్లాగ్ అంటే ఆలోచనా తరంగం.ఇది ఇంత పరిధిలోనే వుండాలి, ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు.ఒక్కొక్క తరంగానికి ఆలోచనా రూపం ఇవ్వడమే! ఒక వర్ణన, ఒకడైరీ,  ఒక ఆశ్చర్యం,  ఒక ఆనందం,  ఒకపొగడ్త, ఒక వేదన.ఏదైనా కావచ్చు.దీనిలోఅంతస్సూత్రంగా ఒక గొంతు వుంటుంది.అది స్వానుభవాలని, అభిప్రాయాలని, ఆశని వెలువరిస్తుంది.     
 


 ఈ ఆలోచనా తరంగాలని కాగితం మీద పెట్టి,అప్పుడప్పుడూ పైకి తీసి,పట్టుచీరలా చూసి మురుసుకోవచ్చు.ఏది చేసినా మెప్పు  కోరుకొంటుంది ప్రాణి. కంది పచ్చడి చేసినా కళాఖండం సృష్టించినా- ఎదుటి వారు మెచ్చుకొంటేనే  తృప్తి.  ఆలోచనా
తరంగాల్ని అక్షరరూపంలో పెట్టి అచ్చొత్తించుకోవాలంటే అయే పనికాదు. ఈ పరిస్థితిలో కంప్యూటర్ అవతరించింది. ఆలోచనా తరంగాలకి  ఒక స్థానం కేటాయించి ఉచితంగా ఇచ్చి దానికి "బ్లగ్ "అని పేరు పెట్టారు. ఇందులో అందరూ వ్రాసుకోవచ్చు, చాటుగాను, స్వేచ్చగానూ. 


 కంపూటర్ నేర్చుకోవాలనే ఆష నాలో అంకురించి రెండు ఏళ్ళయింది. ఆ ఆశకి మూడు నెలలు రాగానే మా పెద్దబ్బాయి లాప్‌టాప్ కొని ఇచ్చాడు. అప్పటికి ఈ.మెయిల్ పంపడం ఒక్కటే తెలుసునాకు. Teluguone.com  చూసేదాన్ని. ఒకానొక శుభ ఘడియలో మాచిన్నవాడు, వాడి ఫ్రెండు "నువ్వు ఒక బ్లాగ్ ఎందుకు పెట్టు కోకూడదు" అని వెంటనే తయారు చేసి  "everyDay suruchi"  అని నామ కరణం చేసాము. "అన్నప్రాశన నాడే  ఆవకాయ" అన్నట్లయింది నాపని. తెలుగు టైపు చేయడం రాదు, ఏమేమివున్నాయో తెలియదు.అందుకని తెలుగు మాటల్ని ఆంగ్ల లిపిలో టైప్ చేస్తే మావాళ్ళు సురుచి లో పేస్ట్ చేసేవారు. చాలా తప్పులతో పొస్ట్ వెళ్ళేది. ఏ పని చేయడానికి అయినా పధ్ధతి సిధ్ధాంతము వుంటాయి. గురువు, శిష్యుడు అనె సంబంధం వుంటేగానీ బొధించడానికి ఓపికా , ఉత్సాహమూ రావు. నాకు అందరూ గురువులే!" బాబూ, బాబూ"అని బతిమాలి సమస్య వచ్చినపుడు శాస్త్రం తెలుసు కోవడం. 

 ఒక టపా పబ్లిష్ చేయగానే"చాల్లేవమ్మా! నీ రాతలు ఇక ఆపు అంటారేమో పాఠకులు అని గుండె పీచు పీచు మంటూ వుండేది. కొందరికి అక్షరాలు కనపడాగానే ఏమి వ్రాసారో చదువుదామనే కుతూహలం ఎక్కువ వుంటుంది.చదివిన దానిలో ఒక ముక్క బాగుంటే తెలియ చెపుతారు. నా అదృష్టం  నన్ను అందరూ వెన్నుతట్టారు.ఇలా చేయండి,అలా చేయండి అని
 చెప్పారు.  
                              
