గ్రా డ్యు ఎ షన్
పిల్లల్ని బాగా పెంచాలి,చదివించాలి అని తలితండ్రులకి ఎన్నో ఆశ
లుంటాయి.ఆ ఆ శలకి దోహదం కలిగి మంచి వాతావరణం ,మంచి స్కూలు,
ఖర్చు పెట్టేందుకు తగినంత ధనమ్ వుంటే ముందుకు సాగ వచ్చు.తలితండ్రులకు ఉత్సాహం వున్నా కలిసిరాకపోవచ్చు.కొన్ని కొన్ని
ప్రదేశాలను బట్టి మంచి స్కూళ్ళు దొరుకుతాయి.ఈ రోజుల్లో పిల్లలకు మంచి అవకాశాలు,ప్రోత్సాహము లభిస్తున్నాయి.విదేశాలలో పిల్లల స్కూళ్ళు చూస్తె ఆహ్లాదకరంగా వుంటాయి.పిల్లల మనస్సులను స్కూలుపట్ల
ఆకర్శింప చేసేందుకు వారు ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూవుంటారు.
మా అబ్బాయి పిహెచ్ .డి కాన్వోకషనుకి యు.ఎస్ వచ్చాను.
అక్కడినుంచి రాధిక దగ్గరికి వచ్చాను."రేపు మా అమ్మాయికి గ్రాడ్యు ఎషన్
పంక్షన్ వుంది,సరిగా సమయానికి వచ్చావు దొడ్డమ్మా!'అంది.గ్రాడ్యుకెశనా అన్నాను.దాని కూతురు చాలా చిన్నది.'ఇక్కడ పిల్లలకి నర్సరీ అయిపోగానే స్కూలువాళ్ళు గ్రాద్యుకేషన్ చేస్తారు.రేపు చూద్దువుగాని'అంది.మర్నాడు రాధిక దానిపాప సహనకి చక్కటి డ్రెస్సు
వేసింది.ముత్యాలు పగడాలు కలిపిన దండ వేసింది.ఏడు నెలల పసివాడు
జయ కార్తిక్ ని తీసుకొని స్కూలుకి వెళ్ళాము.నర్సరీ స్కూలుఒక హాలు,వరెండా .హాలులో ఒక వేపు డైనింగ్ టేబిల్ వుంది,చిన్నచిన్న కుర్చీలు వేసారు.గోడలు కనిపించకుండా పిల్లలు వేసిన బొమ్మలు అతికించారు.పక్షులు ఎగిరిపోతున్నట్లు పెద్దచిత్రంగీసి,"వుయ్ ఆరఫ్లైయింగ్
ఆఫ్ టు కిన్దర్ గార్టెన్ అని వ్రాసారు.గోడకి పెద్ద పేపర్ అంటించి దానిపై పిల్లల పేర్లు వ్రాసి కవర్లు అంటించారు. తలితన్ద్రులతో ఏదైనా చెప్పాలంటే
కార్డ్ మీద వ్రాసి ఆ కవర్లలో పెడతారు.వాళ్లు వచ్చినపుడు చూసుకొని జీతాలు అవి కట్టాలంటే కడతారు.
స్కూలు అంతా పిల్లలతో అమ్మానాన్నలతో నిండిపోయింది.అందరి చేతుల్లో కెమెరాలు సిద్ధంగా వున్నాయి.నల్లటిబట్ట
నల్లటి అట్టలతో టోపీలు గ్రాడ్యుకెశన్కి తయారు చేసారు.టోపికి గోల్డ్ కలర్ త్రాడు,కుచ్చులు వ్రేలాడుతోంది.పిల్లలందరూ ముచ్చటగా డ్రేస్స్లు లు వేసుకొన్నారు,మెడలో దండలు వేసుకొన్నారు,హైర్పిన్నులు వాళ్ళంతా ఆత్రంగా వున్నారు.పిల్లలకి టోపీలు పెట్టి వరెండాలో వరసగా నిన్చోపెట్టారు
టైం అయాక వాళ్ళని లోపలికి తీసుకువచ్చి బెంచీలపై కూర్చోపెట్టారు.ప్రిన్సిపాల్ చిన్న స్పీచ్ ఇచ్చింది.వీళ్ళకి డిగ్రీలు చిన్నాకాగితాలపై వ్రాసి టీచర్ సంతకం చేసినవి రోల్ చేసి ఒక పేము బాస్కేట్లో పెట్టి ఒక పిల్లవాని చేతికిచ్చారు.స్టూడెంట్ పేరు చదవగానే ఆడిగ్రీ
టీచెర్ చేతిలో పెడతాడు,పిల్లలు వచ్చి తీసుకొంటారు.థాంక్స్ చెప్పి వెళ్లి వాళ్ల జాగాలో కూర్చుంటారు.కొందరు బిక్కుబిక్కు మంటూ తీసుకొన్నారు,కొందరు పరుగెత్తి తెచ్చుకొన్నారు,వాళ్ల హావభావాల్ని తలి తండ్రులు కెమెరాలో బంధించారు.అప్పుడు వాళ్లమొఖాలు వెలిగిపోయాయి.పిల్లలు తలి తండ్రులు,పిల్లలు ఫ్రెండ్స్ ,పిల్లలు టీచర్లు ఫోటోలు తీసుకొన్నారు.గార్డెన్లో పది తెగ గెంతారు.
లంచ్ కోసం అందరూ తలో ఐటం తెచ్చారు,పిల్లల్ని టేబిల్ చుట్టూ కూర్చో పెట్టి తల్లులు,టీచర్లు తినిపించారు.తరవాత మా అందరికి లంచ్
పెట్టారు.సహనని తీసుకు ఇంటికి వచ్చాము.

No comments:
Post a Comment