Pages

Thursday, October 30, 2008

సూక్తి

రాజ లక్షణాలు
ఒకటిగొని రెంటినిశ్చల యుక్తి జేర్చి
మూటి నాల్గింటి గడు వశ్యములుగ జేసి
యేనిటిని గెల్చియారింటి నెరిగి యేడు
విడిచి వర్తించువాడు వివేకధనుడు

ఒకటి= ఆలోచనకు కేంద్రం బుధ్ధి
రెండు=కర్తవ్యం
మూడు=మనుష్యులలో మూడురకాలు,మిత్రులు,శత్రువులు,
తటస్తులు ఈ మూడురకాల వారిని వశం చేసుకొని
నాలుగు=సామ,దాన,బేధ,దండ అనే చతురోపాయములను
ఉపయొగించి
అయిదు=పంచేంద్రియాలను నిగ్రహించి
ఆరు=సంధి,విగ్రహం,యానం,ఆసనం,ద్వైదీభావం
సమాశ్రయం అనేఆరింటిని తెలుసుకొని
ఏడు=వెలది,జూదం,పాశం,వేట,పలుకు ప్రల్లదనము,
దండించుటలో కాఠిన్యము,సొమ్ము నిష్ప్రయోజనముగా
ఖర్చు పెట్టకుండుట అనే సప్త వ్యసనాలకు దూరంగా
రాజు వుండాలని తిక్కన మహాభారతంలో నుడివాడు.

No comments: