దారులు
దారులు,దారులు,దారులు
బారులు తీర్చిన దారులు
దట్టమైన అడవినుంచి
దరిచేర్చే దారులు
రాతికొండ గుండెగుహల
రివ్వున పోయేదారులు
అగాథమౌ సముద్రాల
అలల పైన రహదారులు
అంతులేని ఆకశాన
అంతులేని రహ దారులు
అదృశ్యంగా వడిగా
సంద్రపు ఆవలివైపుకు దారులు
దారిలేందే ప్రగతిలేదు
ప్రగతి లేందే సుగతి లేదు
అందుకే నవ మానవుడు
ఆత్రంగా వేసుకొన్నాడు
ప్రకృతి కాంత గుండెలపై
మల్లెల మాలల దారులు
No comments:
Post a Comment