బ్లాగులో చక్కటి రంగులు, పూలు, దృశ్యాలు పెట్టి మొదటి పేజీని ముద్దుగా తయారు చేస్తారు. బ్లాగులోని విషయాలను, వేరే వేరే భాగాలలో పెట్టడం, ఫొటోలు పెట్టడం, పాటలు పెట్టడం ఈ సాంకేతిక విషయాలన్ని తెలియాలి. బ్లాగ్ నిర్వహించడం అనేది నాబోటి వారికి కష్ట భూయిష్ట మైన పని. అయినా బ్లాగ్ వలన ఒక స్ఫూర్తి, తృప్తి కలుగుతాయని నా
భావన. బ్లాగ్ వలన ఉత్సాహము నిత్యశుధ్ధి కలుగుతాయి.  బ్లాగ్‌లో వ్రాసిన విషయమంతా ఒకోసారి ఒక తప్పుకు పిచికలా ఎటుపోయాయో  తెలియకుండా ఎగిరిపోతాయి. రెండులైన్ల మధ్య బోలెడంత ఎడం, కాస్త కాస్త టైప్ చేసి పేస్ట్ చేస్తే చివరి భాగం మొదటికి, మొదటి భాగం చివరికి పబ్లిష్ అవుతుంది టైప్ చేసి పొష్ట్ చేసినప్పుడు లైన్ల చివరి పదాలు పొష్ట్ లో రాకపోవడం,షీర్షిక పెట్టకుండా పోష్ట్ చెయ్యడం, తైప్ చేసి పోష్ట్ చేస్తున్నపుడు అది ఎక్కడ మాయమవుందో అన్నభయంతో కంట్రోలు+వి ని బలవంతంగానొక్కి పెట్టడం - పబ్లిష్ చేసినది ఒక ఇరవై కాపీలు పడిపోవడం, వాటిని ఎరేజ్   చేసుకోవడం ఇలా ఎన్ని జరిగినా పట్టు వదలని విక్రమార్కుడులా ముందుకు పోవడమే!    


బ్లాగ్ పెడితే మన అభిప్రాయాలు, సొంత విషయాలు ఎక్కడ వ్రాస్తామో అని భయం కొందరికి. మనసు నిలిపే శక్తి,మనసు తెలిపే శక్తి మనిషికి లేకపోతే ప్రగతి ఏది? భాషా, భావము, పొందికగా స్వచ్చముగా వుండడం అవసరం. పాత రచనలు భద్ర పరచండి, కొత్త రచనలు విరజిమ్మండి. ఆడ కలం,మగ కలం అనడమే  మానెయ్యండి.   
 

18 comments:

ప్రపుల్ల చంద్ర said...

మీ కబుర్లు చాలా బాగుంటాయి. మీరు మొదట్లో పట్టు వదలని విక్రమార్కుడిలా కష్టపడ్డా, ఇప్పుడు విజయవంతంగా ఈ బ్లాగ్ నడుపుతుంనందుకు నా అభినందనలు.

"కంది పచ్చడి చేసినా కళాఖండం సృష్టించినా- ఎదుటి వారు మెచ్చుకొంటేనే తృప్తి"

"మనసు నిలిపే శక్తి,మనసు తెలిపే శక్తి మనిషికి లేకపోతే ప్రగతి ఏది"

ఇలాంటి ఎన్నో మంచి మాటలు ఇంకా చెబుతారని ఆశిస్తూ....

Ramani Rao said...

చాలా మంచి సందేశం ఇచ్చారు ప్రసూన గారు. బాగుంది మీ ప్రయాణం బ్లాగు లోకంలో.

Kathi Mahesh Kumar said...

బ్లాగు యొక్క సాహితీస్వరూపాన్ని చాలా చక్కగా మొదటిపేరాలోనే ఆవిశ్కరించారు. బ్లాగులు మన ఆలోచనా స్రవంతికి అక్షరరూపం ఇచ్చుకునే అద్వితీయ రూపాలు.

మీరు బ్లాగుల్లోకివచ్చిపడిన చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. మరిన్ని టపాలు మీనుండీ ఆశిస్తాను. అభినందనలు.

పెదరాయ్డు said...

బ్లాగులు రాయడం అంత సులభమేం కాదు. ఒక పరిధి వుండదు. మన ఆలోచనా స్రవంతిని పంచుకోవడమే...బాగా వివరించారు.

కొత్త పాళీ said...

"ఈ ఆలోచనా తరంగాలని కాగితం మీద పెట్టి,అప్పుడప్పుడూ పైకి తీసి,పట్టుచీరలా చూసి మురుసుకోవచ్చు."
భలే చెప్పారు.

మేధ said...

>>బ్లాగ్ వలన ఉత్సాహము నిత్యశుధ్ధి కలుగుతాయి
well said...

ఈ ప్రయాణం ఎప్పుడూ నిత్య నూతనంగా, నిత్యోత్సాహంతో ఉండాలని....

జ్యోతి said...

అమ్మా,

మీరు మాకంటే ఉత్సాహంగా బ్లాగుతుంటే ముచ్చటేస్తుంది. మీ వయసు వచ్చేవరకు మేమెలా ఉంటామో. మీ సాంకేతిక సమస్యలన్నీ నేను తీరుస్తానుగా.. మీనుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. బ్లాగుతూనే ఉండండి మరి.

