Pages

Thursday, December 4, 2008

పెద్దచందమామ

[2] పెద్దచందమామ
పసితనంలో మనదగ్గిర పెరిగితె తెలియకుండానే ఆ పసివాళ్ళకి మనకి ఒక తియ్యటి బంధం స్థిరమయిపోతుంది.వాళ్ళు వ్యక్తం చేయలేకపొయినా ఏదొ భావం వాళ్ళ మనసులో ముద్ర వేసుకొంటుంది.అది జీవితాంతము నిలచి వుంటుంది.మా పెద్ద చందమామకి[మా పెద్దమనుమడికి] రెండున్నర రెండున్నర ఏళ్ళు వచ్చేదాకా మా పెద్దబ్బాయి ఇండియాలోనే వున్నాడు.పెద్దచందమామ జిలిబిలి పలుకులు,తప్పటడుగులు,పిలుపులు,భావ వ్యక్తీకరణ కోసం వాడు పడే కృత్యాద్యవస్థ చూడ ముచ్చటగా వుండేవి.ఉ.స్ వెళ్ళాక పిల్లలు రావడమేఅరుదు,వచ్చినా ఏ రెండువారాలో వుండటం,వచ్చి ఆవాతావరణం నుంచి,ఈవాతావరణం అలవాటు అయేసరికి మళ్ళీ ప్రయాణాలు.స్కూళ్ళలో చేరాక శేలవులు లేకపోవడం,వున్నా సెలవుల్లో ఏదో కోర్సులు చేయడం దానా దీనా రాకపోకలు దూరం జరుగుతాయి.పెళ్ళిళ్ళకి వస్తే మొఖాలు చూసుకొనేతీరికే వుండదు.ఇటూ అటూ అనురాగ లతలు వడిలి పోతూ వుంటాయి.
మొన్న అనుకోకుండా పెద్దచందమామ ఏదో ప్రాజెక్ట్ కోసం నెలరోజులు ఇండియా వచ్చాడు.చిన్నప్పుడు పతాకము, అర్ధ పతాకము అంటూ ముద్రలు చెపుతూ,చిన్ని కిట్టమ్మా!అమ్మ కొత్తిందా? అంటూ హాలులో చుట్టూతిరుగుతూ పాడుతూ వుండేవాడూ.పెద్ద చందమామ పెద్దవాడయి ఎదురుగా కూర్చుని ఎన్నో విషయాలు,వివరంగా విడమర్చి చెపుతూంటేఎంత ముద్దుగావుందో!బామ్మా!అని తెలుగులో నోరారా పిలుస్తూంటే శరీరం పులకరించి పోయింది.పసితనం లో చుట్టూ తెలుగు మాట్లాడే వారి మధ్య గడిపిన కారణంగా పెద్దచందమామకి తెలుగు బుర్రలో పాతుకుపోయింది.అందుకే ఇన్నాళ్ళయినా తప్పో వప్పో తెలుగు మాట్లాడగలుగుతున్నాడు,అర్ధం చేసుకో గలుగు తున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే "బామా!నేవెళ్ళాక ఏమిచేసావు?అని అడిగేవాడూ.ఏసభకో, చుట్టాలింటీకో, స్నెహితులింటికో,సభకో వెళ్ళానంటే ఆకబుర్లన్నీ చెప్పమనేవాడు.తను వెళ్ళక ఏమేమి పనులు చేసాడో,ఎవరితో పరిచయం అయిందో అన్ని పూసగుచ్చినట్లు చెప్పేవాడుపెద్దచందమామ.ఇంటికి వచ్చేముందుఫొనె చేసి"బామ్మా!నిన్న్లా గుత్తి వంకాయ చేస్తావా?20నిముషాల్లో నేవచ్చేస్తున్నా.అనేవాడు.పెద్ద చందమామకి ఓపట్టాన నచ్చవు. ఏదైనా బాగుందంటే నేను తినకుండా చందమామ కోసం ఫ్రిజ్లో దాచేదాన్ని.ఊ.స్ లొ వుండే వాళ్ళకి ఫ్రిజ్ లో పెట్టినవి పెడితే తింటారు,ఇక్కడున్నవాళ్ళు "ఆ వాళ్ళీంటికి వెడితే ఫ్రిజ్ లోవి తీసి పెట్టింది,అంటారు.మన వంట ఎవరికైనా నచ్చిందంటేఆనందం.మనకిష్ట మైన వాళ్ళకి నచ్చిందంటే మరీ ఆనందం.అలాటి ఆనందం పెద్దచందమామ చాలాసార్లు నాకందించాడు.పెద్ద చందమామ వెళ్ళిపోతే ఇల్లంతా ఆకులు దూసిన మల్లెపందిరిలా అయింది.
అమెరికా కనిపెట్టనేలా?పెట్టితిరిబో మనవాళ్ళు వెడలనేలా?వెడలితిరిబోవెనుకకు రాకపోనేలా?అడుగంటెన్ బామ్మల ముద్దుముచ్చటల్![2] పెద్దచందమామ

అమెరికా కనిపెట్టనేలా?పెట్టితిరిబో మనవాళ్ళు వెడలనేలా?వెడలితిరిబోవెనుకకు రాకపోనేలా?అడుగంటెన్ బామ్మల ముద్దుముచ్చటల్!

1 comment:

Rajamouli Nidumolu said...

peddachandamaama gurinchi aalochinchaTame kaani .. aaDukovaTaaniki paniki raadu ..

aDDala naDu biDDalu kaani gaDDala naaDu kaadu annaTTugaa...