Pages

Sunday, November 9, 2008

నవ్వుల భోషాణం

నవ్వుల భోషాణం స్కెనాజర్ [3]
ఆయన నా రెక్కపుచ్చుకొని మర్యాదగానే"దిగకండి మాష్టారూ!రైలు కదులుతున్నది"అంటూ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు."మాష్టారూ!అని సంబోధించడం వల్లాయన నావిద్యార్ధి ఏమో నన్న అనుమానం కలిగింది నాకు.ఈరోజుల్లో ప్ర్తివాణ్ణీ మాష్టారు అంటున్నారుకదా అని సరిపెట్టుకొని వూరుకొన్నాను. చూస్తేఆయనైంకేదో ప్రశ్నలు వేశే లాగున్నాడు అందుకని ఏదో తీవ్ర మైన విషయం ఆలోచిస్తున్నాట్లు ముఖం పెట్టాను.ఏదో ఆలోచిస్తోఓ వుంటే అతని మాటలు నాకు వినిపించవుగదా!అని నాఎత్తు.
ఆయన ఇంకా ఏదో స్కెనాజర్ ప్రసంగం చేస్తూనేవున్నాడు.ఆయన ఈప్రసంగం చేస్తున్నంత సేపూ నాకు ముళ్ళమీద కూర్చున్నట్లుంది.చివరకు ఆయన"ఏమండీ !మాష్టారూ!స్కెనాజర్ ఖరీదు రూపాయ కంటే ఎక్కువఖరీదు వుంటుందంటారా!అని సూటిగా అడిగాడు.నాకు దాని ఖరీదు తెలియదాయే!అయితె నాకు తెలియదు అని నానోటితో నేను ఎట్లా అనేది?క్షణం ముందు స్కెనాజర్ అంటే ఏమిటో తెలియని వాడుఎందుకూ పనికి రాకుండా పోతాడనీ,శుధ్ధ తెలివి తక్కువ దద్దమ్మ అనీఒప్పుకొని,ఇప్పుడు దాని ఖరీదుఎంతో తెలియదని ఎట్లా చెప్పేది?చచ్చినట్లు దాని ఖరీదు ఇంత అని చెప్పి తీరవలె కదా?

No comments: