వానలో గుమ్మడి ఒడియాలు
నామనసు చిన్నబోయింది."పోనీలెండి మీరు అమలాపురం వెళ్తున్నారుగా
అక్కడ మీవేలు విడిచిన మేనత్త వుండండి,ఆవిడ ని చేసి పెట్ట మనండి.అంది అమ్మాయి.మర్నాడు అల్లుడు అమలాపురం వెళ్ళాడు.నాలుగురోజుల తరవాత తిరిగి వచ్చాడు.ఈలోపున నాకు తెలిసిన వాళ్ళందరికీ గుమ్మడికాయగురించి వాకబు చేయమని చేపుతూనేవున్నా.
మా వారికి కూరతినడమే కానీ తేవాలని తెలియదు.ఇలాటి పనులు చెపుతే
ఆయన చెవుల్లో ఇన్ స్టాంట్ గా చెట్లు మొలుస్తాయి.
అల్లుడు వస్తూ వస్తూ కడవంత గుమ్మడికాయ మోసుకొచ్చాడు.ఆనందం నిండిన కళ్ళతో అది నాచేతికే ఇచ్చాడు."ఎంతపెద్ద కాయో?పట్టుకొంటే నాచేతులు కిందకి వంగి పోయాయి.మా అమ్మమ్మ అనేది గుమ్మడికాయ ఆడవాళ్ళు పగల కొట్ట
కూడదని.మాతాతయ్య కొడితే అమ్మమ్మ ముక్కలు కోసేది.ఈయన ఆరింటికే బయటికి వెళ్లిపోయారు.అల్లుణ్ణి అడగక తప్పలేదు.గుమ్మడికాయ నేలకేసి కొట్టమంటే అతనెంతో నోచ్చుకొన్నాడు.
కాయ చేతిలో పుచ్చుకొని "కొట్టాలా? నేలకేసికొట్టనా?"అని సుతారంగా
పడేసాడు."అయ్యో సోకు నేకోత్తనా?అనికొంగు నడుముకు దోపింది.నేను
ఆగు అని సైగ చేశా.ఘట్టిగా కొట్టనా?అన్నాడుఅల్లుడు.పగాలాలంటే మీరు వడియాలు తినాలంటే అంతేమరి,అందిఅమ్మాయి.ఈమాటు దభీమని కాయ నేలకేసి కొట్టాడు.కాయ పగిలి ముక్కలు ఇల్లంతా చిన్డాయి.ఇవన్నీ
ముక్కలు కొయ్యాలి బాబోయ్ ,అనిపించింది.మా అమ్మాయి కొంచెం తేరుకొని "మీ అత్తయ్య ఇంట్లో వడియాలు తినిరలేదా?అంది.
"ఆవిడ వూళ్ళో లేదు,తో టలోకాసిందని మామయ్య కోసి ఇచ్చాడు.ఎంత పెద్దకాయో! బాగుంది కదా?"అన్నాడు.గారెల కోసం పిండి గ్రైండ్ చేశాను,దానితోనే వడియాలు చేస్తేసరి అనుకోని ముక్కలు కోయడానికి కూర్చున్నాను.కత్తిపీట కాకేత్తుకుపోయింది.చాకులదే రాజ్యం.కాని ఈచిన్న చాకుతో ఎలాకోయడం?గుమ్మడి ముదిరి పెచ్చు దేకోలెం చెక్కలా ఘట్టిగావుంది.కాయంతా అరచేయ్యంత ముక్కలు చేసిపెట్టా.మెత్తని భాగం పైపైన కోసి చిన్నముక్కలు చేశా ,వాటిని ఉప్పు వేసి దంచి పాట బట్టలో మూటకట్టి ముడేసి దానిమీద ఎత్తు రోలు పెట్టాలి.ఎన్నాళ్ళుగానో రోలు, పచ్చడి బండ ఇంట్లో వున్నాయి.వాటిని వాడి చస్తేగా.మిక్సీలు వచ్చాయిగా వాటి మొఖమే చూడటంలా.ఈమధ్య మాచేల్లెలి కూతురి పెళ్ళికి పసుపు దంచడానికి కావాలంటే ఇచ్చా.ఇపుడు దీనిమీదేం ఎత్తు పెట్టాలి.నీరు ఓడకపోతే పిండి జావ జావ అవుతుంది.జై పూర్ నుంచి తెచ్చిన గ్రానేటు అప్పడాల పీట పెట్టి,దానిమీద అలూల బుట్ట పెట్టి,దానిమీద వుల్లిపాయల బుట్ట పెట్టా.వానాకాలం.పతివ్రత కన్నీళ్ళలా వాన నిశ్శబ్దంగా కురుస్తూనేవుంది.ఈ గుమ్మడికాయ ముక్కలు ఆరకపోతే బూజు పడతాయి.ఫ్రిజ్ లో పెడదామా అంటే అదీ నమ్మకం లేదు.ఆఘట్టి ముక్కలు ఎలాతరగాలి?పనిఅమ్మాయి వస్తే దాన్ని బతిమాలదాం అనుకోని అది తోమాల్సిన గిన్నెలు నేనే తోమి అడిరాగానే గ్లాసుడు టి.ఇచ్చి టి.వి ఆం చేసి,చాలా సౌమ్యంగా "గుమ్మడికాయ ముక్కలు తరిగి పెట్టాలే!"అన్నా.అప్పటికి చేస్తా"అని వెళ్ళిపోయింది.
No comments:
Post a Comment