Pages

Friday, December 26, 2008

బ్లాగ్బందువులు

బ్లాగ్బంధువులు
ఇవాళ ప్రమదలందరు ఇ.తెలుగు స్టాల్ కి వస్తానన్నారని నేను 4ఘంటలకల్లా అక్కడికి చేరాను.అక్కద బ్లాగ్బంధువులని చూసి హృదయం అమందానంద కందళిత మయింది.ఎదొ గొప్ప సేవ చేస్తున్నామని అనకపోయినా మేమందరం తెలుగుని స్మరిస్తున్నాం, మనస్ఫూర్తిగా తెలుగుని ప్రచారం తెస్తున్నాము. అక్కడ అందరిని పిలిచి "రండమ్మా! తెలుగుని అంతర్ జాలం లొ ఆవిష్కరించారు, మిరూ చదవండి అని ప్రోత్సహిస్తున్నాము. బ్లాగ్లోకం లోకి ఎంతోమంది వచ్చారు.టీ.వీలాగానే ,పత్రికల లాగానె బ్లాగ్ల లో ఎన్నో విషయాలు,అనుభూతులు,విమర్శలు, నవ్వులు,పొడుపుకధలు,సామెతలు,రాజకీయాలు, వైద్యం,భక్తి,సంగితం,సినిమా.జివితచరిత్రలు,విహారస్థలాల వివరాలు,వంటలు,అందమైన ఫొటోలు ఇవి అవి అని ఏమిటి ఏదికావాలంటే అవి లభిస్తున్నాయి.వ్రాసేవారేమి లాభాలు కోరడం లేదు, ఆత్మతృప్తి తప్ప. చదివేవారికి ఎక్కువ లాభం. తమకాలాన్ని కొంచెం వినియోగిస్తేచాలు,ఎన్నో తెలుసుకోవచ్చు.
ఈవిధంగా తెలుగుని ప్రజల కళ్ళముందు పెట్టాలని బ్లాగర్ల కోరిక. ఇ .తెలుగు స్టాల్ లొ అందరికి శ్రీధర్ గారు ఇంకా కొందరు అంతర్ జాలంలో తెలుగు ఎలా వుపయోగించుకొవచ్చో వివరిస్తున్నారు.వరూధిని,శిరీష,పూర్ణిమ,సుజాతలని కలిసాను.మాటలు పంచుకొన్నాము.ముఖాముఖీ పరిచయాలయ్యాయి.కష్టపడి ఈ.తెలుగు స్టాలు పెట్టి ప్రజలలో తెలుగుపట్ల,ఒక ఉత్సుకతను, ఇష్టాన్ని రేకెత్తించాలనే మా బ్లాగర్ల కు స్ఫూర్తిని,చేయూతను ఇస్తారని ఆశిస్తున్నాను.మి సంశయాలని,తీర్చేందుకు,ఇక్కడ హేమాహేమిలు సిధ్ధంగా వున్నారు.ముందుకురండి,అవకాశం సద్వినియోగం చేసుకోండి.

5 comments:

విరజాజి said...

మీ పూర్ణం బూరెలు తిన్న ప్రతీ ఒక్కరమూ మహదానంద పడిపోయమండీ...! మనం అందరమూ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. నిన్న మీ మూలాన మా బడిని గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి మా విష్ణుకుమారి టీచరుగారిని కలిసినపుడు ఆవిడకి నా నమస్కారాలు తప్పక చెప్పండి.

సుజాత వేల్పూరి said...

బ్లాగులు రాయలనుకున్న వారికి వయసుతో నిమిత్తం లేదని చెప్పడానికి మీరొక ప్రతీక, ప్రోత్సాహం ! ఈ సమావేశాన్ని గుర్తుంచుకునేలా చేసేవి మీరు వాత్సల్యం నింపి తెచ్చిన పూర్ణాలు కూడా!

Disp Name said...

Mee Blaagu Baagundi.

http://www.varudhini.blogspot.com

సిరిసిరిమువ్వ said...

మీ పూర్ణం బూరెలు అందరికి తెగ నచ్చేసాయి. రాత్రే మీ పుస్తకం చదవటం మొదలుపెట్టాను.

Purnima said...

పుస్తకాలు కొనాలన్న హడావిడిలో మీతో మాట్లాడలేకపోయాను. పుస్తకాలు ఇచ్చినందుకు నెనర్లు!

మీ పూర్ణాలూ చాలా బాగున్నాయి. నిన్న నా ఆకలి తీర్చినవి అవే!

నమస్కారాలు,
పూర్ణిమ

వరూధుణి గారు: చదవడానికెందుకులే.. తొందర! ;-)