చదవండి
కెనడా లో ఒక స్కూల్ వాళ్లు ఒకప్రకటన చేసారుట " చేతిలో పనులన్నీ
కిందపడేసి పుస్తకం చదవండి "అని.అది ఎలాగా కేవలం విద్యార్దు లేకాదు
స్కూలు లో పని చేసే ప్రతివారూ.ఒకరోజుకాదు,ఒక వారం రోజులు.ఒకేటైముకి ౨౦ నిముషాల పాటు అందరూ పుస్తకం చదవాలి.
వారి వుద్దేశ్యం అలా అందరూ చదవడం వల్ల యువతరం వారిలో ఒక
చైతన్యం వస్తుందని,అక్షరాస్యత పెరుగు తుందని, వారికి గ్రంధాలయాల
విలువ తెలుస్తుందని.అలా వరసగా వారం రోజులు చదివిన వారికి
బహుమతులు కూడా ఇచ్చారట. బహుమతులు బయట వారు అందిస్తే
వారికీ ప్రచారం కల్పిస్తామని చెప్పారట.బహుమతులు యువతకి పనికి వచ్చేలా పెన్నులు,పుస్తకాలు,సి.డి లు ,వార పత్రికలూ, విజ్ఞాన దాయక మైన సినిమాలు ఇయ్యాలని సూచించారట.
పిల్లలు అన్నం తినక పొతే ఎన్నివిధాల బ్రతిమాలి, రక రకాల కూరలు చేసి అమ్మ అన్నం తినిపిస్తుందో,పుస్తకము చదివించేందుకు కూడా అలా
శ్రద్ధ తీసుకోని చదివించాలి.
విదేశాలలో గ్రంధాలయాలు ఎంతో ఆకర్శణీయమ్గా వుంటాయి.ఒక
పేటలో నివసించేవారు అక్కడవున్న గ్రంధాలయంలో మెంబర్లయి పోతారు.
ఇంటికి పుస్తకాలు ఒకటికంటే ఎక్కువే తెచ్చు కోవచ్చు.పుష్టం పోస్టులో
వారికి పంపవచ్చు, మధ్యలో హుష్ కాకి అయిపోవు.పుస్తకం ఇచ్చేగడువుని వారు గుర్తు చేస్తారు. గ్రంధాలయాల లో ఎన్నో రకాల పోటి లు ఆబాల గోపాలానికి పెడతారు.పెద్ద వాళ్ల చేత ఉపన్యాసా లిప్పిస్తారు,
సంగిత కచేరీలు ఏర్పాటు చేస్తారు.మంచి సినిమా చూస్తూ భోజనాలు చేసే ఏర్పాటు చేస్తారు.వ్యాయామాలు,డాన్స్ కోర్సులు నడుపుతారు.ఫీజులు వుంటాయి,సమయ ము ఎప్పుడో,ఎంత కట్టాలో కరపత్రాలు అచ్చువేసి పంచుతారు.చిన్నపిల్లలకి వేరే పోటీలు వుంటాయి.ఎవరెక్కువ పుస్తకాలు చదివితే వారికి బహుమతులు వుంటాయి.
పిల్లల పుస్తకాలు చక్కటి పేపరు పై,ముచ్చటైన రంగులతో ముద్రించి నవి వుంటాయి.పుస్తక చౌర్యాలు జరగవు.ఏదైనా పుస్తకం కావాలని అడిగితె తెప్పించి మనకు తెలియ చేస్తారు.
గ్రంధాలయాలుచదివించాలనే ఆశయం తోనేకాక ఆశయ సిద్ది కోసం
ఎన్నో విధాలుగా ప్రజలని తమ వేపుకు తిప్పుకోటానికి ప్రయత్నాలు చేస్తే నిష్ఫలం కావు. పిల్లలకు పుస్తకాలు చదవమని చెప్పే పెద్దలు తామూ చదువుతూ వారిని చదివించాలి.మేము టి.వి చూస్తాము,మేము సినిమాకేల్తాము నువ్వు చదువు అంటే వారికి మనసు నిలవదు.చేసి చేయించండి అప్పుడే పిల్లలకి హేచ్చరించ వలసిన అవుసరం రాదు.పుస్తకాలు చదివితే ఏకాగ్రత, అవగాహనా శక్తి ,ధారణా శక్తి ,స్థిమితము ఏర్పడుతాయి.కొన్ని నిముషాలయినా పుస్తకం పుచ్చుకు
కూర్చునే వాతావరణంకల్పించి ఉత్సుకతను కల్పించండి.పెద్దయాక వాళ్ళకే తెలుస్తూంది పుస్తకాలని మించిన మిత్రులు లేరని. పైగా ౧౫ ఏళ్ళ లోపున చదివిన పాటా,మాటా, పద్యం జీవితాంతము గుర్తు వుంటాయి.
No comments:
Post a Comment