Pages

Thursday, October 29, 2009

అరుదైన గౌరవం

అరుదైన గౌరవం
ప్రొద్దున్నే పేపర్ తిరగేస్తుంటే " హైదరాబాదు మహిళకు అరుదైన గౌరవం "అని కనపడింది . అహా! మనవూరే! ఎవరికి? అని చదివాను. "కల్పలత "అనివుంది.ఇంకేమి? మా కల్పలతే అయివుంటుంది అనుకొన్నాను. కల్పలత ఫొటో వుంది. నెను తనని చూసి ఎన్నో ఏళ్ళయింది. చిన్నప్పటి కల్పలతే నా స్మ్రుతి పధం లో వుంది. తన చలాకి తనం, తెలివి తేటలు,
మర్యాద అయిన ప్రవర్తన ఏమిటో తను ప్రత్యేకం గా అనిపించేది. ఫోటోలో చూస్తే ఆకళ్ళు, ఆనవ్వు మన కల్పలతే అనుకొన్నాను.
చాలా కాలం కింద మా అక్కా,బావగారూ,దోమలగూడాలో వుండే వాళ్ళు.
మెము పక్క భాగంలో వుండే వాళ్ళము. కల్పలత వాళ్ళూ మాఇంటికి దగ్గరలోనే వుండే వారు.వాళ్ళింట్లో అందరమ్మాయిల పేర్లు లతలే! వాళ్ళ ఇంటికి "లతా నికుంజం" అని పేరు వుండేది. కల్పలత మా అక్కయ్య గారి అమ్మాయి ఉమ మంచి జిగరీ దోస్తులు. రోజు కలిసేవాళ్ళు.కల్పలత మాడపాటి హనుమంత రావు గారి స్కూలులో చదివింది. ఆ తరవాత
నేనా స్కూలు లో పని చెస్తానని ఎన్నడూ వూహించలేదు.ఇప్పుడు కల్ప లత "అమెరికన్ చష్ట్ ఫిజీషియన్స్ కాలేజీకి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నవెంబెర్ 1స్ట్ న బాధ్యతలు స్వీకరిస్తుంది. కల్ప లతకి "అరుదైన గౌరవం అందిందంటే మా వూరు అమ్మాయి, మా ఉమ స్నేహితురాలు,ఒకేవీధిలో వుండే వాళ్ళము,మా స్కూలు విద్యార్ధిని ఇన్ని కారణాలుగా
కల్పలత గురించి విని నా మనస్సు పొంగి పోయింది.
ఆర్భాటం గా అమెరికా వచ్చి ఆర్ధికంగా నిలదొక్కుకున్న వాళ్ళున్నారు.
ఈగడ్డ పై ప్రత్యేక గౌరవం అందుకొడంలో ఎంతో గర్వంగా వుంది. కల్ప్ లత చెసిన భ్రుహత్ కార్యక్రమాలు వ్యాసం లో పొందు పరిచారు,కల్పలత సాధించిన విజయం చదివి "ఆయురారోగ్యాభి వ్రుధ్ధిగ్గా ఆశీర్వ దిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన {సచిత}
28-10- 09 అంధ్ర జ్యోతి దినపత్రికలో ఈమె పై ప్రచురించిన వ్యాసం చదవండి.

1 comment:

భావన said...

చాలా సంతోషమండి. అమ్మాయి, అందులో మన దేశం అమ్మాయి, అందునా మన తెలుగమ్మాయి కి రావటం... చాలా సంతోషం. ఆంధ్రజ్యోతి లింక్ ఇచ్చి వుండవలసింది. అభినందనలు కల్ప లత గారికి.