Pages

Sunday, January 18, 2009

ఆశేశ్వరుడు

ఆశేశ్వరుడు

సిరివెన్నెల

మురిపెముగా జాలువారుతోంది యమైన ఒడ్డున.వెన్నెలంతా బృందావనం వేపే జరుగుతున్నట్లుగావుంది. పిల్లగాలి మెల్లగా వెళ్లి అడిగింది.

"అంత నిశ్శబ్దంగా బృందావనం వేపెచూస్తూ వెళ్తున్నావు ఏమిటి విశేషం?అని.

"ష్ ,మాట్లాడకు అపురూప మైన కృష్ణావతారాన్ని గుండెల్లో దాచుకు సంతోషాతిరేకం తో

ఉబ్బి తబ్బిబ్బవుతున్నది బృంద.గుండెల్లో ఆనందం గొంతులో చిక్కుకొని ,కపోలాలని కందించి వెలుతురుని వడబోసి కళ్ళల్లో నింపింది.బృంద కళ్లు వెండి చేపల్లా మిలమిల మంటున్నాయి.ఆ ఆనందం కాస్త నేనూ చవిచూద్దామని వెళ్తున్నాను.నేనయితే మూగగా వెళ్ళివస్తా,నువ్వు అలా కాదుగా,కాస్త ఆనందం వస్తే ఈలలు వేసి గోల చేస్తావు.చెట్టులో కొమ్మలో దూరి సంగీతాలు ఆలపిస్తావు.నువ్వు నాతొ రాకు బాబూ"అంది వెన్నెల.

"నాకామాత్రం తెలియదా?నీకు ప్రసరించడం ఎంత బాగా తెలుసో నాకు స్థంభించడం అంత బాగా తెలుసు.పద వెళ్దాము అన్నాడు మలయమారుతుడు.ఇద్దరూ బయలు దేరారు.

ఆదివిష్ణువు అందాల సుందరాకారుడై నందుని ఇంట అవతరిస్తే అమందానంద కందళిత హృదయార

No comments: