Pages

Thursday, August 13, 2009

శ్రీ కృష్ణభగవాన్

శ్రీ కృష్ణ భగవాన్
ఒకోకసారి మన అలవాట్లు, మన ఆలోచనలు కలిసిన వారు తటస్థ పడితే దగ్గిరయిపోతారు ఒకబాంక్ కి
నేను మా ఆయనా వెళ్ళాము . బ్యాంకు పని అయి వచ్చేస్తూవుంటే ఆ మానేజర్గారు "మీరెప్పుడైనా కాత్యాయని గుడికి వెళ్ళారా?అని అడిగారు.గుడిమీదుగా చక్రవర్తిగారిరోజ్ గార్డెన్ కి చాలాసార్లు వెళ్ళాము కాని గుడి కివెళ్ళ లేదు,అన్నాను. మిమ్మల్ని చూస్తె అడగాలనిపించింది ,మీకు దైవ భక్తీ ఉన్నట్టు అనిపించి అడుగుతున్నాను,మా ఆవిడ ప్రతి శుక్రవారం వెడుతుంది. నాకేమో ఆఫీసు ,పిల్లలకి స్కూలు ,ఒక్కతే వెడుతుంది.మీరు వస్తారంటే వచ్చి తీసుకు వెడుతుంది.అన్నాడు.అంతకంటేనా?తప్పకుందారమ్మనమని చెప్పండి.అన్నాను. అప్పటి నుంచి తను నేను క్రమం తప్పకుండా గుడికివెళ్ళే వాళ్లము .ఆగుడితో తరువాత చెప్పలేని అనుబంధం ఏర్పడింది.సుజాత వాళ్ళకి బొంబాయి
బదిలీ అయాక కల్పకం,సుశీల,ఉషారాణి కలిసి ప్రతి పౌర్ణమికి వెళ్ళే వాళ్లము. అది వేరే కథ.
ఒకరోజు సుజాత దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది.ఉడిపిలో కృష్ణ మందిరం వుండి.అక్కడే లక్ష గీతాలేఖన యజ్ఞ మందిరం కడుతున్నారు.అందులో భగవద్గీత వ్రాతప్రతులు పెడతారుట. భగవద్గీత ౧౮ అధ్యాయాలు శ్లోకాలు,తాత్పర్యంతో సహా ఏభాషలో నైనా వ్రాసి త్వరగా వారికి పంపుతే మంచిది.మీకు ఇలాటివి ఇష్టం గనుక వ్రాస్తున్నాను,అని ఉడిపి కృష్ణ మందిరం చిరునామా కూడా పంపింది.అలాగే వ్రాస్తానని జవాబు వ్రాసాను.కొత్త పుస్తకం తెప్పించి గీత దగ్గర పెట్టుకొని ఒక నెలలోపే ౧౮ అధ్యాయాలు వ్రాసి పోష్ట్ లో పంపాను.
మా ఇంటికి ఒక బంధువు వచ్చాడు.ఒక గోనె సంచి వెంట తెచ్చాడు.రోజు ఆయన బయటికి వెళ్ళే టప్పుడు న్యూస్ పేపర్లో ఏవో చుట్టి తీసుకెళ్ళే వాడు. ఆయన వూరువేల్లిపోతూ టాక్సీ ఎక్కుతుంటే గెస్ట్ రూంలోకి తొంగి చూచా.అక్కడొక పాకెట్ వుండి.ఏదో మర్చిపోయారు,తీసికేల్లండి అని పరుగెత్తు కెళ్ళి చెప్పా. "అది మేకేనన్డీ!అన్నాడాయన.మాకా!అని పేపర్తిఇసి చూస్తె అది ఒక కృష్ణ విగ్రహం.గన్మెటల్డి .సావిట్లోవీధి గుమ్మం ఎదురుగా ఒక కిటి కీ
లో పెట్టాను.పూలు పెట్టడం,బట్టలు కట్టడం ,గొలుసులు అలంకరించడం అలవాటయింది. వస్తూపోతూ ఆయన్నోకసారి పలకరించడం అలవాటయింది. కృష్ణాష్టమికి భగవద్గీత అంతా పారాయణ చేయడం మామూలయింది.మాకు ఐదో
అబ్బాయిలా అతుక్కు పోయాడు.
పిల్లలు విదేశాలకి వెళ్ళాకా వాళ్ళకి పంపుదామని నాలుగయిదు సార్లు పాక్ చేయడం, చోటు చాలక పోవడం మల్లి పాకెట్ విప్పి అలంకారం చేసి కితికిఇలో పెట్టడం ,ఇక ఈయనకి మనల్ని వదలడం ఇష్టం లేదు.ఎక్కడికో పంపాలన్నా ఆలోచనకి స్వస్తి చెప్పాము.మంచి,చెడు ఆయనతో ముచ్చ తించుకోవడం అలవాటయింది.మమ్మల్ని
చూచే భారం నిదె అని చెప్పుకొంటూ,కొద్దిరోజులు ఆయన్ని చూడకపోతే ఎలావున్నదో ఏమో !అని దిగులుగా వుంటుంది.వేదనా హరుడు ,పరిపాలకుడు,కరుణామయుడు,మాక్రుష్ణుడు.

No comments: