Pages

Sunday, November 9, 2008

నవ్వులభోషానం

నవ్వులభోషాణం స్కెనాజర్ [1]
ఒకసారి నేను రైల్ లొ ప్రయాణం చేస్తున్నాను.సెకండ్ క్లాస్ కంపార్టెమెంట్ అది.వెల్లేటప్పటీకే ఒక ఒక పెద్దమనిషి ఆపెట్టెలో కూర్చుని వున్నాడు.ఎక్కడో ఆయనను చూచినట్లుంది.కానీ ఎవరైందీ జ్ఞాపకం రాలేదు.సరేనని లోపలికి వెళ్ళి కూర్చున్నాను.బయట ఫ్లాట్ ఫారం మీద నిలబడివున్న ఓకురాడితో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు.ఎందుకో ఘట్టిగా కోప్పడుతున్నాడు కూడానూ.ఆయన అన్న మాటలు ఇవి"అల్లాగా తెల్లబోయి చూస్తావేంరా?స్కెనాజర్ ఒకటి తెచ్చి పెట్టమంటే స్కెనాజర్ రా!స్కెనాజర్ అంటే తెలియదుట్రా సన్యాసీ!ఒరేఇంతమాత్రం తెలియని వాడివిఎలా బతుకుతావురా?ఓరి సన్యాసీఇప్పటికైనా వెళ్ళి స్కెనాజర్ కొనుక్కురారా?
ఇవీ ఆయన అంటున్న మాటలు.ఆమాటలువిని నేనూ ఆశ్చర్యపోయాను.ఆపెద్దమనిషి నావంక తిరిగి "బాబూ!చూసారా!ఈకాలపు పిల్లల తెలివితేటలు!ఒక స్కెనాజర్ తెమ్మన్నానండీ మామూలు స్కెనాజర్ సుమండీ !అయినా వాడికి అదేమిటో తెలియలేదు.ఇంకావీడెందుకైనా పనికి వస్తాడంటారా?అన్నాడు.నేనేమని చెప్పేది?ఆ స్కెనాజర్ అంటే ఏమిటో నాకూ తెలియదు.నిజానికి అదేమిటో మీరలినా చెప్పండి మా వాడితో అని ఆయన అంటే నాపని ఏంకావాలె!
నిజానికి ఈకాలపు లుర్రవాళ్ళువాే వస్తువులుకొన్ని నాకూ తెలియవు.ఈయన ఇల్లు బంగారం గానూఅదేమిటో చెప్పమని నన్ను అడుగుతాడేమోననినేను భయపడుతూనే వున్నాను.ఆయన అడగనే అడిగాడు.అయితే స్కెనాజర్ అంటే ఏమిటో చెప్పమని అడగలేదుకానీ"చూడండీంతమాత్రం తెలియక పోతే ఎల్లాగండీ!అని అన్నాడు.
చచ్చానురా బాబూ!అనుకొన్నాను.మౌనం వహిస్తే వదిలిపెట్టేరకంలాగాలేదు.ఆయన నావంకేచూస్తూఊరుకొన్నాడుజవాబు చెప్పమని అడుగుతున్నాట్లు.ఇకమర్యాదా దక్కేలాగున లేదు.నేనూన్నాను"నిజమేనండీ!ఇటువంటి వాళ్ళతో కాపురం కష్టమేనని.ఆయన నావంక చిరాకుగాచూస్తూ "పైగా వీడు స్కూల్ ఫైనల్ పాసయినాడుకూడానూని అన్నాడు వాడి అజ్ఞానానికి నేనేదోభాధ్యుణ్ణయినట్లు.అంతటితో వూరుకోక "వెధవ చదువులు,వెధవ చదువులు"అని అన్నాడు నావంక కొరకొరా చూస్తూ.

1 comment:

teresa said...

ఇంతకీ ఆ స్కెనాజర్ ఏవిటీ?