Pages

Sunday, November 9, 2008

నవ్వుల భోషాణం

నవ్వుల భోషాణం స్కెనాజర్ [4]
దాని ఖరీదు రూపాయ కంటె ఎక్కువ వుంటుందండీ!అనికదూ అడిగింది.అయితే దానికి జవాబుగాఏదో తెలిసిన వాడిలాగా "ఎబ్బే!రూపాయికంటే ఎక్కువ వుండదండీ!ఇంకా కాస్తో కూస్తో తక్కువే అయివుంటుంది."అని మళ్ళీ ఎందుకైనా మంచిదని "కాకపోతే ఈమధ్య అన్ని వస్తువుల లాగే దీనిఖరీదుకూడా పెరిగిందేమో!అన్నాను.దాని తరువాత ఆయన స్కెనాజరు గురించి రకరకాల వాక్యాలు పలికారు.యుధ్ధానంతరం మంచి స్కెనాజర్లు రావదం లేదంటే"నిజం,నిజంఅని "ఏవస్తు వైనా నాణ్Yఅ మైనది రావడం లేదని"ఓచిన్న ఉపన్యాసం ఇచ్చాను."పూర్వము ఒక్కొక్క స్కెనాజరునెలా రెండు నెలలు పనికి వచ్చేవి అంటే"నెలేం ఖర్మండీ!ఒక్కొక్క దానిని ఆరు నెలలు వాడే వారు అన్నాను.
ఇట్లాగ నాచెత పది నిముషాలు రకరకాలుగా అనిపించి విరగబడి నవ్వదం సాగించారు ఆయన.కాసేపు ఆగి "మాష్టారూ!స్కెనాజర్ మీరెప్పుడైనా చూశారాండీ!అన్నాడు నవ్వు ఆపుకొంటోఓ.నేను తెల్లముఖం వేశాను."నేను మీ విద్యార్ధినండీ!మాష్టారూ!మీతో హాస్యమాడుదా మనుకొన్నాను,మీరు నన్ను గుర్తించక పోవడం వల్ల మరీ సులువుగా ఈ నాటకం ఆడగలిగాను"ఇల్ల అని తాను ఎవరో,ఎప్పుడు,ఎక్కద నాదగ్గర చదువుకొన్నాడోఆ విషయమంతా నాకు జ్ఞాపకం చేశాడూ.
నేను నవ్వుకొని"అయితే ఇంతకూ ఆ స్కెనాజర్ అంటే ఏమిటో చెప్పావుకాదు"అన్నాను."ఏమో నాకూ తెలియదండీ!ఏమన్నాతెలిస్తే మీకే తెలియాలి.ఆమాట తెలియని వాడు ఎందుకూ పనికి రాకుండా పోతాడన్నారుగా?అన్నాడు."ఆమాట నిజమెనయ్యా!నేను ఎందుకూ పనికి రాని వాణ్ణే!అన్నను నవ్వుతూ."అంత మాట అనకండి మాష్టారూ!క్షమించండి.మీరు హాస్య ప్రియులు,ఏమీ అనుకోరు అనే ధైర్యము తోనే మిమ్ములను నవ్వులాట పట్టించాను."అన్నాడు."ఏమీ అనుకోక పోవడమే కాదు,ఇంత తమాషా చేయగలిగిన నీవు నావిద్యార్ధివి అయినందుకు నేను గర్వ పడుతున్నాను.,అన్నాను నేను నిజంగా సంతోషాన్ని పొండుతూ.
రచన కీర్తి శేషులు మునిమాణిక్యం నరసింహారావుగారు
సేకరణ= టి. జ్ఞాన ప్రసూన

2 comments:

Unknown said...

ఈ స్కెనాజరు అంటే ఏంటో తెలీకపోతే ఈ రాత్రి నిద్ర పట్టి చావదే.ఎలా చచ్చేది?

Anonymous said...

స్కెనాజరు అంటే అంతరిక్ష యాత్రికులు మంచినీళ్ళు తాగడానికి వాడే రాగి చెంబు.