Sujata M said...

Very decent ending.. Ada blogloo maga blogloo.. anna alochana maaneyyali. Lovely.

teresa said...

మీరు సాకే మొక్కల్లాగే మీ బ్లాగు కూడా మహా వృక్షంగా ఎదగాలని కోరుకుంటూ..

సిరిసిరిమువ్వ said...

"బ్లాగ్ అంటే ఆలోచనా తరంగం.ఇది ఇంత పరిధిలోనే వుండాలి, ఈవిషయం పైనే వ్రాయాలి అనే నియమం లేదు.ఒక్కొక్క తరంగానికి ఆలోచనా రూపం ఇవ్వడమే"-బాగా చెప్పారు.

మీరు త్వరలో మన బ్లాగర్లందరికి మీ వీణ కచేరి వినిపిస్తారని కోరుకుంటూ...

Purnima said...

"ఈ ఆలోచనా తరంగాలని కాగితం మీద పెట్టి,అప్పుడప్పుడూ పైకి తీసి,పట్టుచీరలా చూసి మురుసుకోవచ్చు."

ఇది నాకు తెగ నచ్చేసింది! ఒక చిన్ని మాట అప్పుడప్పుడూ సర్వెర్లు మొరాయించచ్చు, అందుకని పట్టు చీరలని కాస్త జాగ్రత్తగానే చూసుకోవాలి :-)

చాలా విషయాలు చక్కగా చెప్పారు! నెనర్లు!

పూర్ణిమ

krishna rao jallipalli said...

నమస్కారం.. బ్లాగుకి అసలైన సిసలయ్న నిర్వచనం ఇచ్చారు. కొంత మంది బ్లాగర్లు అయినా మిమ్ములను ఆదర్శంగా తీసుకొంటారని ఆశిస్తూ...

Anonymous said...

ఏది చేసినా మెప్పు కోరుకొంటుంది ప్రాణి. కంది పచ్చడి చేసినా కళాఖండం సృష్టించినా- ఎదుటి వారు మెచ్చుకొంటేనే తృప్తి. ఇది ముమ్మాటికీ నిజం ..నేర్చుకోవాలనే తపనే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. బావుందండీ

నిషిగంధ said...

మీ ప్రయాణ విశేషాలు చాలా చాలా బావున్నాయండీ! మహేష్ గారన్నట్లు అసలు బ్లాగంటే ఏమిటో మొదట్లోనే వివరించారు!! మీచేతి బూరెలు తినే అదృష్టం నాకుందో లేదో కానీ బూరెల్లాంటి టపాలు మాత్రం బోల్డన్ని రాయాలని కోరుకుంటున్నాను!

రానారె said...

"బ్లాగ్ వలన ఉత్సాహము నిత్యశుధ్ధి కలుగుతాయి." ముత్యం లాంటి మాట సెలవిచ్చారు. పాత టపాలను పట్టుచీరల్లా చూసి మురియడం - ఆహా! ఈ దృశ్యాన్ని చూశాన్నేను.

రాధిక said...

మీ ప్రయాణం చాలా గొప్పగా అనిపించింది.ఈ వయసులో ఏవన్నా కొత్తగా నేర్చుకోవాలనే ఆశక్తి,పట్టుదల నిజంగా అభినందనీయం. రోజు వారీ జీవితపు పనులు,మాటలను టపాల్లో పెట్టడం మిమ్మల్ని బ్లాగర్లలో ప్రత్యేకం గా చూపిస్తుంది.మీరిలాగే బోలెడు కొత్త విషయాలు తెలుసుకుని మాలాంటి వారికి మీ అనుభవాల సారాన్ని వివరించాలకి కోరుకుంటున్నాను.

రామచంద్రరావు said...

బ్లాగ్ వలన ఉత్సాహము నిత్యశుధ్ధి కలుగుతాయి.చాలా మంచి సందేశం ఇచ్చారు.బాగుంది మీ ప్రయాణం బ్లాగు లోకంలో.కొత్తగా బ్లాగ్ ప్ర్రారంబించిన నా బ్లాగ్ ఒకసారి దర్శించి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరు.
www.ragamrrao.blogspot.com

psmlakshmi said...

ఇది చదివాక బ్లాగు అంటే ఏమిటో తెలిసింది. ఇది రావటంలేదు కొంచెం చూడరా అని మా అబ్బాయిని బతిమాలటం దగ్గరనుంచి గూగుల్ లో డైరెక్టుగా పోస్ట్ చేసేటప్పడు నేను పడ్డ పాట్ల దాకా కళ్ళముందు కదిలాయి. psmlakshmi
psmlakshmi.blogspot.com