Pages

Tuesday, August 11, 2009

గాజు పూసలు





గాజుపూసలు
"ఇందులోగాజుపూసలు ,గంటలు,అద్దాలు,టికిలీలు వున్నాయి అత్తయ్యగారూ వీటితో మీరేమైనా
చేస్తారా?అని ఒక ప్లాస్టిక్ సంచి ఇచ్చింది మాకోడలు,తీసుకొన్నాను.చూస్తె అందులో మెరిసే చిన్న చిన్న పూసలు వున్నాయి.మా చిన్నతనంలో ఇలాటి పూసలు జాకెట్లపై కుట్టుకోనేవారు. చేతిఅంచులకు
వ్రేలాడేలా ఆర్చీలు కుట్టే వారు.ఆతర్వాత ఎప్పుడు ఈపూసల వూసేరాలేదు.ఇంకా అందులో ప్లాస్టిక్ పూసలున్నాయి ఓమోస్తరు పెద్దవే.గోదుమగింజ ఆకారంలో ప్లాస్టిక్ పూసలు తెల్లవీ వున్నాయి.
ఆరోజుల్లో ఇలాటివే ఎరుపు,ఆకుపచ్చ,పసుపు పచ్చ ,నీలంకోటింగ్ కొట్టినట్లుగా గాజు పూసలు
వచ్చేవి.వాటితో పర్సులు కుట్టేవాళ్ళు. రంగురంగులుగా వుండి ఆకర్షణీయంగా వుండేవి.ఈ పూసలు
తెల్లగావున్నా వెండివాటిలా మెరుస్తున్నాయి. వాటితో ఏమన్నా చేద్దామని మొదలెట్టాను.*ఈ చుక్క
లాగా ఆరుపూసలు ఆరు కోణాలు గా గుచాలి,తరువాత రెండు కోణాల మధ్య ఒక పూస
వచ్చేలా గుచ్చాలి.ఆరుకోణాల మధ్య అయిదు పూసలు పడతాయి ఇలాగుచ్చితే పువ్వులా
వస్తుంది,ఆపువ్వుని ఆధారం చేసుకొని ముందుకు విస్తరించుకోవాలి మనకు కావలసిన కొలతలలో.
కాని అది గుర్తు రాదే! ఎన్నిసార్లు గుచ్చి తీసిపారేసానో! రెండు రాత్రులు నిద్ర లేదు.తెల్లారగానే మళ్ళి
శోధన ప్రారంభం .మనః ఫలకంపై ఆడిజైను వుండి,చేద్దామంటే రావడంలా.జయని అడిగాను "ఎలాగుచ్చాలే!నీకుతెలుసా!అని."ఆతెలుసు అంది. గళ్ళు గళ్ళు గా వచ్చేటట్లు గుచ్చినది,కాని
అదికాదు నాకు కావలసింది.హఠాత్తుగా ఒకరోజు నే కోరుకొన్న డిజైను వచ్చేసింది.ఎప్పటెప్పటి
విషయాలు మనసులో నిక్షిప్తమై వుంటాయికాబోలు! సాధన చేస్తే సంవత్సరాల పొరలు చీల్చుకొని
బయట పడతాయేమో!ఆడిజైను చూస్తె ఎంత ఆనందం వచ్చిందో! పాత స్నేహితురాల్ని చూసినట్లే!
వాల్ హాన్గార్స్ గంటలు ,పూసలతో తయారుచేసా.చిన్నపూసలుయ్యాల తయారుచేసా ,కత్తెరలు,దారాలు,హుక్కులు సేకరించి మొదలెట్టా .మంచి కాలక్షేపం తయారయింది.
రాధిక దగ్గరికి వెళ్ళినప్పుడు వాల్ హాన్గింగ్ గంటలది,సహనకి నెక్లెస్ ఇచ్చాను.
రాధిక అంది "ఇంకోమ్మా!ఇక్కడ జోఆన్ అనేశోపువుంది,నిన్నుతీసుకు వెళతా !నీకుకావలసినన్ని
దొరుకుతాయి అని తీసుకెళ్ళింది ,ఆ షాపులో ఎమేజింగ్,ఎన్నోరకాల పూసలు,సామగ్రి వున్నాయో
చెప్పలేను.ఆ షాప్ ఎంతో నచ్చేసింది.చెవులకి హాన్గింగ్లు తయారు చేయడానికి చిన్నకోక్కాలు,నేక్లేస్లకి
పెట్టె హుక్స్, నైలాంత్రేడ్ ,నైలాన్ వైరు ,కాపెర్ వైరు, కొనుక్కొన్నాను.పూసలతో కాంబినేషన్స్ పెట్టి
నెక్లెస్,బ్రేస్లేట్ ,హన్గింగ్స్ తయారుచేసా.సహన కూర్చుని"కెన్ఐ హెల్ప్ యు అమ్మమ్మా!అనేది.ఓకే అంటే
చెప్పిన ఆర్డర్ లో పూసలు అందించేది.గొలుసు పూర్తవగానే"ఈజ్ ఇట్ ఫర్ మీ అమ్మమ్మా!అని అవును
అంటే మెడలో పెట్టుకు "అమ్మా ,నాన్నా ! సీ మై నెక్లెస్ అని ఆనందంతో గంతులు వేసింది.చిన్న వస్తువుతో దాని కళ్ళు వెలిగిపోయాయి.నే వెళ్ళిన చోటల్లా ఆడ పిల్లలు నాకు దోస్తులయిపోయారు.జోఆన్ కు ప్రదక్షిణాలు చేస్తూనేవున్నా ! జో ఆన్లో డబ్బు పెట్టినకొద్దీ ఖరీదైన్ రాళ్ళు,పూసలు,పెండేంట్లురకరకాలు .
జోఆన్ లో ఫాబ్రిక్స్ అమ్ముతారు.వరలక్ష్మి వ్రతం వస్తున్నదికదా!జిగేల్ మనే
బట్ట కొని అమ్మవారికి పరికిణాలుకుట్టి ఇచ్చాను.సాయిబాబా విగ్రాహాలకి
శాలువాలు ,కృష్ణాష్టమి అని కృష్ణుడికి చొక్కాలు కుట్టాను.శానిఫ్రసిస్కో
జోఆన్ లోకోన్నబొంగారాల వంటి ప్లాస్టిక్ పూసలు రంగురంగులలో
మెరిసిపోతూ,మిడిసి పడిపోతూ వుంటాయి.వాటిముందు పచ్చలు,కెంపులు
ఎందుకనిపించింది.
మనం అనుకొంటాము ఒకేపేరుగల షాప్ కదా!అన్నిచోట్లా చూడటం ఎందుకులే!
అని.కొన్ని వేరుగావుంటాయి,కొన్ని రకాలు అసలు వుండనే వుండవు. శాన్ఫ్రాన్సిస్కో
లోకొన్న మెరిసే పూసలు అట్లాంటాలో లేవు.డాలస్ లో వున్నాయిగాని,అట్లాంటాలో
కొందాములే అని బద్ధకించాను. ఇక కేనక్తికట్ లో షాపే కన పడలేదింకా! నలుగురిని
వాకబు చెయ్యాలి.రాణికి పూసలుచూపిస్తే అది వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ కి రకరకాలు కొనేసింది.
ఒక పూటల్లా సెలెక్ట్ చేసాము.తమాషా కదా !చీరలు అంతే!బాగున్నచీరలన్ని ఎవరు
కొనలేరు.వాటిని మనప్రక్క వాళ్ళు కొనుక్కొంటే మనంకోన్నట్లే సంతోషం.ఆడబుద్ది,అందరు
అందంగా వుండాలని కోరిక.బగున్నయనుకోన్నకొన్ని పూసలుచూస్తేమేడ్ ఇన్ ఇండియా
అనివున్నాయి.అక్కడ అలాటివి చూడనేలేదు.ఎగుమతికోసంమంచివి పంపివుంటారు.
దేశ ప్రతిష్ట నిలబెడుతున్నారని గర్వపడ్డా .పిల్ల రాణీలు అనఘ,అనన్యలకు ఎ పట్టు పరికిణీ
మీదకి ఆరంగు గొలుసులు కావాలి.అవి వేసుకు గుడికి వెళ్ళాలి.వాళ్ళమ్మ పండగలప్పుడు
హడావుడి అవుతుందని ఈమాచింగ్లు అన్ని చూసి వేటికవి పూసలనగలతోసహా ఒక
పెట్టెలో సర్దిపేట్టెస్తుంది.దండ గుచ్చగానే పిల్లలు"అమ్మమ్మనాన {జ్ఞాన}చేసింది అని మురిసిపోయి
ఆరంగు పరికిణా లో దాచేసేది.ఒకరిదండలు ఒకరుముట్టుకో కూడదు కావాలని అడగకూడదు,
ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా!అమితి దండ కట్టేదాకా మర్యాదగా పూసలందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అవగానే "మమ్మమ్మా!ఫర్ మీ? అని ఇచ్చాక చిన్నగవ్వలు గుప్పెడు గిలకరించి పారబోసినట్లు కిలకిలా నవ్వేది.ఇకేవ్వరికైన దండ గుచ్చుతానేమోనని పూసలన్ని డబ్బాలో పెట్టి
మరీ ఇంటికి వెళ్ళేది.సిరి,సుమ పెద్ద వాళ్ళు గనక సిగ్గు పడుతూ ,సంకోచిస్తూ తీసుకోన్నారుగాని
వారిచిరునవ్వు వికసించడం నాకుత్రుప్తినిచ్చింది. ఈ పూసలమూలంగా చిన్నతల్లులందరూ ఎంతో
దగ్గరయారు.ఈసంబరం విలువేంటో చెప్పగలరా!

