ఎన్నో ఏళ్ళ మజిలీలు దాటాయి
మళ్ళీ మరో మజిలీ
కాలపురుషుని చేతిలో
మూడువందల అరవై ఎనిమిది
రోజుల కార్యక్రమాల
కాలిబాట అందించడానికి
రేపే వస్తున్నాడు
శాంతి,క్రాంతి,కష్టం,,నష్టం
ఏమితెస్తాడో, ఏమంటాడో
అన్యాయాలు,అక్రమాలు
అత్యాచారాలు,అవినీతి
అడ్డుకొందాం,దొడ్డ మనసుతో
అందరిదీ ప్రాణమొక్కటే
అందరి సమ్మాన మొక్కటే
అందరిదీ ఒకటే నీతి
అందరికి ఒకటే న్యాయం
ఐకమత్యం సాధిద్దాం
వ్యష్టిభావనే వదిలేద్దాం
ఒకరి కొకరై
అందరుఒకటై
ఎవర్నేనా ఎదిరిద్దాం
ఏదేదో సాధిద్దాం
తెలుగుతల్లి చిరునవ్వుల
దివ్వెలు వెలిగిద్దాం
రెందువేల తొమ్మిదిని
పండగలా గడిపేద్దాం
3 comments:
ఎప్పుడూ మంచిని ఆకాంక్షించే మీకు నా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఈ సంవత్సరమంతా శుభం చేకూరాలని కోరుకుంటూ...
ఎప్పుడూ మంచి ఆలోచనలే చెయ్యాలి అన్న
సందేశాన్ని మాకు ఇవ్వటమే కాకుండా, ఎలా
చెయ్యాలో మీ టపాల ద్వారా చూపిస్తున్నారు.
మీకు కృతజ్ఞతలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా.
Post a Comment