Pages

Tuesday, May 26, 2009

పని చేయడం ఎలా?

పనిచేయడం ఎలా?
పనిచెయ్యాలన్నా చెడిపోయిన వస్తువు బాగు చెయ్యాలన్నా
వాటికి తగిన వుపకరణాలు చాలా అవుసరం. ఉపాయాలు కూడా కావాలి.సులువుకోసం చే సే ప్రయత్నంలోంచే కొత్త కొత్త ఉపాయాలు, ఉపకరణాలు పుట్టుకువస్తాయి.డబల్ కాట్ మంచంమీద డన్లప్ పరుపులు
వేస్తె మంచానికి తలాపు దిక్కున ,కాళ్ళ వేపు వుండే చేక్కకి డన్లప్ పరుపుకి మధ్య చెయ్యి దూరే సందు వుండదు.పక్క ముడతలు లేకుండా వెయ్యాలంటే దుప్పటిని పరుపుకిన్డకి మడిస్తేనేగాని అవదు.పరుపుఎత్తి
దుప్పటి కిందకి మడవాలంటే అదోపెద్ద ప్రయత్నం,మంచం చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేస్తే గాని పని అవదు.మాచేల్లెలు వచ్చింది.ఎవరూలేకపోతే మనమే చేసుకొంటాముగాని,ఎవరేనా వుంటే సాయం అడగాలనిపిస్తుంది."పక్క మారుద్దాం రావే!"అన్నాను.అది అట్లకాడ పట్టుకువచ్చింది."ఇదేందుకే చంద్రా "అన్నా. చెపుతా అంది,దుప్పటి పరిచాక తలవేపు కాళ్ళవేపు దుప్పటిని అట్లకాడతో లోపలికి తోసింది.పని ఇట్టే అయిపొయింది.బాగుందే అన్నాను.
యు.ఎస్.లో మొన్న మా అబ్బాయి వాళ్లు ఫర్నిచర్ కొన్నారు.మావాడి ఫ్రెండ్ కొత్తగా అన్ని కొనుక్కొన్నాడు,తండ్రికి బాగాలేదని ఇండియా వచ్చేయమని అంటే వెళ్ళిపోతూ సామాను అమ్మేశాడు.వాళ్ళిల్లు మాఇంటికి దగ్గరే అవన్నీ వూడదీయాడ మెందుకని అలానే తెచ్చుకొండానికి వర్కేర్ని పిలిచారు.వస్తువులు బరువుగా అద్దాలతో వున్నాయి.ట్రక్కు తెచ్చాడతను.ఎలాతెస్తాడా?అద్దాలు పగులుతాఎమో?అనుకొన్నాను.రెండు చక్రాలున్న చేటంత చెక్కలు తెచ్చాడు,అద్దాల బీరువాని దానిమీద పడుకోపెట్టి చిన్నపిల్లలు బండీ లాక్కువచ్చినట్లు వాల్లిన్టినుంచి మా ఇంటి దాకా లాక్కువచ్చాడు.ఇంటి గుమ్మం లోపల ఒక రోజాయి లాటిది పరిచి అందరు సాయం పట్టి దానిమీద నుంచోపెట్టి మెల్లాగా ఆరోజాయిని తోసుకొంటూ లోపలికి తెచ్చాడు.రోజాయి పరవడం మూలాన చెక్కనేలమీద గీతాలు పడవు,లాగడం సులభమయింది. చిన్న వస్తువులకి కుషనులు వున్న
ప్లాస్టిక్ ప్లేట్లవంటివి తెచ్చి నాలుగుకోళ్ళ కింద పెట్టి లాక్కు వచ్చాడు.
ఒక్క వస్తువు పాడవకుండా ఉపాయం గా సులువుగా పనిచేసాడు.
హైదరాబాదులో జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.మాఇంట్లో పుష్కలం గా వుండేవి,పుస్తకాలు, పేపర్లు,సూదులు,దారాలు,కత్తిరించిన బట్టల ముక్కలు,పూసలు,చిన్న చిన్న ఖాళి సీసాలు,డబ్బాలు,ఫాబ్రిక్ పెయింట్స్
"వున్నది పుష్టి మానవులకు" అన్నట్లు దాస్తూ వుంటాను.పుస్తకాలు ప్రతి నెలా దులిపి సర్డుకోకపోతే బాగుండవు.అన్ని చదువుకోవచ్చని దాచాను.ఓపిక తగ్గిపోయిందని పుస్తకాలు పంపిణి చేస్తేమంచిదని,ఎవరికీ ఏమి పుస్తకాలు కావాలో అడిగి ఇచ్చేసినాక ఇంకాకొన్ని పుస్తకాలు ఒక వృద్ధ ఆశ్రమానికి ఇచ్చాను.అవి పెట్టుకునేందుకు అడ్డలున్న స్టీలు షెల్ఫ్
కూడా ఇస్తానన్నాను.పాపం వాళ్లు నన్నే తీసుకురమ్మనకుండా మనిషిని ట్రక్కు ఇచ్చి పంపారు.మేము సెకండ్ ఫ్లోర్ లో వుంటాము.షెల్ఫ్ లిఫ్ట్ లో
పట్టలేదు,మెట్లమీద నుంచి తీసుకెళ్ళారు.ఫస్టుఫ్లోర్ దగ్గర వంపుతిప్పుతూ ఒక అద్దం కాస్తా పగలకొట్టాడు. ప్రాణం ఉసూరు మంది. ఇచ్చిన వస్తువు వాళ్ళకి అందకుండానే పోయిందే?అని.కాని ఇక్కడవాల్లకి వున్నన్ని పనిముట్లు మనకి లేవేమో?
ఒక పని చేయాలంటే దానికి కావలసిన ఉపకరణాలు లేకుండానే వస్తారు.చెంబుఇయ్యండి,పాత బట్ట ఇయ్యండి, సోపుఇయ్యండి,బకెట్ ఇయ్యండి,కొబ్బరినూనె ఇయ్యండి,స్క్రూడ్రైవరు ఇవ్వండి,ఇలా అడుగుతూ వుంటారు.రిపేరు చేస్తే రెండురోజుల్లో మళ్ళి తయారు.

No comments: