ఎదురుగా
స్నోలు,క్రీములు అమ్మేవాళ్ళు ప్రకటనల లొ వ్రాస్తూ వుంటారు "వీటిని వంటింట్లో గట్టుమీదో హాలులో టీ.వీ పక్కనో మీరు అటూ,ఇటూ తిరుగుతూంటే కనిపించేలా ఎదురుగుండా పెట్టుకోండి అప్పుడువీటిని సులువుగా వాడవచ్చు,ఏదో ఒకమూల పెడితే వీటిని వాడాలనే ధ్యాస వుండదు,పైగా తీవాడాలంటే బధ్ధకం గావుంటుంది".అని
ఆ విషయం మాత్రం నిజం.వస్తువు ఎదురుకుండా వుంటే వాడుకోవడానికి సులువు,గుర్తు కూడా చేస్తూ వుంటుంది.ఇప్పుడు ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్య జీవితం లొ ప్రముఖ పాత్ర ధరిస్తున్నాయి.గ్రైండర్లు,కుక్కర్లు,మిక్సీలు చిన్న కుట్టుమిషన్లు ఇవన్ని అలమారాలలో సర్దుతాము, స్థలాభావం వల్ల.వీటిని వాడాల్సిన అవుసరం వచ్చినపుడు బయటికి తీసి వాడి మళ్ళీ లోపల పెట్టాలంటే అబ్బా!ఇప్పుడేం చేస్తాంలే!అని పిస్తుంది.అలాగే దేముణ్ణి కూడా తలుపులు లేని గూళ్ళల్లొ పెడతారు.
మనకు తెలియకుండానే ఆయనకో మనస్సుమాంజలి అందుతూ వుంటుంది.సెల్ల్,కంప్యూటరు,వాచీ,పర్స్ ,పెన్ ఎదురుగా పెట్టుకొంటారు.ఎదురుగా వుండే వస్తువుకు ఒక విశిష్టత వుంది. కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతోంది.కొత్త సంవత్సరం అనగానే గుర్తుకు వచ్చేది డైరీ. డైరీ వ్రాయడం అనేది ముఖ్యముగా అంతరంగ చిత్రాలు చిత్రించుకొవడం కోసమే!ఇవి ఎవరికి వారే వ్రాసుకొని వారే చదువుకొవలసినవి. క్రమ శిక్షణా రాహిత్యం వలన వీటిని వేరే వాళ్ళు చదవడం అందులో రహస్యాలు వెల్లడిచేయడం, అగ్గిపుల్ల అవసరం లేకుండానే కొంప లంటుకోవడం జరిగి ,అమ్మో ఎందుకొచ్చిన గోల అని మానేస్తారు.డైరీలలొ
వట్టి సంఘటనలు వ్రాసుకొవచ్చు,వాటిపై అనుభూతులు,అభిప్రాయాలు వివరించకుండా.ఎప్పుడేమి జరిగిందో తరవాత చూసుకోవచ్చు.ప్రమాద కరమైన విషయాలు తప్పించి డైరీ వ్రాసుకోవడం ఉపయోగకరమైనదే!ఆ!ఏమున్నాయి వ్రాసుకోడానికి అని అనుకోకండి.డైరీని ఒకచోట మీకెదురుగా పెట్టుకోండి.ఏరోజుకారోజు ఏదో ఒకటి వ్రాయాలనే స్పృహ కలుగుతుంది.ఒకరోజు మీరువిన్న,లేక మీకు గుర్తుకు వచ్చిన పాటో, పద్యమో వ్రాయండి.చక్కటి సామెత, సూక్తి ,ఒకశ్లోకము,వ్రాయండి.ఒకరోజు ఒక కవిపేరు,ఆయన రచనలు వ్రాయండి.ఒకదేశ సేవకుని వివరాలు వ్రాయండి.మన రాష్ట్రములో మీకుతెలిసిన వూర్ల పేర్లు వ్రాయండి.ఆశ్చర్యము,దుఖము,గర్వము,సంతోషము కలిగించిన వార్త వ్రాయండి. కొత్త వంటకం గురించి వ్రాయండి.చిట్కాలు వ్రాయండి.డైరీ మాత్రం ఎదురుగా పెట్టుకోండి.ఏమో!మస్తిష్కం లోంచి ఎప్పుడే అక్షరాల నక్షత్రాలు వ్రాలతాయో ఆకాగితాలమీద.కొత్త అనే మాటలోనే ఒక సందేశం వుంది.ఆశందేశాన్నందుకొని ముందుకు నడుద్దాము.ఈసంవత్సరం అందరికి కొత్తకొత్తగా నవ్వులుపువ్వులుగా నడవాలని ఆర్డర్ వేస్తున్నా.
1 comment:
డైరీ గురి౦చి దాని ఉపయోగాల గురి౦చి బాగా వ్రాసారు. కాని ఈ స్పీడు యుగ౦లో డైరీ వ్రాసే తీరిక ఓపిక ఎవ్వరికీ కనపడట౦ లేదు.
Post a Comment