5 comments:

సుభద్ర said...

ఆకాశమ౦తా...........

సుభద్ర said...

మీ స౦బర౦ విలువ ఆకాశమ౦తా .......
ఇ౦క రె౦డు మూడవ ఫొటొ లొనివి చాలా అ౦ద౦ గా ఉన్నాయి.
మీరు మొద్దు, అని తిట్టన౦టే అవి హ్య౦గి౦గ్స్ అని అనుకు౦టూన్న.
కరక్టే నా!

సుభద్ర said...

మీ స౦బర౦ విలువ ఆకాశమ౦తా .......
ఇ౦క రె౦డు మూడవ ఫొటొ లొనివి చాలా అ౦ద౦ గా ఉన్నాయి.
మీరు మొద్దు, అని తిట్టన౦టే అవి హ్య౦గి౦గ్స్ అని అనుకు౦టూన్న.
కరక్టే నా!

సిరిసిరిమువ్వ said...

చాలా బాగున్నాయి. వెలకట్టలేని ఆభరణాలన్నమాట!

శ్రీలలిత said...

చాలా బాగున్నాయి. నాకు కూడా పూసలు, అల్లికలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా చేసేదాన్ని. ఇప్పుడు మర్చిపోయాను. మిమ్మల్ని చూసి మళ్ళీ గుర్తు చేసుకొవాలని అనిపిస్తోంది.