వరండా
మీ ఇంటికి ఓ వరండా వుందా?
లేకపోతె ఒకటి కట్టించు కొండి
అపరిచితులకు ఆశ్రయం ఇవ్వవచ్చు
ఆత్మీయులకుఆతిధ్యం ఇవ్వ వచ్చు
ఇంటికి,వాకిలికి మధ్య వర్తి వరండా
నిజానికి ఇది ఇల్లుకాదు,వాకిలి కాదు
ఇది ఇల్లు,వాకిలి రెండూకూడా
స్నేహితులతో వరండాలో కూర్చుని
కాఫీయో,టీయో ,బిస్కేట్లతోనూ
కారప్పూసతోనూ
కొంచెం,కొంచెం చప్పరిస్తుంటే
ఎన్ని భావాలూ!ఎన్ని కబుర్లూ!
ఊరి,వూరిస్తాయో!
అదే కొంచెం అందంగా వుంటే
వరండా కప్పు అంచున
చిన్ని నీలం పూల లత అల్లుకొంటే
సూర్యోదయం-సూర్యాస్తమయం
చంద్రోదయం ఫ్రీ గా చూడొచ్చు
వరండా గోడలకి
రంగులతో కుట్టిన చిలకలు
కిల కిల లాడుతుంటే
పక్కన -మామిడితోపో-తాటి తోపో
చిత్రించిన చిత్రంచిన్నతనాన్ని గుర్తు చేస్తూ
చిరుగాలికి కదలుతూంటే
వయసు మరిచి,వేదన తుడిచి
రేపుని,ఆ పై రేపుని
ఆహ్వానించ లేమా?
వరండా లేకపోతె
మనసునే వరండా చేసుకు
భావాలనే అతిథులు చేసుకు కాలాన్ని హాయిగా
అవుపోసన పట్టండి
టి.జ్ఞాన ప్రసూన
1 comment:
బావుందండీ మీ వరండా !
ఊళ్ళల్లో వరండా ఉండటం సహజమే ...కానీ ఈ అపార్ట్ మెంట్స్ లో కామన్ వరండా ఇచ్చినా ఉపయోగం ఉండదు . వెనుకవైపు బాల్కనీ లోనే కాఫీలూ , కబుర్లూ ...ప్చ్ ...సర్దుకుపోవాలి మరి .
Post a Comment