వానలోగుమ్మడి ఒడియాలు
పెళ్లి అయి అమెరికా వెళ్ళాకా మా అమ్మాయి రెండుమూడు సార్లు వచ్చి వెళ్ళింది.కాని అల్లుడుగారికి రావడం కుదరలేదు.ఎ పెళ్ళో ,వడుగో అయినా విదేశాలలో వాళ్లు కాళ్ళు కదపడం కష్టమే!దూరమూ, ధనాభారము,శెలవుల బేరమూ పాలపొంగు లాటి వాళ్ల+మన ఆశలమీద నీళ్లు చల్లుతూ వుంటాయి.మనకేమో మామిడాకు గుమ్మానికి తోరణం కట్టగానే మనవాళ్ళందరూ రావాలనిపిస్తుంది.వాళ్ళతో సంప్రదించి ముహూర్తాలు పెట్టినా ఒకోకసారి వీలుపడదు.అమ్మాయితరఫు శుభాకార్యమయితే అమ్మాయి,అబ్బాయి తరఫు శుభ కార్యమయితే అబ్బాయిఎలాగో వస్తారు.ఒక్కొక్కరే వస్తే వెలితిగానే వుంటుంది.మల్లెపూలు కనకాంబరాలు కలిపి మాలకడితే వచ్చే అందం వేరు.ఒక్క మల్లె పూలతో ఒక్క కనకామ్బరాలతో మాల కడితే వచ్చే అందం వేరు .అల్లుడూ,అమ్మాయి కలిసి రావాలని నాకోరిక.ఎక్కడికక్కడికే వెంకట లక్ష్మి అని సరిపెట్టుకోవాలి . ఈమాటు మా అల్లుడికి నెలరోజులు ఇండియాలో పని చేయమని అనుకోకుండా ఆర్డర్ వేసారు.అమ్మాయికూడా వస్తున్నానని వ్రాసింది.అబ్బ!ఎంత ఆనందమో!ఇల్లంతా కిందా మీదా చేసి
సర్ది ,కరక్కాయలు కాన్నించి సరుకులు తెప్పించి {అల్లుడికి ఏమి లోటు రాకూడదు కదా!}నాలుగు రకాల కారంపింది వంటలు,ఒక్తీపి పిందివంతా చేసి ఎదురుచూసాను.
ఎన్నాళ్ళకో అల్లుడు వచ్చాడుఅందుకని అతనికేమి ఇష్టమో అమ్మాయిని కనుక్కొని వంట చేశాను.అల్లుడు భోజనం చేస్తూ "నువ్విలా చేయవెం పులుసు?పులుసంటే నీకు అలుసు.అన్నాడు.ఆహా!ఇప్పుడసలు పులుసు రుచి తెలిసిందా?అక్కడయితే నేచేసిన పులుసు అమృతంలా తాగేవారు.అన్నది.వాళ్లమాటలుకత్తిరిస్తూ"నెయ్యివెయ్యమంటారా?
అన్నాను. నన్ను పొగడినందుకు వచ్చిన గర్వం అప్రయత్నంగా గొంతులో ధ్వనించింది.ఏమిటో ఆడ వాళ్ల మనసు కాస్త పొగడగానే పులకా లాగా పొంగి పోతుంది."గుమ్మడికాయ వడియాలు దొరుకుతాయా?"అన్నాడు అల్లుడు."ఆ!వున్నాయి,వేగిస్తాను,నిముషం అని వేగించి పట్టు కెళ్ళాను.
ప్లేటు లో వేయబోతూంటే "అబ్బే!ఇవికావండీ!పచ్చి వడియాలు"అన్నాడు.
అప్పుడు గుర్తుకు వచ్చింది,ఓహో!వీళ్ళు గోదావరి జిల్లా వాల్లుకదా,గుమ్మడికాయ వడియాలు ఎండ బెట్టకుండానే పచ్చివి నూనెలో
వేయించుకు తింటారు.గుమ్మడికాయ తెప్పించి రేపుచేస్తా!అన్నాను .అల్లుడిమొఖం అరవిందం లా వికసించింది ."రేపు చెయ్యండి,మళ్ళి నేను సర్వే కి టూర్ వెళ్ళాలి"అన్నాడు.నేను తలూపాను.భోజనాలయాక డైలీఫ్రెష్కి ఫోన్చేశాను"బూడిదగుమ్మడికాయవుందా?"అని."వుంది".అనిజవాబు.
చెప్పులు వేసుకు బయల్దేరి వెళ్లి చూసా!ఎక్కడా గుమ్మడికాయ కనపడ లేదు."ఏది!గుమ్మడికాయ వుందన్నారు?""ఇదుగోనండీ!అనిఅతను స్టోర్ రూంలోకి వెళ్లి హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చినట్లు తియ్య గుమ్మడి పండు ఒకటి తెచ్చాడు.ఇదికాదండీ!బూడిద గుమ్మడికాయ కావాలి వడియాలు పెడతారు,సాంబారులో వేస్తారు,కూట్చేస్తారు,హల్వా కూడా చేస్తారు అదిఅన్నా".అదా!అది లేదండీ!"మరినేను ఫోన్ లో అడిగితె వుందన్నారు?""బూడిద అనే మాట వినపదలేదండీ!గుమ్మడి అనే మాట ఒక్కటే వినిపించింది."నా వాచా దోషమో,డోర్ భాశాయంత్ర చాకచక్యమోఅనుకొని "పోనీ రేపు తెప్పిస్తారా?""సరిగ్గా పదకొండు గంటలకల్లా రండి.""సరే!మర్చిపోకండి."అనిమెట్లు దిగుతూచెప్పివచ్చేసా.
మర్నాడు పదకొండు గంటలకల్లా పనులన్నీ సగం లో వదిలేసి ఫ్రెష్ కి వెళ్ళా.వానులోంచి తాజాకూరలు గోనె సంచుల్లో,ప్లాస్టిక్ సంచుల్లోదిగాయి.
హమ్మయ్య!సమయానికే వచ్చా అనుకోని"ముందు గుమ్మడికాయల సంచి తీయండి,నాకొకటి ఇస్తే నే వెళతా "అన్నా.సంచులు దొర్లించి "బూడిద గుమ్మడి దొరకలేదటమ్మా!"దొరకలేదా?అన్నానుగాని సంచుల్లో వున్నాయేమో అని ఆశతో అవన్నీ తీసేదాకా నుంచున్నా.ఇంతలొ మా అమ్మాయి వచ్చింది."ఇక్కడే వున్నావా?""అవునే!గుమ్మడికాయ లేదుట.పోనీ రైతు బజారు కి వెళ్దామా?""నీ పిచ్చిగానీ అక్కడమాత్రం వుంటాయని నమ్మకమేమిటి?"పాపం అల్లుడు అడిగాడే!"'పాపం లేదు,పుణ్యం లేదు,చేసిపెట్టే వాళ్ళుంటే ఆయన అట్లా అడుగుతూనే వుంటారు.పద,జనరల్ బజారుకి వెళ్ళాలి."అంది.
అనుకోన్నట్లుగానే అల్లుడు భోజనం దగ్గర కూర్చోగానే"వదియాలేవీ?
అనిఅమ్మాయిని అడుగుతున్నాడు."గుమ్మడికాయేదొరకనిదే వడియాలేలా వస్తాయండీ?మీరు త్వరగా తినండి. బజారెల్లాలి ,అంది.
No comments:
Post a Comment